మంత్రి అజయ్ ను బర్తరఫ్ చేయాలా ?సిపిఐ నారాయణ డిమాండ్ సహేతుకమేనా ?

మంత్రి అజయ్ ను బర్తరఫ్ చేయాలా ?
సిపిఐ నారాయణ డిమాండ్ సహేతుకమేనా ?
రాష్ట్ర రహణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలా ?ఈ విషయంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ సమంజసమేనా ? బర్తరఫ్ చేయాలిసి నంత నేరం అజయ్ ఏమి చేశాడు . అంత అవసరం ఉందా ? అనేది పలువురిని వేధిస్తున్న ప్రశ్న … చిన్నచిన్న వాటికీ బర్తరఫ్ లు చేస్తే ఎవరు మిగులుతారు . దీనికే నారాయణ అంతగా స్పందించాలిసిన అవసరం ఉందా? నారాయణ డిమాండ్ సహేతుకమేనా ? అసలేం జరిగింది
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజైన మంత్రి అజయ్ తన వాహనంలో ఓటర్లకు డబ్బులు పంచేందుకు వెళ్లుతున్నాడని అనుమానించిన ప్రత్యర్థులు ఆయన వాహనాన్ని ఆటకాయించారు . తన వా వాహనం పైదాడి జరుగుతుందేమోనన్న అనుమానం తో వాహనం ఆపకుండా వెళ్లి పోయారు . ఈ సందర్భంగా అడ్డు వచ్చిన ఒక వ్యక్తి కార్ బాయ్ నెట్ వెక్కడంతో అంతే కార్ ముందుకు పోయింది . ఇలా ఒక వ్యక్తి కార్ పైన ఉన్న ఆపకుండా వెళ్ళటం ప్రమాదం జరిగి వ్యక్తికి జరగకుడనిది జరిగితే ఏమిటి ? అనేది నారాయణ ఆక్షేపణ …. ఇంత వరకు బాగానే ఉంది. దానిపై కేసు పెట్టమని డిమాండ్ చేయవచ్చు . కానీ ఏకంగా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయమని డిమాండ్ చేయమనడం ఏమిటనేది నారాయణ అభిమానులను సైతం వేధిస్తున్న ప్రశ్న
నారాయణ సిపిఐ లో పెద్ద నాయకుడు . ఏదైనా తన మానసులోని మాటను దాచుకోకుండా కొండబద్దలు కొట్టడం ఆయనకు అలవాటు . ఏదైనా విషయంలో అయన ఏమి చెబుతుంటాడా అని ఎదురు చూస్తుంటారు. అనేక సందుదర్బాలలో అయన మాటలు తూటాల్లాగా పేలుతుంటాయి . తన మాటలతో నాలుక కరుచుకున్న సందర్భాలు కూడా వున్నాయి . గాంధీ జయంతి సందర్భగా చికెన్ తిని తన పొరపాటు తెలుసుకొని ఒక సంవత్సరం కాలం పాటు మాంసం ముట్టనని శపథం చేసి వార్తలకెక్కారు .కాని చిన్న సంఘటనలో ఏకంగా మంత్రినే బర్తరఫ్ చేయమనడం న్యాయంగాలేదేమో నారాయణ గారు ఆలోచించాలి.

Leave a Reply

%d bloggers like this: