రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని మద్దతు – భారత్ తీవ్ర అభ్యతరం

రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు తెలపడంపై భారత్ తీవ్ర అభ్యతరం తెలిపింది . ఇది దేశ అంతరింగిక విషయాలలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొన్నది . దీనిపై భారత్ లోని కెనడా హైకమిషనర్ కు సమన్లు పంపింది . అంతే కాకుండా కరోనా వాక్సిన్ కోసం కెనడాలో జరుగుతున్నా అంతర్జాతీయ సదస్సులో పాల్గొనరాదని భారత్ నిర్ణయించింది . గత పది రోజులుగా కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఢీల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న ఉద్యమం దేశంలోని అన్ని ప్రాతంటాలకు పాకింది . రైతులు, రైతుసంఘాల ప్రతునిధిలతో కేంద్ర మంత్రులు పలుమార్లు జరిపిన చర్చలు ఒకకొలిక్కి రాలేదు . ప్రపంచమంతా భారత్ లోని రైతులు చేసుతున్న ఉద్యమాన్ని నిశితంగా గమనిస్తున్నాయి . రైతు ఉద్యమానికి మద్దతుగా ఈనెల 8 రైతుసంఘాలు భారత్ బంద్ కు పిలుపు నిచ్చాయి.

Leave a Reply

%d bloggers like this: