– ఖమ్మం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మంత్రి అజయ్

– ఖమ్మం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మంత్రి అజయ్
-ఒకేసారి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు నలుగురు మంత్రులు ఖమ్మం రాక
ఖమ్మం అభివృద్ధిని మంత్రి అజయ్ పరుగులు పెట్టిస్త్తున్నాడనటంలో ఎలాంటి సందేహాలుకాని ,షష బిషలు కానీ ,లేవు. ఖమ్మం కు కొత్త సోకులతో రూపురేఖలు మారాయి . కొన్ని ప్రాంతాలు మినహా నగరంలోని ప్రధాన రోడ్లు అన్ని సుందరంగా తయారౌతున్నాయి . 10 సంవత్సరాల క్రితం ఖమ్మం ను చూసి ఇప్పుడు చూసినవాళ్లు అబ్బురపడుతున్నారు. ఇది మన ఖమ్మ మేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు . గతంలో కొంత అభివృద్ధి జరిగినా ఇప్పుడు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయి . మంత్రి అజయ్ మొండివాడు….. ముక్కుసూటితనం ……కక్ష సాధింపు ఉందని విమర్శకులు అంటున్నా వాటిని పట్టించుకోకుండా పని రాక్షసుడుగా తాను అనుకున్న లక్ష్యం వైపు పయనించటంలో వెనకడుగు వేయకుండా దృఢచిత్తంతో వ్యహరిస్తున్నాడు .ఖమ్మంను అభివృద్ధి చేయాలనే తపన ,తాపత్రేయం ఆయనలో ఉంది . తన మార్క్ అభివృద్ధిని చేసి చూపించాలనే పట్టుదల ఆయనలో కనిపిస్తుంది . నిజానికి టీ ఆర్ యస్ ప్రభుత్యంలో అయన మంత్రి కావటం ఖమ్మంకు మహర్దశ పట్టిందనే చెప్పాలి . అనేకమంది యోధనయోదులు ఖమ్మం నుంచి గెలిచినా ఎవరికీ రాని ఆవకాశం , అదృష్టం ఆయనకు వచ్చింది . జిల్లా చరిత్రలో ఖమ్మం నుంచి విజయం సాధించిన శాసనసభ్యుడికి రాష్ట్ర కేబినెట్ లో బెర్త్ దొరకటం 70 సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారి కావటం విశేషం . . ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఖమ్మం ఉన్నప్పటికీ ఇక్కడ్నుంచి అధికార పార్టీ సభ్యులు ఎన్నికకావటం రెండు మూడుసార్లు మాత్రమే జరిగింది . ఒకసారి అనంతరెడ్డి , మరోసారి యూనిస్ సుల్తాన్ లు కాంగ్రెస్ నుంచి ఎన్నికకాగా అధికారంలో కాంగ్రెస్ ఉన్నా అవకాశం రాలేదు . ఒక్క అనంతరెడ్డికి మాత్రం తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్ పదవి దక్కింది . తుమ్మల నాగేశ్వర్ రావు ఎన్నికైనప్పటికీ అప్పుడు ఆయన ఉన్న తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది . దీనితో ఖమ్మం నుంచి ఎన్నికైన అజయ్ మొదటిసారిగా మంత్రి అయ్యారు. అసలే పని రాక్షసుడుగా పేరున్న అజయ్ తనను గెలిపించిన ఖమ్మం ప్రజల ఋణం తీర్చికోవాలనే కసి పట్టుదలతో ఉన్నాడు . కెసిఆర్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు అజయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించారు . గెలిచిన కొద్దికాలానికే అధికార తెరాస లో చేరారు . ఖమ్మం ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశం తోనే తాను అధికారపార్టీలో చేరానని చెప్పారు . అప్పటినుంచే ఖమ్మం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు . కానీ అనుకున్న అవకాశాలు దొరకకపోటంతో కొంత నిరాశ చెందారు . అయినప్పటికీ ఖమ్మం అభివృద్ధిపై ఆయన పట్టుదలగా ముందుకు నడిచారు . రెండసారి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా అడుగులు వేస్తున్నారు . అందులో భాగంగానే ఐటీ హబ్ పై దృష్టి సారించి దాన్ని పూర్తిచేశారు . ఖమ్మం సుందరీకరణలో భాగంగా రోడ్లు వెడేల్పు చేసే కార్యక్రం చేపట్టారు . ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇల్లందు రోడ్డులో కోయచెలక వరకు నాలుగు లైన్ల రోడ్ వేర్పాటు , సెంట్రల్ లైటింగ్ ఖమ్మంకు కొత్త సొగసులు తెచ్చినట్లైంది . ముస్త్ఫానగర్ రోడ్ సుందరంగా తీర్చి దిద్దబడింది . అగ్రహారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ఖమ్మానికే హైలెట్ గా నిలవబోతుంది. వీటి ప్రారంభోత్సవాలకు కీ టీ ఆర్ తో పాటు డిసెంబర్ 2 న నలుగురు మంత్రులు ఖమ్మం కు వస్తున్నారు . కొత్త బస్టాండ్ నిర్మాణం మొదట నత్తనడకగా నడిచినప్పటికీ ఇప్పుడు వేగం పుంజుకుంది . రాష్ట్ర మంత్రివర్గంలో రవాణా శాఖా మంత్రిగా ఆయనే ఉండటంతో బస్సు స్టాండ్ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . ఇక డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కార్యక్రమం కొనసాగుతుంది . గొల్లపాడు కాలువ ఆక్రమణలను తొలగించటం నిర్మాణపనులు చేపట్టడం జరిగింది . లకారం ట్యాంక్ బండ్ చూపరులను ఆకర్షిసున్నది . మినీ ట్యాంకుబండ్ వాకర్ల కు ఆనందదాయకంగా మారింది . ఖమ్మం మునేరు రెండు వైపులా బండ్ నిర్మించి మంచి వాతావరణం ఏర్పాటు చేయటంతో పాటు వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ముఖ్య మంత్రి కెసిఆర్ కు ఉందని ఆవిషయాన్ని సీఎం స్వయంగా తనతో అన్నారని చెప్పటంతో ఖమ్మం ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్త్తం అవుతున్నాయి. ఇదే విధంగా ఖమ్మం కు రింగ్ రోడ్ , ఖమ్మం లో పెద్ద స్టేడియం , మంచి డిజిటల్ లైబ్రరీ , ఒక పెద్ద పార్క్,యూనివర్శిటీ ఏర్పాటు చేయాలనీ విద్య,వైద్య ,పారిశ్రామిక రంగాల హబ్ గా ఖమ్మంను తీర్చి దిద్దాలని ప్రజలు కోరుకొంటున్నారు . మంత్రి అజయ్ అద్వర్యం లో అవి సాకారం అవుతాయని ఆశిద్దాం …..

Leave a Reply

%d bloggers like this: