ఖమ్మం కార్పొరేషన్ పై కే టీ ఆర్ ఆరా

ఖమ్మం కార్పొరేషన్ పై కే టీ ఆర్ ఆరా
-వన్ సైడే అన్న అమాత్యులు
– టీ ఆర్ యస్ కు కేక్ వాక్ కాదంటున్న పరీశీలకులు
ఖమ్మం కార్పొరేషన్ కు మరో కొద్దీ రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి . ప్రస్త్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకంగామారాయి . ప్రతి ఎన్నిక అధికార టీ ఆర్ యస్ కు సవాల్ గా మారింది . దీనికి తోడు ప్రజలకోరికలు , నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు , తమ అవకాశాలను దెబ్బతీస్తున్నాయనే ఆందోళన మరోవైపు ఉంది . దీంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన టీ ఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ దీనిపై ఆరా తీశారు . తిరిగి మేయర్ పీఠం పై టీ ఆర్ యస్ జెండా ఎగరాలన్నారు . పార్టీ పరిస్థితి ఏమిటని నాయకులను అడిగారు . నాయకులూ అంతా బాగానే ఉంటుందని బదులిచ్చారు . ఇక్కడ నాయకుల మధ్య సమన్వయం లేదని గ్రహించిన కీ టీ ఆర్ కలిసి పని చేయాలనీ హితవు పలికారు . మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఇచ్చిన అల్పాహారం స్వీకరించారు . అక్కడకు జిల్లాకు చెందిన ఎం ఎల్ ఏ లు సండ్ర వెంకటవీరయ్య , కందాల ఉపేందర్రెడ్డి , రాములునాయక్ , హరిప్రియ ,రెండు జిల్లాల జడ్పీ చైర్ మెన్లు లింగాల కామల్రాజ్ , కోరం కనకయ్య , డీసీసీబీ చైర్ మెన్ కూరాకుల నాగభూషణం , రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్థ చైర్ మెన్ కొండబా కోటేశ్వరరావు , రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ ఛైర్మెన్ బొర్రా రాజశేఖర్ , రెండు జిల్లాల గ్రంధాలయ సంస్థల చైర్ మెన్లు దిండిగల రాజేందర్, ఎండీ ఖమర్ , మాజీ ఎం ఎల్ ఏ లు పాయం వెంకటేశ్వర్లు , తాటి వెంకటేశ్వర్లు , హాజరైయ్యారు . ఇక్కడ కూడా కలిసి పనిచేయాలని నాయకులకు ఉద్బోధించారు . ఖమ్మం కార్పొరేషన్ ఎన్నిక పై జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ పూర్తీ విశ్వాసం తో వార్ వన్ సైడ్ ఉంటుందని కే టీ ఆర్ కు వివరించినట్లు సమాచారం . అయినప్పటికీ దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక , హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తమ వ్యూ హాలు ఫలించకపోవడంతో భవిషత్ పరిణామాలపై ఆచితూచి అడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నారు గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో టీ ఆర్ యస్ అధికారంలో ఉన్నప్పటికీ కార్పొరేషన్ పరిధిలోని ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ కి పువ్వాడ అజయ్ ఎం ఎల్ ఏ గా ఉన్నాడు . తుమ్మల టీ ఆర్ యస్ ప్రభుత్వ్యం లో మంత్రిగా ఉన్నారు . అప్పటి వరకు ఖమ్మంలో టీ ఆర్ యస్ ప్రభావం పెద్దగాలేదు . అయినప్పటికీ తుమ్మల అద్వర్యం లో మొత్తం 50 డివిషన్లలో 36 డివిజనులలో విజయం సాధించటం ద్వారా ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరింది . తరవాత కాలంలో అజయ్ టీ ఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు . కాంగ్రెస్ తరుపున గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు మినహా మిగతావారందరు టీ ఆర్ యస్ కు జై కొట్టారు . ఈ సారి జిల్లా కేంద్రమైన ఖమ్మం లో మంత్రిగా అజయ్ ఉన్నారు . కార్పొరేషన్ పూర్తీ భాద్యత అంతా ఆయనదే . అయితే ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ల పై తీవ్ర వ్యతిరేకత ఉందనేది అభిప్రాయాలు ఉన్నాయి . . కొందమందిని మార్చాలనే ఢిమాండ్స్ ఉన్నాయి . దీనిపై కసరత్తు జరగాల్సివుంది .దీనిలో పూర్తిగా మంత్రి మార్క్ ఉంటుందా ? మిగతా నాయకుల రెకమెండేషన్ లు ఏమిటి ? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు .
కేక్ వాక్ కాదంటున్న పరిశీలకులు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ యస్ కు కేక్ వాక్ కాదనేది పరిశీలకుల అభిప్రాయం . రాష్ట్రంలో మారుతున్నా రాజకీయ పరిణామాలు టీ ఆర్ యస్ కు అనుకూలంగా లేవు . టీ ఆర్ యస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల్లో అనేక కోరికలు ఉన్నాయి . వాటిని తెరాస నేరవేర్చితుందని భావించారు . కానీ అవినేరవేరలేదు . నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు . ఉద్యోగులుకు పీ ఆర్ సి ఇవ్వలేదు . డబల్ బెడ్ రూమ్ లు పెండింగ్ లోనే ఉన్నాయి . జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు తీరని కోరికగానే మిగిలింది , అక్రిడేషన్స్ , వైద్య సదుపాయాలు అరకొరగానే ఉన్నాయి . నిరుద్యోగులకు భృతి వాగ్దానంగానే మిగిలింది . దళితులకు మూడెకరాల భూమి లేదు . ఎల్ ఆర్ యస్ వల్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఖమ్మం లో మంత్రి అభివృద్ధి పై ఫోకస్ పెడుతున్నా ప్రజలు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు . ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉంటుందా ? లేదా అనేది చూడాల్సి ఉంది .

Leave a Reply

%d bloggers like this: