60 డివిజన్లు కానున్న ఖమ్మం కార్పొరేషన్

60 డివిజన్లు కానున్న ఖమ్మం కార్పొరేషన్
-మార్చ్ లేదా ఏప్రిల్ లో ఎన్నికలు
-మారనున్న రిజర్వేషన్లు
ఇప్పటి వరకు 50 డివిజన్లు గా ఉన్న ఖమ్మం కార్పొరేషన్ 60 డివిజన్లు కానున్నది . కార్పొరేషన్ కు మార్చ్ లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరనున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి . డివిజన్లు డీనోటిఫై చేయటంతో పాటు రిజర్వేషన్ లు కూడా మారనున్నాయి . ఈపని అంతా పూర్తి అయ్యేందుకు సమయం పట్టే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది . అందువల్ల ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఆలశ్యం కాక తప్పని పరిస్థితి ఎర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం , పోలేపల్లి పెద్ద తండా , గుర్రాలపాడు , వెంకటగిరి అనే ఐదు గ్రామా పంచాయతీలను ఖమ్మం కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్యం జీ ఓ విడుదలచేసింది . దీంతో ఖమ్మం కార్పోరేషన్ లో. పంచాయతీల విలీనం జరిగింది. దీనిని గ్రామపంచాయతీలు తీవ్రంగా వ్యతిరేకించాయి . అయినా జీ ఓ అయి కూర్చుంది . మరల కార్పొరేషన్ కు ఎన్నికలు జారగబోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ కారణాలు ఏమైనా వాటిని తిరిగి పంచాయతీలుగా చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ తీర్మానం ద్వారా విలీనం చేసిన పంచాయతీలను కార్పొరేషన్ నుంచి తొలగిస్తూ మరో తీర్మానం ఆమోదించారు . దీంతో ఆ పంచాయతీలు తిరిగి గ్రామా పంచాయతీలుగానే నిర్ణ యిస్తూ మరో జీ .ఓ విడుదలైంది. పోలేపల్లిలోని కరుణగిరి ప్రాంతాన్నికార్పోరేషన్ లో కలుపుతూ జీ.ఒ జారీ అయింది. ఆ ఐదు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను కూడ నియమించారు .అయితే కార్పొరేషన్ లోని డివిజన్లను పునర్విభజన చేయాలని చట్టం లో ఉండటంతో కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లను 60 డివిజన్లుగా పునర్విభజన చేయాల్సి ఉంది . దీంతో డివిజన్ల బౌండరీలు ,ఓటర్ల సంఖ్య మారనున్నాయి . అందువల్ల డిజన్లతో పాటు రిజర్వేషన్లు కూడామారక తప్పని పరిస్థితి . ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు . ప్రారంభం అయితే సమయం పడుతుంది . ఇప్పటి వరకు డివిజన్ల మార్పు పై క్లారిటీ లేదు . కానీ డివిజన్ల పునర్విభజన ఖాయం కావటంతో కొందరు కార్పొరేటర్లలో నిరాశ ఏర్పడింది . తమ డివిజన్లు రిజర్వేషన్లలో ఏమౌతాయోననే ఆందోళన నెలకొన్నది. ఎప్పటి వరకు ఈ డివిజన్లు ఏర్పడతాయో ,రిజర్వేషన్ల కన్ఫ్యూషన్ ఏప్పుడు తొలుగుతుందో చూడాల్సిందే !!!!!

Leave a Reply

%d bloggers like this: