గల్ఫ్ కార్మికుల సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతా-ఖమ్మం ఎంపీ నామ

గల్ఫ్ కార్మికుల సమస్యలు గురించి సియం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు , పార్లమెంట్ లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్ఎస్ లోక్ సభపక్ష నేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు . గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని , గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని , నకిలీ ఏజెంట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ వలసదారుల హక్కులు , సంక్షేమ ఫోరమ్ ( మైగ్రెంట్ రైట్స్ & వెల్ ఫేర్ ఫోరమ్ ) వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నర్సింహనాయుడు మరియు సంఘ సభ్యులు కలిసి ఎంపి నామకు సోమవారం హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు . ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని , అక్కడ నుండి తిరిగి వచ్చిన వారికి ఇక్కడ ఉపాధి కల్పించడంతో పాటు , బాధితులకు పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకొంటున్నారని తెలిపారు . ఎంపి నామను కలిసిన వారిలో వలసదారుల హక్కులు , సంక్షేమ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నర్సింహానాయుడు . అధ్యక్షులు రమేష్ ఏముల , తెలుగు తెలంగాణ సంక్షేమ సంఘం , కువైట్ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి నాయకులు పడాల నవీన్ గౌడ్ , మంద భీంరెడ్డి తదితరులు ఉన్నారు

Leave a Reply

%d bloggers like this: