గ్రేటర్ లో పార్టీలకు పోలింగ్ షాక్ – ఎవరికీ లాభం -ఎవరికీ నష్టం

గ్రేటర్ లో రాకకీయ పార్టీలకు పోలింగ్ షాక్ – ఎవరికీ లాభం -ఎవరికీ నష్టం
గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ తక్కువగా ఉండటంపై అన్ని రాజకీయ పార్టీలు షాక్ తిన్నాయి ….. జేవలం 37 నుంచి 39
శాతం మాత్రం జరిగినట్లు తెలుస్తున్నది . పూరి వివరాలు ఇంకారావలిసి ఉంది . ఇది ఎవరికీ లాభం -ఎవరికీ నష్టం అనే కోణంలో ఆలోచనలు చేస్తున్నారు . పార్టీల నాయకులూ లాభనష్టాలను భేరీజ్ వేస్తున్నారు . ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ లకు ఓటర్లు తక్కువగా రాటంతో సెలబ్రిటీలతో ప్రచారం చేయించారు . అయినా స్పందన కనిపించలేదు . గత పదిహేను ఇరువై రోజులుగా గ్రేటర్లో హోరెత్తిన ప్రచారం ఓటింగ్ శాతం తగ్గటంతో ఇదిఅంతా బుస్ అన్నట్లుగా ఉంది. ప్రచారంలో అసలు ఓటర్లు పాల్గొనలేదని దీన్ని బట్టి తెలుస్తున్నది . గతం కన్నా ఓటింగ్ శతం పెరుగుతున్నదని పరిశీలకులు అనుకున్నారు . కానీ అంచనాలు అన్ని తలకిందు లైయ్యాయి . ఓట్లు వేసేందుకు చాలామంది ఆశక్తి చూపలేదు . ఎన్నికల వాగ్దానాలతో ఓటర్లను ప్రసన్నమ్ చేసుకునేందుకు రాజకీయ పార్టీలు చేసిన ప్రయత్నాలను పట్టించుకోలేదు , అందువల్లనే ఓటింగ్ శాతం ఘోరంగా పడిపోయిదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . బీజేపీ -టీ ఆర్ ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేశాయి . గతంలో ఎన్నడూ లేనివిదంగా ఎన్నికల ప్రచారంలో మంత్రులు, ముఖ్యమత్రులు, కేంద్ర మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎం ఎల్ సి లు ఇతర నేతలు పాల్గొన్నారు . ప్రచారాన్ని రోడ్ షో లు బస్తి మీటింగ్లతో హోరెత్తించారు . కానీ ఓటర్లు పోలింగ్ కు దూరంగాఉన్నారు . ప్రత్యేకించి మధ్యతరగతి, ఎగువతరగతి ప్రజలు ఓటువేసేందుకు ఆశక్తి చూపలేదు . యువత , నిరుద్యోగులు ,అసలు పోలింగ్ బూతుల వైపు కన్నెత్తి చూడలేదు . పోలింగ్ స్టేషన్స్ లో సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు . అప్పుడప్పు మాత్రమే ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు .ఇంతటి దారుణమైన పోలింగ్ ఎప్పుడు జరగలేదనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి . ఒక పోలింగ్ భూత్ లో ఒకపార్టీ గుర్తు బదులు మరో పార్టీ గుర్తు ముద్రించటంతో అక్కడ ఎన్నిక రద్దుచేసి తిరిగి 3 వ తేదీన నిర్వించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది . పోలింగ్ ఎక్కువగా జరిగింది బాగ్ అంబర్ పేట ,64 శాతం అతితక్కువగా లంగర్ హౌస్ లో కేవలం 6 శాతమే . ఇక ప్రధాన రాజకీయ పార్టీలు మేమంటే మేమె గెలుస్తాం అంటున్నారు. ఎవరు గెలుస్తారు అనేది పరీశీలకులు సైతం కచ్చితంగా చెప్పలేక పోతున్నాయి .

Leave a Reply

%d bloggers like this: