7.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం


గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్
ఖమ్మం సమీపంలో 7 . 5 లక్షల విలువైన గంజాయిని శనివారం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు . అర్బన్ మండలం వి . వెంకటాయపాలెం వద్ద అనుమానాస్పదంగా వస్తున్నా వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఇన్నోవా వాహనంలో ఇద్దరు వ్యక్తులు ఒడిశా నుంచి బెంగుళూరుకు 32 బ్యాగ్ లలో కారులో తరలిస్తున్నట్లు గుర్తిచారు . కారుతో పాటు ఇద్దరు వ్యక్తులను గంజాయిని అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు .

34 కేజీల గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్, రఘునాథపాలెం పోలీసులు

అక్రమార్జనే లక్ష్యంగా
గుట్టుచప్పుడు కాకుండా
రాష్ట్ర సరిహద్దుల నుండి బెంగుళూరుకు అక్రమంగా తరలిస్తున్న 34 గంజాయి పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు.
విశ్వసనీయ సమాచారం
మేరకు ఈరోజు ఉదయం
ఖమ్మం రూరల్ సిఐ సత్యనారాయణ రెడ్డి , టాస్క్‌ఫోర్స్ సిఐ వెంకటస్వామి, ఎస్సై సతీష్ కుమార్, రఘునాథపాలెం ఎస్సై శ్రీనివాస్ తమ సిబ్బందితో కలసి రఘునాథపాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని వి. వెంకటయపాలెం ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టినట్లు తెలిపారు.
అనుమానాస్పదంగా వస్తున్న ODO2AS2058 (మారుతి ఎర్టిగా) వాహనాన్ని అపి తనిఖీ చేయగా (రూ 5,10,000 /-)
ఐదు లక్షల పది వేల రూపాయల విలువ చేసే 34 కేజీల గంజాయి తరలిస్తునట్లు గుర్తించారు.
వాహనంలోని ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకొని విచారించగా
ఒరిస్సా రాష్ట్ర మల్కాన్ గిరి, వెంకటపాలెం, కలిమోల గ్రామానికి చెందిన సాధన సర్కార్ (డ్రైవర్ )మరియు నిరంజన్ మజుందార్ గా గుర్తించారు.

ఒరిస్సా రాష్ట్ర మల్కంగిరి చెందిన కనకం మరియు బెంగుళూరుకు చెందిన ఫైజర్ సూచనల మేరకు దీపు హాల్దర్ అనే వ్యక్తి సహకారంతో
గంజాయి బెంగుళూరు కు తరలిస్తునట్లు నిందుతులు వెల్లడించారని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వివరించారు.

తనిఖీలలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కానిస్టేబుల్ రవి,రామకృష్ణ, శ్రీనివాస్, ఉపేందర్ పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: