కెప్టెన్ రాజీనామా

-గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తు టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు . చాలాకాలంగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడుగా వ్యహరించారు . గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ , పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో కాంగ్రెస్ ఓడిపోయిది . తన స్వంత నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటు ఓడిపోయింది కానీ అప్పుడు రాజీనామా చేయలేదు . టీపీసీసీ అధ్యక్షుడి పదవి కాలం ఎప్పుడో తీరిపోయింది . టీపీసీసీ అధ్యక్షుడి ని మార్చాలనే ప్రదిపాదనలు ఉన్నాయి . దీనిపై ఇప్పటికే కసరత్తు జరిగింది . ఏఐసీసీ లో గందరగోళం నేపథ్యంలో అధ్యక్షుడి మార్పు ఆలశ్యం అవుతుంది . టీపీసీసీ పదవి కోసం పెద్ద ఎత్తునే చర్చలు జరిగినట్లు సమాచారం . రేపో మాపో పోయే పోస్ట్ కు రాజీనామా చేయటం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

%d bloggers like this: