జానారెడ్డి కి గవర్నర్ పదవి ? – బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ?

జానారెడ్డి కి గవర్నర్ పదవి ? – బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ?
-జగమెరిగిన నాయకుడు జానారెడ్డి…….. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉన్నారనే పేరుంది ….. నియాజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి మనసులలో స్థానం సంపాదించుకున్నారు . రాష్ట్రముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఆయనలో ఉంది . కాంగ్రెస్ కు అధికారం వస్తే ముఖ్యమంత్రి రేసులో ముందుపీఠిన ఉండే వ్యక్త్తి . గతంలోనే ఆయన తన కుమారుడికి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని గట్టి ప్రయత్నం చేసారు . కానీ ఆవకాశం రాలేదుఅలాంటి జానారెడ్డి బీజేపీలో చేరతారా ? బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేసిందా ? లేక జానారెడ్డినే తనకు గవర్నర్ పదవి , తన కుమారుడికి నాగార్జునసార్ ఉపఎన్నిలల్లో టికెట్ ఇవ్వమని అడిగారా ?రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది . అసలు ఏమి జరుగుతుంది . నాగార్జునసాగర్ ఎం ఎల్ ఏ నోముల నరసింహయ్య ఆకస్మిక మరణం జానారెడ్డి రాజకీయాలపై చర్చకు దారితీసింది . సాగర్ కు జరిగే ఉపఎన్నిలను తమకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా తెలంగాణాలో టీ ఆర్ యస్ కు తామే ప్రత్యామ్నాయం అని మరోమారు చాటిచెప్పాలని చూస్తున్న బీజేపీ అందుకు సాగర్లో తగిన నాయకుడు జానారెడ్డి కాబట్టి ఆయన్ను ఎలాగైనా తమ పార్టీ లోకి లాగాలని గట్టి ఎత్తులు వేస్తుంది . కేంద్ర నేతలకు ఈవిషయాన్ని తెలపటంతో వారు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారని , వారికీ ఆయన కొన్ని షరతులు పెట్టారని వార్తలు వస్తున్నాయి . నిజంగా ఆయన షరతులు పెట్టారా ? కాంగ్రెస్ ను బై చెప్పేందుకు సిద్దపడ్డారా ?అంటే రాజకీయాలలో ఏదైనా జరిగే ఆవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు . జానారెడ్డి రాజకీయాల్లో ఉద్దండుడు . మొదట తెలుగు దేశం రాజకీయాల్లో ఉన్న ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు . మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు . 2009 లో ఉమ్మడి రాష్ట్రంలోనూ 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఆయన నాగార్జునసాగర్ నుంచి ఎన్నికైయ్యారు . తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యహరించారు .అంతకు ముందు చలకుర్తి నియోజకవర్గంగా ఉన్న ప్రాంతమే నేటి నాగార్జునసాగర్ , అంతకుముందు నాలుగుసార్లు ఆయన అక్కడనుంచి ఎన్నికైయ్యారు . 2018 లో జరిగిన ఎన్నికలలో ఆయన టీ ఆర్ యస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో ఓడిపోయారు . నాటినుంచి రాజకీయాల్లో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు . అప్పుడప్పుడు గాంధీ భవన్ లో జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతుంటారు . నోముల మరణం తో తిరిగి జానారెడ్డి పాత్ర పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి .ఆయన ఉప ఎన్నికల్లో పోటీచేస్తారా ? లేక తాకుమారుడైన రఘువీర్ రెడ్డిని పోటీకి పెడతారా ? అదికూడా ఏపార్టీ నుంచి బీజేపీనా ,కాంగ్రెస్ నా ? ఆయనే తాను పోటీ చేయనని , రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి చేప్పినా పోటీకి ససేమీరా అంటున్నారు . సాగర్ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా బలం లేదు . కాంగ్రెస్ కు బలం ఉన్నా ఇప్పుడున్న పరిస్థితిలో అది గెలుపుకు సరిపోతుందా ? బీజేపీ 2500 ఓట్ల నుంచి టీ ఆర్ యస్ ను ఢీకొంటుందా ? ఇక్కడ బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . ఏమి జరుగుతుందో చూద్దాం !!!

Leave a Reply

%d bloggers like this: