అమ్మయ్య జీ హెచ్ ఎం సి ఎన్నికల పోలింగ్ శాతం పెరిగింది – 46 .68 %

అమ్మయ్య జీ హెచ్ ఎం సి ఎన్నికల పోలింగ్ శాతం పెరిగింది – 46 .68 %
– 2016 ఎన్నికలలో 45 .27 శాతం
– లోకసభ ఎన్నికలలో 39 .46 శాతం మాత్రమే
-విమర్శల జడివాన నుంచి ఊపిరి పీల్చుకున్న అధికారులు
జీ హెచ్ ఎం సి ఎన్నికలలో పోలింగ్ శాతం గతం కంటే పెరిగింది . దీనితోఅధికారులు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు . ఫైనల్ లెక్కల ప్రకారం ఓటింగ్ శాతం 46 .68 శాతంగా నమోదైనట్లు జీ హెచ్ ఎం సి కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు . పోలింగ్ శాతం తగ్గినట్లు వార్తలు రావటం పై ఎన్నికల సంఘం మీద రాష్ట్ర ప్రభుత్యం మీద విమర్శల జడివాన కురిసింది . పోలింగ్ రోజున ఓటువేసేందుకు ప్రజలు పెద్దగా ఆశక్తి చూపలేదని గత ఎన్నికలకంటే ఈ ఎన్నికల్లో దారుణంగా పోలింగ్ పడిపోయిందని విమర్శల దాడి పెద్ద ఎత్తున సాగింది . పోలింగ్ 40 శాతం లోపేనని లెక్కలు తేల్చారు . రాత్రి పొద్దుపోయిన తరవాత కూడా అదే అనుకున్నారు . అయితే కొంచం పెరిగిందని అయినా గత ఎన్నికలకంటే భారీగా తగ్గిందని భావించారు . కానీ ఫైనల్ లెక్క వచ్చిన తరువాత అసలు లెక్క తేలింది. పోలింగ్ 149 డివిజన్లలో 46 . 68 % గా అయింది. దీంతో ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకున్నది . ఇది గతం కంటే ఎక్కువే . అంతే కాకుండా లోకసభ ఎన్నికలకంటే బాగాపెరిగింది . 2014 ఎన్నికలో కేవలం ఓటింగ్ 42 .04 శాతం మాత్రమే . 2019 లోక్ సభ ఎన్నిలలో పోలింగు శాతం కేవలం 39 .46 శాతం గా ఉంది . జీ హెచ్ ఎం సి పరిధిలో 24 అసెంబ్లీ , ఐదు పార్లమెంట్ స్తనాలు ఉన్నాయి . ఓటర్లు మొత్తం 74 లక్షల 13 వేలమంది ఉన్నారు . ఇందులో 22 .5 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు . ఒకటి మాత్రం నిజం ఎన్నికల ప్రచారాన్ని భట్టి ఈసారి పోలింగ్ భారీగా ఉంటుందని అందరు భావించారు . ప్రచారం కూడా అదే స్థాయిలో జరిగింది . ఎక్కడ సభ పెట్టినా వేలసంఖ్యలో ప్రజలు హాజరు అయ్యారు . కానీ కరోనా ప్రభావం ఎన్నికల పై చూపింది . కొన్ని పార్టీలలో అభ్యర్థులు పోటీకి ఆశక్తి కూడా చూపలేదు . కోట్లు ఖర్చు పెట్టి ఎన్నిలలో పోటీచేస్తే లాభం ఏమిటి అని భావించారు . మద్య తరగతి ,ఎగువ మధ్యతరగతి ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

Leave a Reply

%d bloggers like this: