మజ్లీస్ లేకుండా మేయర్ పీఠమా ?

గ్రేటర్ ఎన్నికల్లో హంగ్ తో కంగు తిన్న టీ ఆర్ యస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు నానాపాట్లు పడుతుంది .కొత్త ఎత్తులు వేస్తుంది . ఇందుకోసం ఆచితూచి అడుగులు వేసేందుకు సిద్ధపడుతుంది . ఏది మంచి ఏదిచేడు అనే విషయాలపై బేరీజు వేస్తుంది . మజ్లీస్ లేకుండానే మేయర్ పీఠం చేజిక్కిచుకునేందుకు కసరత్తు చేస్తుంది . ఇది సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . మంత్రి మాటలపై అనేక సందేహాలు కలుగు తున్నాయి . ఇదెలా సాధ్యం అనే అనుమానాలు ఉన్నాయి . మజ్లీస్ సహకారం లేకపోతె మార్గమేమిటి అక్రమ మార్గమా ? సక్రమ మార్గమా ? అక్రమమే అయితే తెరాస పప్పులో కాలేసినట్లే అని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . ఎం ఐ ఎం మద్దతు కోరితే ఎన్నికల్లో మతతత్వ్వ పార్టీ తో పొత్తు ఉండదని ప్రకటించింది .దీంతో ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన పార్టీగా తెరాస మిగిలిపోనుంది . ఇప్పటికే మాట తప్పుతున్న పార్టీ గా ఉందనే దుబ్బాకలోను , గ్రేటర్ లోను ప్రజలు తిరస్కరించారు . ఇప్పుడు ఏ మాత్రం తొందర పాటు నిర్ణయం తీసుకొన్న తెరాస భారీమూల్యం చెల్లించాల్సి ఉంటుంది . దాని సహకారం తీసుకోకపోతే మేయర్ పీఠం దక్కదు . కాబట్టి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది తెరాస పరిస్థితి . కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిషన్లు ఉండగా ఏ పార్టీకి సంపూర్ణ మెజర్టీ రాలేదు . తెరాస కు 55 , బీజేపీ కి 48 ఎం ఐ ఎం కు 44 కాంగ్రెస్ కు 2 సీట్లు వచ్చాయి . 45 మంది ఎక్స్ ఆఫీసియో సభ్యులు ఉన్నారు . దీంతో మొత్తం సభ్యల సంఖ్య 195 గ్రేటర్ పీఠం కావాలంటే 98 మంది సభ్యల మద్దతు తెరాస కు కావలి కానీ మొత్తం ఉన్న సభ్యుల్లో 86 మంది మాత్రమే తెరాస కు ఉన్నారు . అంటే ఇంకా 12 మంది సభ్యల మద్దతు అవసరం . వీరిని ఎక్కడనుంచి తెస్తారు ? ఎం ఐ ఎం లేకుండా ఎవరు మద్దతు ఇస్తారు ? అనే సందేహాలు కలగటం సహజం . ఇందుకోసం తెరాస మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తున్నది . ఒకటి మజ్లీస్ లేకుండా ఉండాలంటే అది సమావేశానికి హాజరు కాకుండా చూడగలగాలి .లేదా అది కూడ మేయర్ పీఠంకోసం పోటిలో ఉండేలా చేయాలి. రెండు బీజేపీ నుంచి కొంతమందిని తెరాస కు మద్దతు ఇచ్చేలా ఒప్పించాలి . మూడు కొంతమంది బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీ లో చేర్చు కోవటం ఇది జరుగుతుందా ? లేదా అనేది చూడాల్సిందే మరి !

2 thoughts on “మజ్లీస్ లేకుండా మేయర్ పీఠమా ?

  1. వెంటనే బిజెపి నుంచి ఎవ్వరూ చేరకపోవచ్చు. ఉన్నంతలో కాస్త గౌరవంగా బయటపడటానికి టిఆర్ఎస్ కు ఉన్న ఏకైక మార్గం ఎంఐఎంను బతిమిలాడి ఒప్పించి అది మేయర్ ఎన్నిక కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసేలా చూసుకోవడం…ఎన్నిక తంతును ముగించుకోవడం….

Leave a Reply

%d bloggers like this: