అందరి చూపు గ్రేటర్ వైపే

అందరి చూపు గ్రేటర్ వైపే 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో జరగనుండగా అందరి చూపు అటు వైపే ఉంది . నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నికలలో విజయం ఎవరిదీ ? భాగ్యనగరం మేయర్ పీఠం ఎవరిని వరించనున్నది అనే చర్చ సర్వత్రా వినిపిస్తున్నది . దీనిపై బెట్టింగులు కూడా కట్టి నట్లు ప్రచారం సైతం జరిగింది . 100 కు పైగా మావే నని అధికార ట్ ఆర్ యస్ ఢంకా బజావించి చెపుతుండగా , దానికి అంత సీన్ లేదని బీజేపీ అంటున్నది . సారి గ్రేటర్ పీఠంపై కమలం వికసించటం ఖాయం అని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్త్తుంది .గట్టి బందోబస్తు మధ్య 30 కేంద్రాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు . ఆప్రాంతాలలో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా 144 సెక్షన్ విధించారు . కౌంటింగ్ ఏజెంట్లు ఒకేసారి లోనికి ఎంటర్ ఇయితే కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు బయటకు రావటానికి వీలులేదు . పోలింగ్ రోజున ఓటర్లు మొదట పెద్దగా ఆశక్తి చూపకపోవటంతో పోలింగ్ శాతం బాగా తగ్గిందని అందువల్ల ఎవరు గెలుస్తారో చెప్పలేమని పరిశీలకుల సైతం పేర్కొన్నారు . ఎన్నికలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీ ఆర్ యస్ , కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం రసవత్తరంగా సాగింది . కాంగ్రెస్, ఎం ఎం , లెఫ్ట్ పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ బీజేపీ, ట్ ఆర్ ఎస్ మధ్యనే ప్రధాన పోటీ జరిగింది . రాజకీయ పార్టీలు పోటీపడి వాగ్దానాల వరదలు కురిపించాయి . రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ తో పాటు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే ట్ ఆర్ ప్రధానంగా ప్రచారం చేశారు . బీజేపీ తరుపున హోమ్ మంత్రి అమిత్ షా , కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్ , స్మృతి ఇరానీ , యూ పీ సీఎం యోగి ఆదిత్యనాథ్ , మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు . ఎం ఎం ప్రచార బాధ్యతలను అసదుద్దీన్ ,అక్బరుద్దీన్ నిర్వవించారు . ఓల్డ్ సిటీలో ఎప్పటిలాగానే ఎం ఎం క్లీన్ స్వీప్ చేస్త్యుండని అంచనాలు ఉన్నాయి . కాంగ్రెస్ కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఫైట్ ఇచ్చింది . ఎవరు గెలిచినా గతంలో లాగా ఫలితాలు ఉండకపోచ్చు ననేది రాజకీయ పరీశీలకుల అంచనా మరి ఎలా ఉంటుందో చూద్దాం ?

Leave a Reply

%d bloggers like this: