ఖమ్మం కే టీ ఆర్ పర్యటనలో విలేకర్ల కు కవరేజీ కష్టాలు

ఖమ్మం కే టీ ఆర్ పర్యటనలో విలేకర్ల కు కవరేజీ కష్టాలు
-నడవని బస్సు తో నానా తిప్పలు
-సమాచార శాఖా నిర్లక్ష్యంతో నిరంతరం తప్పని ఇబ్బందులు
మంత్రుల పర్యటనలేంటేనే ఉరుకులు పరుగులు ….. తిండి తిప్పలు మాని న్యూస్ కవరేజీ కి వెళ్లిన విలేకర్లకు చుక్కలు చూపిస్తున్నారు సమాచారశాఖ అధికారులు . మీడియా విస్తృతి పెరిగింది . సమాచార విస్ఫోటనంలో డిజిటల్ మీడియా , ప్రింట్ మీడియా ,ఆన్ లైన్ మీడియా, వెబ్ మీడియా అంటూ రరకాలుగా సమాచారం శరవేగంతో దూసుకుపోతుంది. దానికి తగ్గట్లు ఏర్పాట్లు ఉండటం లేదు . ముఖ్యంమైన ప్రోగ్రామ్స్ కు తగిన వేర్పాట్లు చేయటంలో సంభందిత అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది . పైగా ముఖ్యమంత్రి తనయుడు టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ సోమవారం ఖమ్మం లో పర్యటన చేశారు . కే టీ ఆర్ పర్యటన అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . ఇక విలేకర్లకు కవరేజ్ కష్టాలు ….. పోలీసులతో తోపులాటలు . ప్రధానంగా వీడియో , ఫోటో జర్నలిస్టుల ఇబ్బందులు …. కెమెరాలు ,వీడియోల ,బ్యాగులు వేసుకొని పరుగులు ….. విలేకర్ల వాహనం ఎక్కడో ఆపితే అక్కడ నుంచి చమటలు కక్కుతూ రన్నింగ్ … విలేకర్ల కోసం వేర్పాటు చేసిన వాహనం సరిగా లేకపోతే ఇక ఇంతే సంగతులు … ఖమ్మం కే టీ ఆర్ పర్యటనలోఅక్షరాలా ఇదే జరిగింది …. ఎన్నో కష్టాల కోర్చి న్యూస్ కవరేజ్ కి వెళ్లిన విలేకర్ల కోసం సమాచార శాఖ సరైన వాహనం ఏర్పాటు చేయక పోవటంతో అది కాన్యాయ్ చివర్లోకి నెట్టి వేయబడింది . సరే ఏదోరకంగా మంత్రుల ప్రోగ్రామ్స్ కవర్ చేద్దాం అంటే వాహనం ముందుకు నడవదు . ఇదేమంటే రిపేర్ వచ్చిందని డ్రైవర్ సమాధానం . ఇకచేసేది లేక ఆటోలు పట్టుకొని కార్యక్రమం దగ్గరకు వెళ్లితే అక్కడ పోలీసులతో తగాదా . ముందుగా మాజీ ఎంపీ పొంగులేటి ఇంటి వద్దకు వెళ్లిన కే టీ ఆర్ తో వచ్చిన విలేకర్లకు చేదు అనుభవం …. పోలీసులతో తగాదా కొందరు పోలీసులు విలేకరులపై జులుం , బాయ్ నెట్ తో డొక్కలో పొడిచినట్లు ఫిర్యాదులు . . ముఖ్యమంత్రి తరువాత అంతటివాడు వస్తుంటే హడావుడి అంతా మాములుగా ఉండదు . ఆయన హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఖమ్మం చేరుకున్నారు . ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిదిలోని 200 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంబోత్సవాలు చేశారు . అది రెండు మూడు గంటల వ్యవధిలో 11 కార్యక్రమాలు దానికితోడు పలకరింపులు , అసలే ఎలక్షన్ సీజన్ అసంతృప్తులను ప్రసన్నం చేసుకోకపోతే హైదరాబాద్ లాగా అవుతుందేమోననే శంఖ . చివరకు ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని కవరేజీ చేయటం విలేకర్ల వంతు . కానీ ప్రతిసారి విలేకరులకు ఇలాంటి అనుభవాలే ఎదురౌతున్నాయి . అయినా తగిన జాగ్రత్తలు తీసుకుని విలేకర్లకు ఇబ్బంద్దులు లేకుండా చేయటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు . ముందు ముందైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశీద్దాం !

0 thoughts on “ఖమ్మం కే టీ ఆర్ పర్యటనలో విలేకర్ల కు కవరేజీ కష్టాలు

  1. సర్ నమస్కారం. వార్తలు, శీర్షికలు బాగున్నాయి. సమాచారం, వివిధ అంశాలు , ముఖ్యంగా తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై విశ్లేషణలు బాగున్నాయి. ఇలాగే ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తూ ……. —– ధర్మపురి శ్రీనివాసాచారి. టేకులపల్లి.

Leave a Reply

%d bloggers like this: