అదిస్టానానికి తలనొప్పిగా మరీన టీపీసిసి చీఫ్ ఎంపిక

 

అదిస్టానానికి తలనొప్పిగా మరీన టీ పి సి సి చీఫ్ ఎంపిక
-తమాషా చూస్తున్న టీ ఆర్ యస్
-వలవేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ
-టీ పి సి సి చీఫ్ గా రేవంత్ రెడ్డి నే ?
టీ పి సి సి చీఫ్ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పుగా మారగా ,అధికార టీ ఆర్ యస్ పార్టీ తమాషాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నది ….. బీజేపీ మాత్రం ఎవరు ఆద్యక్షుడు అయినా పదవి ఆశించినవారికి భంగపాటు తప్పదు గనక ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది . అందుకనుగుణంగా కాంగ్రెస్ లోని అసమ్మది వాదులకు వలవేస్తుంది . బీజేపీ లోని అగ్రనేత ఒకరు గతంలో కాంగ్రెస్ పార్టీలో తన పాత పరిచయాలను ఉపయోగించి ముఖ్యనేతలను కలిసేపనిలో ఉన్నారు . దీంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో పార్టీలోని పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరక తన్నుకుంటున్నారనే అభిప్రాయాలూ పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయి . కాంగ్రెస్ పని అవిపోయింది అందులో ఉంటె లాభం లేదనే వారు జంపింగుల కోసం తహతహ లాడుతున్నారు . ఇప్పటికే అనేకమంది పార్టీని వీడేందుకు సిద్దపడగా మరికొందరు వేచిచూసేధోరణిలో ఉన్నారు . కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక కత్తిమీద సాముగామారింది . గ్రూపులుగా వీడిపోయారు . ఒకరు కాదు ఇద్దరుకాదు అరడజనుకు పైగానే ఆద్యక్షుడు కావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు . వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి , రేవంత్ రెడ్డి , జగ్గారెడ్డి , శ్రీధర్ బాబు , అంజాన్ కుమార్ యాదవ్ , ఉండగా , మల్లుభట్టి విక్రమార్క , జానారెడ్డి లాంటివారు మాత్రం అధిష్టానం తమకు పిలిచి పదవి ఇస్తే తీసుకోటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం . సుమారు వారంపాటు హైదరాబాద్ లో మకాం వేసిన ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ , అభిప్రాయాలూ సేకరించారు . అయితే అభిప్రాయాల సేకరణ ఎలా ఉన్న అదిష్టానం దగ్గర వేరే పేరుందని ఆయననే ప్రకటిస్తారని ఊహాగానాలు రావడంతో మల్లీ గోల మొదటికి వచ్చింది . ఇంకేముంది ఇంచార్జిని చుట్టుముట్టి కదలకుండా చేసినంత పనిచేశారు . దీంతో ఆయన అబ్బేబ్బే నాదేంలేదు అంతా అధిష్టానానికి ఇస్తా, వారి నిర్ణయమే ఫైనల్ అన్నారు. ప్రజలు మాత్రం కాంగ్రెస్ వాళ్లకు పనిపాటలేదు అధికారం పోయినా వీళ్ళు మారారా ? వీళ్ళను బాగుచేసేవారు ఎవరు లేరంటున్నారు . కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రంలో పార్టీ నాయకులూ గ్రూపులు పడి కొట్టుకోవడం పై ఆందోళన చెందుతున్నారు . అధికారం పోయినా బుద్ది రాలేదని ఇప్పటికైనా మారండని వారి హితులు కోరుకొంటున్నారు ….టీ పీ సి సి అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ రాజీనామా చేసారు . దీంతో టి పి సి సి అధ్యక్ష ఎంపిక అనివార్యం అయింది . కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎంపిక భాద్యతను కొత్తగా రాష్ట్ర ఇంచార్జి గా వచ్చిన మాణిక్యం ఠాకూర్ కు అప్పగించింది . ఆయన ఇక్కడ నాయకులను సంప్రదించి పని పూర్తి చేద్దాం అనుకున్నారు . అయితే ఆయన అనుకున్నంత తేలికగా లేదు అధ్యక్షుడి ఎన్నిక అనేది అర్ధం కావటానికి వారం రోజులు పట్టింది . చివరకు అభిప్రాయం సేకరణ తంతు ముగించారు . చివరి రోజు అభిప్రాయం సేకరణ అంతా ఒక డ్రామా అని భావించిన కాంగ్రెస్ లోని సీనియర్లు సమావేశమై కొత్తగా పార్టీలోకి వచ్చినవాళ్లు కు ఎట్టి పరిస్థిలోను అధ్యక్ష పదవి అప్పగుంచరాదని హడావుడి చేశారు అందరి మాటలు విన్న మాణిక్యం ఠాగూర్ ఢిల్లీలోని అధిష్టానం వద్దకు వెళ్లారు . ఆధ్యక్ష పదవికోసం పోటీపడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి , దుద్దిళ్ల శ్రధర్ బాబు , జగ్గారెడ్డి తదితరులు సోనియా , రాహుల్ లను కలిసేందుకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు . అయితే కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది .

దాదాపు రేవంత్ రెడ్డి నే టీ పి సి సి కాబోయో చీఫ్?

అందుతున్న సమాచారం ప్రకారం కొత్త టీ పి సి సి చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరే ఖారారు అయినట్లు తెలుస్తున్నది . అయితే అధికారికంగా ప్రకటించేందుకు సమయం పెట్టవచ్చునని సమాచారం . రాష్ట్రనేతలను సంప్రదించి వారిని ఒప్పించిన తరువాతనే పేరును వెల్లడించనున్నారు .

Leave a Reply

%d bloggers like this: