రాజకీయాల్లోకి -సూపర్ స్టార్ ఆగయా

రాజకీయాల్లోకి -సూపర్ స్టార్ ఆగయా …. తమిళనాడులో ఎక్కడ విన్న ఇదే మాట ….. రజని కాంత్ రాజకీయ రంగప్రవేశమే …. సినీ రంగంలో ఒక వెలుగు వెలిగి ప్రజల గుండెల్లో ఆరాద్యుడుగా నిలిచినా సూపర్ స్టార్ రాజనీకాంత్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు తమిళ ప్రజలు … సినిమాల్లో లాగా రాజకీయాల్లో హీరో అవుతారా ? లేక జీరో అవుతారా అనే సందేహాలుకూడా లేకపోలేదు . తమిళనాడులో కరుణానిధి , జయలలిత తరువాత ,రాజకీయ సూన్యత ఉందని దాన్ని రజినీకాంత్ పూడ్చగలడని కొందరి భావన . మరో ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి ….. రాజకీయాలు వేగంగా మారబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు తమిళ తమ్ముళ్లు …. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరదించుతూ ,తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీ కాంత్ స్వయంగా ప్రకటించటం చర్చ నీయాంశం అయింది ….. సీని నటులను రాజకీయాల్లో ఆదరించిన తమిళప్రజలు రజనీకాంత్ కు హిట్ ఇస్తారా ? … ఫట్ మని పిస్తారా ? …. అనేది ఎన్నికల క్షేత్రంలోనే తేలుతుంది . ఆయన రావటం కాయమై అయినా ఎలాంటి విధానాలు అవలంభిస్తారు . అనేదానిపై ఆధారపడి ఆయన రాజకీయ భవిష్యత్ ఉంటుంది . తాను అవినీతి రహిత రాజకీయాలు నడుపుతానని , కుల, మతాలకు అతీతంగా , దైవభక్తితో కూడిన మార్గమే తనదని తనమార్గంలో ఓటమి అనేది లేదని రజని అంటున్నారు . ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ఎలాంటి పర్యటనలు ఉండవని , అభిమానులే అంతా చూసుకోవాలని పేర్కొంటున్నారు . తమిళనాట రజినీ కాంత్ సునామి సృష్టిస్తాడా ? లేదా ? మార్పు తద్యమా …. ఇది ఎవరికీ నష్టం ఎవరికీ లాభం ….. బీజేపీ ఎవరిని సమర్దిస్తున్నది ఎవరితో జట్టు కడుతున్నది . రజినీ ఎన్ డి ఏ కి అనులమా వ్యతిరేకమా ? గత మూడేళ్ళుగా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై ఒకటే చర్చ…. ఎట్టకేలకు మౌనం వీడిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి అభిమానులుకు తీపి కబురు అందించారు . ఈనెల ౩౧ న పార్టీ ప్రకటించబోతున్నట్లు కూడా తెలిపారు . ఆరోజునే పార్టీ విధివిధానాలు ప్రకటిస్తానని కూడా వెల్లడించాడు . మరి చుద్దాం తమిళనాడులో ఏమి జరుగుతుందో ?

Leave a Reply

%d bloggers like this: