తలబిరుసుకు – తగినమూల్యం

తలబిరుసుకు – తగినమూల్యం
సెటిలర్లు గంపగుత్తగా ఓట్లు వేసినా తప్పని టీ ఆర్ యస్ ఓటమి
మార్చుకోకపోతే-మార్చుతాం అంటూ స్పష్టం చేసిన గ్రేటర్ ప్రజలు
రాజకీయనాయకులకు ఇదో హెచ్చరిక

అదికారం తమ చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం తలబిరుసుగా వ్యవహరిస్తే తగినమూల్యం చెల్లించక తప్పదు అనేందుకు గ్రేటర్ ఎన్నికలు మంచి ఉదాహరణగా నిలిచాయి . తెలుగుదేశం ప్రభావం ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న సెటిలర్లు గంపగుత్తగా ఓట్లు వేసినా ఎం ఐ ఎం లేని చోట్ల ముస్లింలు సహకరించినా ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది టీ ఆర్ యస్ . తమ విధానాలు మార్చుకోకపొతే తామే మార్చుతాం అంటూ      గ్రేటర్ ప్రజలు    స్పష్టం చేశారు . రాజకీయ నాయకులకు ఇదో హెచ్చరిక .
అధికారం ఉంటె అనుకువగా ఉండాలి …. తాము సేవకులుగా భావించాలి …… ప్రజలకు అందుబాటులో ఉండాలి …….వారి విజ్ఞాపనలు వినాలి …… జనరంజక పాలనా అందించాలి …… ఆలా కాకుండా తామే సర్వస్వం అనుకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదనేందుకు జి హెచ్ ఎం సి ఎన్నికలు మంచి ఉదాహరణగా నిలిచాయి . తల బిరుసు రాజకీయాలకు గ్రేటర్ ఫలితాలు చెంపపెట్టుగా నిలిచాయనే అభి ప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.
తమ పరిపాలనకు తిరుగులేదని రాజులుగా ,నియంతలుగా , అహంకారపూరితంగా వ్యహరించటం ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు .అందు వల్లనే అధికార తెరాస కు 2016 గ్రేటర్ ఎన్నికల్లో 99 సీట్లు ఇచ్చి అందలం ఎక్కించిన ప్రజలే 55 సీట్లు మాత్రమే ఇచ్చి నేలకు కొట్టారు . ఐదు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఎన్నికల్లో ఐదుఎళ్ళకు తమ బాగోగులు చూస్తూ పరిపాలించమని అధికారం ఇస్తే అది శాశ్వతం అనుకోని తమ ఇష్టాను సారం వ్యవహరిస్తే ఇలానే ఉంటుందని గ్రేటర్ ఎన్నికలు చాటిచెప్పాయి . తెరాస పాలనకు విసిగి వేసారి ఆవకాశం కోసం ఎదురుచూసిన ప్రజలు తమ అభిప్రాయాలను ఓట్ల రూపంలో తమ ఆగ్రహాన్ని చూపించారు. చెప్పిన మాటలను నిలబెట్టుకోకుండ ప్రజలను ఎల్లప్పుడూ మోసం చేయటం సాధ్యంకాదనే విషయాన్నీ నిన్న దుబ్బాక ప్రజలు నేడు గ్రేటర్ ప్రజలు చాటిచెప్పారు . బీజేపీ అంటే ఇష్టం లేకున్నా తెరాస కు ప్రత్యామ్నయంగా బీజేపీ నే ఉందని భావించారు . అందువల్లనే ఆపార్టీ ని ఆదరించారు . దాదాపు గెలుపు అంచులకు తీసుకొచ్చారు . ఈ ఎన్నికలలో బీజేపీ ఓడినప్పటికి గెలిసిన కిందే లెక్క . లెక్కల ప్రకారం తెరాస కు కొద్దీ సీట్లు ఎక్కువ వచ్చినప్పటికి గ్రేటర్ ప్రజలు టీఆర్ యస్ ని తిరస్కరించారు . గ్రేటర్ లో తెరాస కు బీజేపీకి మధ్య కేవలం ఏడూ సీట్ల తేడానే . అది కూడా ముస్లింలు ప్రభావితంగా ఉన్న ప్రాంతాలు ,సెటిలర్లు , కొన్ని ప్రాంతాలలో టీడీపీ తెరాస కు సహకరించటం వల్లనే 30 డివిజన్ లలో తెరాస గెలిచిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . ప్రదానంగా మూడు , నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిదిలోని తెరాస కు మెజార్టీ సీట్లు వచ్చాయి . బోరబండ , మూసాపేట , సనత్ నగర్ , ఎర్రగడ్డ , యూసఫ్ గూడ, అమీర్ పేట ,జూబ్లీహిల్స్ , మక్తా , హిమాయత్ నగర్ , అంబర్ పేట , ఉప్పల్ ,కూకట్పల్లి లాంటి ప్రాంతాలలో తెరాస కు కొంత ఓట్ల ట్రాన్స్ పర్ జరిగింది . గతంలో తెలుగు దేశం పార్టీకి కంచు కోటలుగా ఉన్న కూకట్ పల్లి , కుత్బుల్లాపూర్ , లలో తెరాస సీట్లతోనే ఆమాత్రం పరువు నిలబెట్టుకోగలిగింది . 150 స్థానాలు ఉన్న హైదరాబాద్ మహానగర్ కార్పొరేషన్ లో మేయర్ పీఠం దక్కాలంటే ఎక్స్ ఆఫీసీయో కాకుండా 76 డివిజన్లలో విజయం సాదించాల్సి ఉండగా తెరాస కేవలం 56 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది . 2016 లో జరిగిన ఎన్నికల్లో 99 స్థానాల లో గెలుపొందింది ,కాంగ్రెస్ నుంచి గెలిచినా ఇద్దరినీ లాక్కొని,మొత్తం 101 సీట్లను తమ ఖాతాలో వేసుకున్నారు . అంటే ఈ ఏన్నికలలో టీఆర్ యస్ 45 సీట్లను పోగొట్టుకున్నది . దీంతో టీ ఆర్ ఎస్ శిభిరంలో నైరాశ్యం నెలకొన్నది . గత ఎన్నికల్లో కేవలం 4 సీట్ల లోనే గెలిచినా బీజేపీ ఈ ఎన్నికలలో 47 సీట్లు గెలుచుకున్నది . అంటే టీ ఆర్ యస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో అర్థం అవుతుంది . సీఎం కెసిఆర్ మంత్రులకు , ఎం ఎల్ ఏ లకు ఏమాత్రం విలువ ఇవ్వడని కనీసం కలిసేందుకు కూడా వారు ఇబ్బందులు పడుతున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి . ఫామ్ హోసే సీఎం అనే పేరు తెచ్చుకోవటం , ప్రజలకు అందుబాటులో లేకపోవటం , ఉద్యోగులను , కార్మికులను , నిరుద్యోగులను అసలు పట్టించుకోడని విమర్శలు ఉన్నాయి . రాజకీయ నాయకులను , వివిధ సంఘాలకు అసలు అపాయింట్మెంట్ లేదు . దీంతో ప్రజల్లో కెసిఆర్ పాలనపట్ల అసహనం పెరిగింది . అది గ్రేటర్ ఎన్నికల రూపంలో ప్రజలు తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేశారు . ఇకనైనా తెరాస ప్రభుత్యం తన వైఖరి మార్చుకొంటుందో లేదో చూద్దాం …..

One thought on “తలబిరుసుకు – తగినమూల్యం

Leave a Reply

%d bloggers like this: