కెసిఆర్ ఢిల్లీ టూర్ హిట్టా , ఫట్టా

కెసిఆర్ ఢిల్లీ టూర్ హిట్టా , ఫట్టా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సుదీర్ఘకాలం తరువాత హస్తిన పర్యటన చేపట్టారు . ఇది హిట్టా ,ఫట్టా , ఆయన ప్రధానిని కలుస్తారా? లేక కలవకుండనే వస్తారా? ప్రతిపక్ష నేతలతో భేటీ మాటేమిటి ? ఆందోళన సేస్తున్న రైతులతో ఏమి మాట్లాడతారు ? అనే వాటిపై రాష్ట్ర ప్రజలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు ….. ఆయన పర్యటలో పెద్ద ఎజెండానే ఉంది . రైతుల పోరాటానికి మద్దతు తెలపటంతో పాటు వారితో తమ డిమాండ్స్ పై మాట్లాడనున్నారు . అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం టీ ఆర్ యస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి దేశ రాజధాని ఢిల్లీ లో 1100 గజాల స్థలం ఇచ్చింది . దాని పరిశీలన కూడా ఆయన పర్యటనలో ఉంది . రాష్ట్రానికి సంభందించి కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసేందుకు ప్లాన్ రూపొందుచుకున్నారు . ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ కోరినప్పటికీ ఇంకా కన్ ఫామ్ కాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి . మరి సీఎం మూడురోజులు ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారు అనేది ప్రశ్న ? అయితే ఇటీవల జరిగిన హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి టీ ఆర్ యస్ గల్లీ లీడర్లు వరకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పైనే కాకుండా ప్రధాని మోడీని టర్గెట్ చేస్తూ విమర్శల జడివాన కురిపించారు . రాజకీయాలలో ఇవి అన్ని సర్వసాధారణమే అయినా అవే కెసిఆర్ కు ఇబ్బంది కరంగా మారనున్నాయా ఆంటే అవుననే అనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు . అందువల్ల వీరి కలయిక ఏలా ఉంటుందనేది ఆశక్తి కరంగా మారింది . అంతే కాకుండా తాను ప్రతిపక్ష పార్టీల నాయకులతో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెద్రాబాద్ లో ఒక సమావేశం పెడతానని ప్రకటించారు . అంతకు ముందు అనేకసార్లు కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తానని , తనతో అందరు టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు . కెసిఆర్ అప్పుడప్పుడు కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం తిరిగి కేంద్రం విధానాలను సమర్థించటం షరా మాములుగా మారిందనే అభిప్రాయాలూ ఉన్నాయి . లోకసభ ఎన్నికలకు ముందు అటు మమతా బెనర్జీ ని , ఇటు స్టాలిన్ ను తానే వెళ్లి స్వయంగా కలిశారు .కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ కు మద్దతు ప్రకటించారు , తృతీయ ప్రత్యాన్మయం అన్నారు . మనకు హిందీ వచ్చు ఢిల్లీ లో కూర్చుంటా అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు తీరా ఇదేమని అడిగితే నేనెప్పుడన్నాను అని అన్నారు . కేంద్రం తీసుకొచ్చిన నోట్ల రద్దు , జీ యస్ టీ బిల్లులను అందరికంటే ముందర అసెంబ్లీలో ఆమోదింపచేశారు . దీంతో కెసిఆర్ మాటలపై సందేహాలకు ఆస్కారం ఏర్పడింది . ప్రస్తుతానికి కేంద్రంపై కత్తులు దుస్తున్నారు . బీజేపీ కూడా అదే స్థాయిలో కెసిఆర్ పై మాటల యుద్ధం చేస్తున్నది . రాష్టంలో రాజకీయాలు వేగంగా మారే అవకాశాలు ఉండటంతో టీ ఆర్ యస్ కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీనే కనపడుతుంది . దీంతో రెండు పార్టీల మధ్య ముసుగులో గుద్దులాటలు లేకుండానే ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది . రానున్న కాలంలో ఈ పరిణామాలు మరింతగా వేడి పుట్టించనున్నాయనటంలో ఎలాంటి సందేహంలేదు.కెసిఆర్ ఢిల్లీ పర్యటన ఎముకలు కొరికే చలిలో వేడిపుట్టిస్తుందా ?లేదా? చూడాల్సిందే మరి !!!!

Leave a Reply

%d bloggers like this: