కే టీ ఆర్ పైనే భారం – 100 % ప్రొటెక్ట్ చేస్తాడనే నమ్మకం – మాజీ ఎంపీ పొంగులేటి

కే టీ ఆర్ పైనే భారం – 100 % ప్రొటెక్ట్ చేస్తాడనే నమ్మకం – మాజీ ఎంపీ పొంగులేటి
కెసిఆర్ , కే టీ ఆర్ విధానాలు నచ్చి తెలంగాణాలో వారి ద్వారానే అభివృద్ధి సాధ్యం అని నమ్మి టీ ఆర్ యస్ లో చేరా …. టీ ఆర్ యస్ లోనే ఉన్నాను ….భవిష్యత్లోనూ ఉంటాను . పార్టీ మారాల్సిన అవసరం గాని ఆఘాయిత్యం గాని లేదు …ఖమ్మం లోకసభ సీటు రకరకాల కారణాల వలన ఇవ్వలేక పోయారు . రాజ్యసభ ఇస్తామన్నారు ఇవ్వలేదు . అయినా పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది . … కే టీ ఆర్ 100 పర్సంట్ ప్రొటెక్ట్ చేస్తాడనే నమ్మకం ఉంది …….తనకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం ఇటు కార్యకర్తలలోను , అటు నాయకత్వం లోను ఉంది . అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు . ఇటీవల రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వస్తున్నా పుకార్లపై ఆయన్ను” దృక్పధం” పలకరించగా పైవిదంగా స్పందించారు . పార్టీ మారుతున్నారనే విషయాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు . ఇది కొంతమంది చేస్తున్న దుష్ప్రచారంగా కొట్టిపారేశారు . ఎవరి ఆలోచనకు తగ్గట్లుగా వారు అనుకుంటే చేసేది ఏముంది అన్నారు . తనకు కొన్ని విలువలు ఉన్నాయన్నారు . బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు వారి పార్టీలోకి రమ్మని ఆహ్వా నిస్తున్నారనే విషయం ప్రస్తావించగా రాజకీయాల్లో ఉనప్పుడు రకరకాల వారు కలుస్తుంటారు .వారు రాజకీయాలకోసమే కలుస్తున్నట్లు కాదుకదా అన్నారు . తెలంగాణలో వై . యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు జగన్మోహన్రెడ్డి మిమ్ములను ఆహ్వానిస్తున్నట్లు వస్తున్నా వార్తలపై స్పందన కోరగా జగన్మోహన్రెడ్డికి ప్రస్త్తుతానికి అలంటి ఆలోచన ఉన్నట్లు తాను బావించటంలేదన్నారు . కెసిఆర్ తో ఆయనకు మంచి సంబంధాలు మాత్రం ఉన్నట్లు తెలుసునన్నారు . ఖమ్మం జిల్లాలో తాను లోకసభకు మొదటిసారిగా పోటీచేశాను .రాజకీయాలకు కొత్త అయినప్పటికీ .జిల్లా ప్రజలు ఆశ్వీర్వదించి ఎంపీ గా గెలిపించారు . జిల్లా ప్రజలకు రుణపడి ఉన్నాననే భావన నాలో బలంగా నాలో ఉంది . వారి ఋణం తీసుకొనే ఆవకాశం వస్తుందని పూర్తి విశ్వాసం , నమ్మకం ఉంది . ఖమ్మం జిల్లా టీ ఆర్ యస్ నాయకులతో తన సంభందాలపై మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో మనసుకు భాదాకలిగినప్పటికీ పార్టీకి నష్టం కలగకుండ సర్దుకొని పోవటమేనని ,అన్ని విషయాలు నాయకత్వమే చూసుకుంటుందన్నారు . అందరితోనూ సాధారణ సంభందాలే ఉన్నాయన్నారు . తనను నమ్ముకున్నవారు అనేకమంది ఉన్నారని వారికోసం తన శక్తి మేరకు సహాయ పడతానన్నారు . కొన్ని పార్టీలు అన్ని ప్రాంతాల్లో విస్తరించటానికి ప్రయత్నం చేస్తుంటాయని అందులో తప్పులేదని కానీ అన్ని చోట్ల వారి ప్రయత్నాలు ఫలించవనే విషయం గ్రహించాలన్నారు . తెలంగాణాలో ప్రసూతానికి టీ ఆర్ యస్ కి ప్రత్యామ్నాయం లేదని అన్నారు . ఖమ్మం కార్పొరేషన్, హైద్రాబాద్ కార్పొరేషన్ కాదన్నారు . ఇక్కడ రాజకీయాలు వేరు అక్కడ రాజకీయాలు వేరన్నారు . ఒకటి రెండు చోట్ల ఓడిపోతే టీ ఆర్ యస్ పని అయిపోందని ఎవరైనా అనుకొంటే అది భ్రమే అవుతుందన్నారు . టీ ఆర్ యస్ కెసిఆర్ , కీ టీ ఆర్ నాయకత్వంలో మరింత పట్టుదలతో ముందుకు పోతుందని అన్నారు . రాష్ట్రంలో 2023 లో జరిగే ఎన్నికల్లో టీ ఆర్ యస్ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమన్నారు .

Leave a Reply

%d bloggers like this: