మమం మాస్ లీడర్ …… బండి సంజయ్

మమం మాస్ లీడర్ …… బండి సంజయ్
బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు ……. అంత కంటే మమంమాస్ లీడర్అంటే ఆయనకు అతికినట్లు సరిపోతుందేమో ……… అంతకు ముందు ఈయన పేరు పెద్దగా ఎవరికీ తెలియదు .…. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన కార్పోరేటర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంబించారు ……..ఎంపి స్థాయికి ఎదిగారు……ఎవరోలే కరీంనగర్ ఎంపీ అట….. అనుకున్నారు . చూడటానికి బక్కగా ఉంటాడు …… పెద్ద ఒడ్డు పొడువు ఉన్నవాడు కాదు …..రాష్ట్రంలో మిగతా ప్రాంతాల ప్రజలకు పెద్దగా తెలియదు…… ఈయనేంటి ? బీజేపీ అధ్యక్షుడు ఏమిటి ? ఇక పార్టీ ముందర పడ్డట్టే అనుకున్నారు చాలామంది . కానీ పేరు ఇప్పుడు రాష్టంలో మారుమోగుతోంది ….. సంజయ్ పేరు వింటే కొంత మంది రాజకీయ నాయకులకు నిద్రపట్టడం లేదంటే అతిశ్రేయోక్తి కాదేమో …. మాటల్లో చురుకుదనం …. ప్రత్యర్థుల పై మాటల తూటాలు ఆయన్ను హీరోని చేశాయి . ప్రత్యేకించి గ్రేటర్ ఎన్నికల్లో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై , మఖ్యమంత్రికెసిఆర్ పై చేసిన పదునైన విమర్శలు ప్రజలను ఆలోచింపచేశాయి .ఆయన కెసిఆర్ పై చేసిన విమర్శల్లో మచ్చుకు కొన్నినిరుద్యోగులకు భృతి ఇస్తానన్నాడు ఒక్క పైసా ఇవ్వలేదు ఒక్కొక్కరికి 72 వేల రూపాయలు బాకీ పడ్డాడుఢిల్లీ లో కత్తి తిప్పుతానని చెప్పిన కెసిఆర్ గల్లీలో కత్తి తిప్పారో చెప్పాలి .” కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చటానికి చెప్పిన కట్టు కథలు ఢిల్లీ పెద్దలు నమ్మలేదు ” “త్వరలోనే కెసిఆర్ అవినీతి చిట్టాను బయట పెడతా ,ఆయన జైలుకు వెళ్లడం ఖాయం “. ” హైదరాబాద్ లో వరదలు వస్తే ఫామ్ హౌస్ లో పడుకొని బయటకు రాలేదు . బాధితుల కుటుంబాలకు 10 వేల రూపాయలు ఇస్తానని ఇవ్వలేదుకృష్ణ , గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు డి పి ఆర్ ఇవ్వమంటే ఇంతవరకు ఇవ్వలేదు ” “నీ తప్పిదాలను నిలదీస్తే మా రాష్ట్రము మానిధిలు అంటావు రాష్ట్రము ఏమైనా నీ అయ్యా జాగీరా కెసిఆర్అని చెప్పిన మాటలకు జనం ఫిదాఅయ్యారు. అందుకే ఆయన సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు . ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలు ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టాయి అధిష్టానం వద్ద సంజయ్ పరపతి మరింతగా పెరిగింది . అంతకు ముందు ఆయన్ను గురించి పెద్దగా పట్టించుకోని మీడియా సైతం ఆయన ప్రతి కదలిక పై కన్నువేసింది . ఆయన ఢిల్లీ వెళ్లినా అక్కడనుంచి వచ్చినా అది పెద్ద వార్తగానే మారుతుంది . సంజయ్ ని ప్రజలు తమవాడిగా భావిస్తున్నారు …. చాలామంది లీడర్లు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్త్తున్నా , సంజయ్ లాగా ముక్కుసూటిగా ధ్వజమెత్తిన సందర్భాలు తక్కువనే చెప్పాలి . అందువల్లనే బీజేపీ లో కూడా సంజయ్ కి వచ్చినంత పాపులారిటీ మరో నేతకు రాలేదు . ఇది సొంత పార్టీలోనే కొందరు నేతలకు మింగుడు పడని విషయంగా మారిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . కెసిఆర్ మాటకు బదులిచ్చే మంచి లీడర్ దొరికాడనే భావన సామాన్యులలో సైతం నెలకొన్నది . టీ ఆర్ యస్ కూడా సంజయ్ పై ఎదురు దాడికి సై అంటున్నది . రాష్ట్రంలో బీజేపీకి మంచి ఇమేజ్ ని తీసుకొని రావటంలో సంజయ్ కృషిని అధిష్టానం కూడా గుర్తించింది . అందుకే గ్రేటర్ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్రమోడీ , హోమ్ మంత్రి అమిత్ షా లు స్వయంగా బండి సంజయ్ కి ఫోన్ చేసి మరీ అభినందిచారు . సంజయ్ హావ తెలంగాణాలో నడుస్తుంది …. దీన్ని అయన నిలబెట్టు కొంటారో పడగొట్టుకొట్టారో కాలమే నిర్ణయిస్తుంది !!!

Leave a Reply

%d bloggers like this: