జమిలి ఎన్నికల పై మరోసారి చర్చ

జమిలి ఎన్నికల పై మరోసారి చర్చ
. లోకసభకు ,రాష్ట్రాలలోని శాసన సభలకు దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిపే విధానాన్నే జమిలి ఎన్నికలు అంటారు . ఇదే వన్ నేషన్, వన్ ఎలక్షన్ , వన్ ఓటర్ లిస్ట్ దీనిపై నిర్ణయం జరగాలంటే ముందు రాజకీయపార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉంది . ఇది వస్తుందా ? దేశంలో ఉన్న రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు ఇందుకు అంగీకరించాలి . పార్లమెంట్ ఉభయ సభల్లో మెజార్టీ సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంది . దీనిపై కొంతకాలంగా చర్చ జరుగుతుంది . 1999 లో ఎన్నికల సంఘం ఒకే ఓటర్ లీస్ట్ అనే విషయాన్ని తెరపైకి తెచ్చింది . దేశం అంతా ఒకే ఓటర్ లిస్ట్ ఉండాలనే ప్రతిపాదనలపై సుదీర్ఘ కసరత్తే జరిగింది . దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ప్రధాని మోడీ . ఒకేసారి ఎన్నికలు జరగటంపై విస్తృతచర్చ జరగాల్సి ఉందని కూడా అన్నారు . గుజరాత్ లో జరిగిన శాసనసభ స్పీకర్ల 80 వార్షిక సమావేశంలో ప్రధాని మాటలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి .. అయితే ఇవి సాధ్యమేనా అంటే అంత తేలిక మాత్రంకాదనే వాదనలుకూడా ఉన్నాయి .కొందరు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్త్తున్నారు . రాష్ట్రాలలో ప్రభుత్వాలు మెజార్టీ కోల్పోయి పడిపోతే ఎన్నికలు జరపకుండా ఎలా సాద్యమనే అభిప్రాయాలు ఉన్నాయి . లోకసభకు కూడా మధ్యంతర ఎన్నికలు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్త్తున్నారు . బీజేపీ 2019 ఎన్నికల ప్రణాళికలో దేశం అంతా ఒకే ఓటర్ లీస్ట్ విషయాన్నీ ప్రస్తావించింది . ప్రధాని కార్యాలయం అఖిలపక్ష సమావేశాన్ని సైతం వేర్పాటు చేసింది . ఆసమావేశానికి అన్నిపార్టీలు హాజరు కాకాపోవటంతో ఏ నిర్ణయం తీసుకోకుండానే వాయిదావేశారు . దీనిపై ఒక కమిటీ ని కూడా నియమించారు . ఆ కమీటీ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యనం చేసింది . ఎన్నికల కమీషన్ , లా కమీషన్ కూడా ఇందుకు సానుకూలమైన నివేదిక ఇచ్చినట్లు తెలుస్తున్నది . జమిలి ఎన్నికలకు ప్రధాని పట్టుదలతో ఉండటంతో ఆదిశగా అడుగులు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి . గతంలో జమిలి ఎన్నికలు జరిగాయా అంటే జరిగాయి మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 లో జరగగా లోకసభతోపాటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వవించారు . తరువాత 1957 ,1962 , 1967 లలో కూడా ఒకే సారి ఎన్నికలు జరిగాయి . అనంతరం ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రీ మరణించటంతో ప్రధాని పదవికి జరిగిన పోటీతో కాంగ్రెస్ లో ఏర్పడిన విభేదాలవల్ల ఎన్నికలు విధానం గాడి తప్పింది . జమిలి ఎన్నికల వలన ప్రయోజనాలు ఏమిటి అంటే ఒకేసారి ఎన్నికలు జరపటంవల్ల ఖర్చు కలిసివస్తుందని . మాటిమాటికి ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకసారి అసెంబ్లీకి ,మరోసారి లోకసభకు మరోసారి స్థానికసంస్థల ఎన్నికలు జరపటం వల్ల ఎన్నికైన ప్రభుత్వ్యలాకు ఎన్నికలు జర్పటంతోనే కాలం సరిపోతుందనే వాదనలు ఉన్నాయి . ఎన్నికల పేరుతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతుందనే ొఅభిప్రాయాలు ఉన్నాయి . ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా అంటే కాదనే అంటున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు . ఇప్పటికే రాష్ట్రాలలో ఎన్నికలు వేరువేరు గా జరుగుతున్నాయి . ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగలిసిన ఎన్నికలు వేరు వేరు గా జరగటం ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాటి మాటికి ఎన్నికల వల్ల వ్యయం భారంగా మారుతుందని అంటున్నారు . జమిలి ఎన్నికలు సాధ్యం కాదు అనేవారి వాదన మరోలా ఉంది . ఐదు సంవత్సరాలకు ఎన్నికల వ్యయం 8 వేల కోట్ల ఓటర్లు 60 కోట్ల మంది ఉన్నారు ఒకొక్క ఓటర్ కు సాలీనా కేవలం 27 రూపాయలు మాత్రమే అవుతుందని అంటున్నారు . కేంద్ర బడ్జెట్ సంవత్సరానికి 30 లక్షల కోట్ల కాగా రాష్ట్రాల బడ్జెట్ 40 లక్షల కోట్ల వెరసి 70 లక్షల కోట్ల అవుతుంది . అందువల్ల ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇది సమస్య కాదు అనే వాదన వుంది . రెండవ విషయం ఎన్నికల కోడు ఎన్నికలు జరిగేదగ్గర కోడ్ ఉంటుంది కానీ దేశం అంతా ఉండదు కదా ? మూడవ విషయం లోకసభకు , రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగటం వలన రాష్ట్రాలలో ఉండే స్థానిక సమస్యలకు ప్రాధాన్యత తగ్గే ఆవకాశం ఉంటుందనే అభిప్రాయాలను పరిశీలకులు వ్యక్త్తం చేస్తున్నారు . అందు వల్ల జమిలి ఎన్నికలు జరపటం లో ఏమైనా రహస్య ఎజెండా ఉందా అనే సందేహాలు కూడా లేకపోలేదు . గతంలో రాష్ట్రపతి , ఇప్పుడు ప్రధాని జమిలి ఎన్నికలపై మాట్లాడటంతో జమిలి ఎన్నికలకు బీజేపీ సర్కార్ సిద్ధపడుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి . బీజేపీకి లోకసభలో మెజార్టీ ఉండటం , రాజ్యసభలోను ఆదిశగా అడుగులు పడటం ,మెజార్టీ రాష్ట్రాలలో అధికారంలో ఉండటంతో జమిలీపై కేంద్రం పెద్ద కసరత్తే చేస్తున్నట్లు అర్ధం అవుతుంది . మెజార్టీ రాష్ట్రాల శాసనసభలకు 2022 లో ఎన్నికలు జరగాల్సివుంది .అందువల్ల లోసభకు , మిగిలిన రాష్ట్రాలకు కూడా కలిపి ముందస్తుగానే ఎన్నికలు జరుపుతారా? లేక 2022 నుంచి జరగాల్సిన రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను వాయిదా వేసి 2024 లో లోకసభ తో పాటు అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు జరుపుతారా ? అనేది పార్లమెంటలో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాల్సిన చట్టపరమైన పని . తాము అధికారంలో లేని రాష్ట్రాలను ఒప్పిస్తారా లేక వారి అభిప్రాయాలను బుల్డోజ్ చేస్తారా? చూడాల్సిందే ?

This Document Typed Online Using –
https://telugu.indiatyping.com

Leave a Reply

%d bloggers like this: