ఢిల్లీ రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు

ఢిల్లీ రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు
-మొన్న ట్రూడో ,నిన్న బ్రిటన్ ఎంపీ లు నేడు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్
_ దేశదేశాలలో సంఘీభావ ప్రదర్శనలు
– 8 వ తేదీన భారత్ బంద్ కు రైతుసంఘాల పిలుపు
కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ రైతులు, రైతుసంఘాలు చేస్తున్న పోరాటానికి దేశం నుంచే కాకుండా అంతర్జాతీయంగా రోజురోజుకు మద్దతు పెరుగుతుంది . ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే ఆవకాశం ఉన్నదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్యము రైతుల మేలుకోసమని మూడు వ్యవసాయ చట్టాలు చేసింది. ఆచట్టాలు మాకు వద్దేవద్దు అని రైతులు అంటున్నారు ….అసలు ఆచట్టాలు ఏమిటి అంటే 1 . నిత్యవసర సరుకుల బిల్లు . 2 . స్వేచ్ఛ వాణిజ్య చట్టం 3 . ధరల హామీ ,సేవల చట్టం . వీటి మొత్తం సారాంశం ఏమిటంటే రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధరలు , పంటల ఉత్పత్తి రవాణా , అంతా కార్పొరేట్ చేతుల్లోకి అప్పనంగా అప్పగించటమే . న్యాయం కోసం ఆర్ డ్ ఓ , లేదా ఐఏఎస్ అది కారుల దగ్గరకు వెళ్ళలిసిందే . కోర్ట్ లకు వెళ్లే ఆవకాశం లేదు . ఈ చట్టాలపై రైతులు భగ్గు మంటున్నారు . వాటిని సవరిస్తామని కేంద్రం చెబుతుంది .రైతులు మాత్రం సవరించటం కాదు మూడు చట్టాలను రద్దు చేసేవరకు తమ ఉద్యమం ఆగదని కొండబద్దలు కొడుతున్నారు . తమకు ఆచట్టాల వలన కేంద్రం చెబుతున్న మేలుకన్నా కీడే ఎక్కువగా ఉన్నదని వాటిని రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు . రైతులే కేంద్రం చేసిన చట్టాలు వద్దు అన్నప్పుడు వాటిని రద్దుచేయటంలో కేంద్రంకు ఉన్న అభ్యతరం ఏమిటి ? ఎందుకు వాటిని రద్దు చేసేందుకు వెనకంజ వేస్తున్నది అనేది ప్రశ్న ? ఇక్కడే ఉంది కిటుకు కేంద్రాన్ని రైతులకు చట్టాలు చేయమని ఎవరు అడగలేదు . ఎవరి మేలుకోసం ఈ చట్టాలు అంటే కేవలం కార్పొరేట్ శక్త్తుల మేలుకోసమే ననేది చెప్పకనే చెప్పుతుంది . అందుకే రైతులు ఎముకలు కోరుకుతున్న చలిని సైతం లెక్కచేయకుండా గత 12 రోజులుగా చలో ఢిల్లీకి పిలుపు ఇచ్చి సరిహద్దులదాకా వచ్చి పోలీసులు అడ్డగించటంతో అక్కడే మకాం వేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది .
కేంద్ర ప్రభుత్యం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతులు , రైతుసంఘాలు చేస్తున్న పోరాటానికి ప్రపంచ వ్యాపితంగా మద్దతు పెరుగుతుంది . ఢిల్లీ రైతు ఉద్యమానికి మొన్న ట్రూడో ,నిన్న బ్రిటన్ కు చెందిన 36 మంది ఎంపీ లు, ఆదేశ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ కు లేఖ రాశారు . నేడు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్అంటొనియా గుట్రస్ అధికార ప్రతినిధి స్టీపెన్ డుజారిక్ లు కూడా మద్దతు ప్రకటించారు . అంతకు ముందే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ లో రైతులు చేస్తున్న ఉద్యమానికి తన సంఘీభావం ప్రకటించారు . దీనిపై భారత్ తీవ్ర అభ్యతరం తెలిపేంది. దేశ ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకుంటున్నారంటూ కెనడా రాయబారికి సమన్లు పంపింది . కరోనా వ్యాక్సిన్ పై కెనడా లో జరుగుతున్నా అంతర్జాతీయ సదస్సుకు హాజరు కారాదని నిర్ణయించింది . దేశదేశాలలో ఉన్న ఎన్ ఆర్ ఐ లు ఆయాదేశాలలో సంఘీభావ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి . అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ఇండియాలో రైతుల ఉద్యమనాయికి మద్దతుగా పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ఇది మరిన్ని దేశాలకు ఇస్తరించే ఆవకాశం ఉంది. ప్రధాని మోడీ అనేక దేశాలు పర్యటించారు . మన దేశంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రైతులకు చేస్తున్న మేళ్ల గురించి చాలాగొప్పగా చెప్పారు . కానీ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టె అన్నదాతలు రోడ్ ఎక్కటంపై ఏమని సమాధానం చెబుతారు . పైగా 12 రోజులుగా పిల్ల పాపలతో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో వంట, వార్పు చేసుకుంటూ తమ న్యాయమైన డిమాండ్ ల సాధనకోసం పట్టువదలకుండా ఉద్యమం చేస్తుంటే చేసిన వ్యవసాయ చట్టాలను బుట్టలో వేయాల్సింది పోయి మీనమేషాలు లెక్కపెట్టంపై విస్మయం వ్యక్తం అవుతుంది .
– 8 వ తేదీన భారత్ బంద్ కు రైతుసంఘాల పిలుపు
కేంద్ర ప్రభుత్యము రైతుల ఉద్యమానికి తలొగ్గి చర్చలకు పిలిచింది . ఇప్పటికే ఐదు సార్లు 40 రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు . తిరిగి 9 వ తేదీన చర్చలు జరుపుతామని కేంద్రం తెలిపింది . ప్రధాని సైతం కొంతమంది కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు . అయినప్పటికీ రైతుల డిమాండ్స్ ను అంగీకరించలేదు . ఫలితంగా 8 న భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి . దీంతో దేశంలోని రాజకీయ పార్టీలు , రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్ లు , కొన్ని రాష్ట్ర ప్రభుత్యలు మద్దతు ప్రకటించాయి . ఎన్ డ్ ఏ లో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ సైతం ఈ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి వర్గంనుంచి వైదొలిగింది . రాజస్థాన్ లో ని బీజేపీ భాగస్వామి లోకతాంత్రిక్ పార్టీ ఎన్ డి ఏ నుంచి బయటకు వచ్చింది .అయినప్పటికి కేంద్రం మొండిగా వ్యవహరించటంపై తీవ్రవ్యతిరేకతవ్యక్తం అవుతుంది.

Leave a Reply

%d bloggers like this: