రేవంత్ కు ఇస్తే కాంగ్రెస్ కు గుడ్ బై – టీ పి సి సి నేతల అల్టిమేటం

రేవంత్ కు ఇస్తే కాంగ్రెస్ కు గుడ్ బైటీ పి సి సి నేతల అల్టిమేటం
సోనియాను కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఢిల్లీ లో రేవంత్ , జగ్గారెడ్డి
సంపత్ కు సి సి నుంచి పిలుపు
-,శ్రీధర్ బాబు సైతం ఢిల్లీ కి
రేవంత్ కు ఇస్తే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానం వద్ద కొందరు టీ పి సీ సీ నేతలు కుండా బద్దలు కొట్టినట్లు తెలుస్తుంది …. దీంతో పి సి సి అధ్యక్షుడి ఎంపిక పై కాంగ్రెస్ అధిష్టానం సైతం మల్లగుల్లలు పడుతుంది ……. రేపో , మాపో నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తారని భావిస్తుండగా ఇప్పట్లో ప్రకటించే అవకాశం సన్నగిల్ల తుంది ….. రేసులో ముందున్న కోమటిరెడ్డి , రేవంత్ రెడ్డి మధ్య పోరు రసవత్తరంగా ఉంది …….. తనకే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేడం సోనియా గాంధీ ని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు . తాను పార్టీలో అత్యంత సీనియర్నేని , తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడి గా ఉన్నానని , పార్టీని అధికారంలోకి తెస్తానని సోనియా ముందు తనవాదనలను వినిపించారు ….. రేవంత్ కు ఇస్తే కాంగ్రెస్ పార్టీకు నష్టం జరుగుతుందని , ఆయన ప్రచారం చేసిన దుబ్బాకలో పార్టీకి ఓట్లు రాలేదని , అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయాడని , గ్రేటర్ లో సైతం ఆయన నియోజకవర్గంలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలవటం జరిగిందని , పార్టీ అండతో మల్కాజ్ గిరి పార్లమెంట్ కు గెలిచారని ఆయన వ్యతిరేకులు అధిష్టానం వద్ద తమ వాదనలను వినిపిస్తున్నారు . అంతే కాకుండ ఆయనకు ఆర్ యస్ యస్ బ్యాక్ గ్రౌండ్ ఉందని ,పార్టీలు మారిన చరిత్ర ఆయన దని , పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతామని కొందరు సీనియర్లు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చి నట్లు తెలుస్తుంది ….. గతంలో అరడజను పైగా తమకు అధ్యక్షుడు కావాలని పట్టు పట్టినప్పటికీ ప్రస్తుతం ఇద్దరి మధ్యనే బిగ్వార్ నడుస్తుంది . అధిష్టానం వద్ద మరో ఆలోచన కూడా ఉండే ఆవకాశం లేక పోలేదని ఇద్దరిలో ఎవరికీ ఇచ్చిన పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నందున మరో వ్యక్తికి ఇవ్వటం ద్వారా గ్రూపుల మధ్య రాజీ కుదర్చవచ్చుననే అభి ప్రాయాలు కూడా ఉన్నాయి . ఇప్పటికే , సీ ఎల్ పి నేత బట్టి విక్రమార్క , సీనియర్ నాయకుడు జానారెడ్డి పేరు విపిస్తుండగా , సీసీ కార్యదర్శి సంపత్ ను హుటాహుటిన ఢిల్లీ కి బయలుదేరి రమ్మని పిలుపు రావటంతో ఆయనకు కూడా ఆవకాశం ఉండ వచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . అందుకే సంపత్ ను ఎందుకు పిలిచారు అనే దానిపై ఇక్కడ నేతలు ఆరా తీస్తున్నారు . ఎం ఎల్ జగ్గారెడ్డి ఢిల్లీలో ఉండగా , ఆవర్గానికే చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేడో రేపో డిల్లీ బాట పట్టనున్నారు . రేవంత్ ను అధ్యక్షుడు కాకుండా చేసేందుకు ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ……. దీని వెనక ఎవరైనా అదృశ్య శక్తి పని సేస్తుందా అనే అనుమానాలు కలుగు తున్నాయని రేవంత్ వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . పార్టీ కష్టాల్లో ఉంది . ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ కు జవసత్వాలు రావాలంటే ప్రజల్లో ఆదరణ ఉన్న బలమైననాయకుడి అవసరం ఉంది . అలా కాకుండా నాయకుడి ఎంపిక జరిగితే మరో తమిళనాడు , లేదా మరో యూ పి , బెంగాల్, మహారాష్ట్రల సరసన తెలంగాణ కాంగ్రెస్ చేరక తప్పదు . అధిష్టానం ఏమిచేస్తుందో చూద్దాం !!!

Leave a Reply

%d bloggers like this: