ఖమ్మం కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురుతుందా ???

ఖమ్మం కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురుతుందా ???
-వివిధ పార్టీలలోని ముఖ్యనాయకులే టార్గెట్
-ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు
ఇప్పటి వరకు ఖమ్మం. మునిసిపాలిటీ ఏర్పడ్డ దగ్గర నుంచి ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ…… ఏకంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగర వేస్తామంటున్నది ….. ఇది సాధ్యమేనా అంటే కాదంటున్నారు ……ఇక్కడ బీజేపీయేతర పార్టీల వారు ….. అదెలా సాధ్యమని కమలనాధులను అడిగితే మాలెక్కలు మాకు ఉన్నాయంటున్నారు . … రాజకీయ పరిశీలకులు మాత్రం రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అంటున్నారు ….. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లాలోని వివిధ పార్టీలలో ఉన్న ముఖ్యనాయకులపై కన్నేసిన బీజేపీ, వారిని సంప్రదించే పనిలో నిమగ్నమైంది . వివిధ రాజకీయ పార్టీలలోని అసంతృప్తులను ఎంచుకొని టార్గెట్ చేస్తున్నది . మాజీ ఎమ్మెలేలు , ఎంపీలను సంప్రదించే పనిలో ఉంది . దీనికోసం బీజేపీ పెద్దల సహకారంతో ఒక టీమ్ రహస్యంగా పనిచేస్తున్నది . పార్టీ జాతీయ అధ్యక్షుడు నేరుగా టీమ్ కు డైరక్షన్ ఇస్తున్నట్లు సమాచారం . దుబ్బాక , ,హైద్రాబాద్ కార్పొరేషన్ విజయాలతో మంచి ఊపుమీదన్న బీజేపీ త్వరలోజరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల మీద కన్నేసింది .ఇందు కనుగుణంగా పావులు కదుపుతుంది . వాస్తవంగా బీజేపీకి ఖమ్మం జిల్లాలో నామ మాత్రమైనా బలంకూడా లేదు . గతంలో జరిగిన స్థానిక సంస్తల ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల గెలుపొంది మేముకూడా ఉన్నామనిపించుకున్నది . గతంలో జిల్లాలో , దారపునేని కోటేశ్వరరావు , జయచంద్రారెడ్డి లాంటి లీడర్లు ఉన్నారు . వాజ్ పేయ్ , అద్వానీ , మురళీమనోహర్ జోషి లాంటి బీజేపీ ఉద్దండులు ఖమ్మం కు వస్తే డాక్టర్ జయచంద్రారెడ్డి ఇల్లే వారికీ కేరాఫ్ గా ఉండేది . అప్పుడు ఉన్న వ్యక్త్తుల ఆధారంగా పార్టీ నడిపేవారు . బీజేపీకి నేడు ఆపరిస్థితులు లేవు .కేంద్రంలో పటిష్టమైన నాయకత్వం , అధికారం ఉంది . తెలంగాణాలో పాగావేసేందుకు అనులమైన వాతావరణం ఉందని ఆ పార్టీ విశ్వాసం . అందులో భాగంగానే ఏ ఆవకాశం వచ్చినా వదులుకోకూడదని భావిస్తుంది . హైదరాబాద్, దుబ్బాకలలో మంచి ఫలితాలు సాధించిన తెలంగాణ నాయకత్వం పై , కేంద్ర పార్టీకి నమ్మకం కల్గింది . జరిగే ప్రతి ఎన్నికల్లో ఫలితాలు ఏలా ఉన్నా పోటీచేయటం ద్వారా పార్టీని పటిష్టం చేసుకోవటంతో పాటు క్యాడర్ ను తయారు చేసుకోవాలనేది ఆ పార్టీ ఎత్తుగడగాఉంది . పైగా అధికార టీ ఆర్ యస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది కమలేనాథుల అభిప్రాయం . అందువల్ల ప్రజలలో నెలకొన్న టీ ఆర్ యస్ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది . ఖమ్మం లో కులాలకు సంభందించిన ముఖ్యనేతలను తమకు అనుకూలంగా తిప్పుకునేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది . ఇక్కడ రెండు మూడు బలమైన కులాలు ఉన్నాయని గుర్తుచిన బీజేపీ కులాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులను ఎంచుకొని వారిని తమకు అనుకూలంగా ఒప్పించాలని చూస్తున్నది . రాష్ట్రంలో మిగతా ప్రాంతాల లాగా ఖమ్మంలో ఆ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంటుందా లేదా అనేది చూడాల్సిందే …..

Leave a Reply

%d bloggers like this: