సుప్రీం కోర్ట్ ను తాకిన రైతు ఉద్యమం

సుప్రీం కోర్ట్ ను తాకిన రైతు ఉద్యమం
మధ్యవర్తిత్వానికి సిద్ధం కావాలని సూచన
నలుగురి పేర్లు ఇవ్వాలన్న సీజే
రైతు ఉద్యమం సుప్రీం కోర్ట్ ను తాకింది . రైతుల సమస్యలను పరిషక్రించేదుకు తామే ఒక కమిటీ ఏర్పాటు చేయాలనీ యోచిస్తున్నట్లు సుప్రీం తెలిపింది . తక్షణమే దీనికి ఒక పరిష్కారం కావాలని సీజే బాబ్ డే అన్నారు . నలుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటుకు పేర్లను ఇవ్వాలని కూడా సీజే కోరారు . కేంద్రం కూడా ముందుకు రావాలన్నారు . రైతు ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతుంది . నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదని రైతులు చెబుతున్నడగా , ప్రధాని నూతన చట్టాల ద్వారానే రైతుకు భవిషత్ ఉందని పేర్కొంటున్నారు . గత 21 రోజులుగా ఎముకలు కొరికే చలిలో పిల్ల పాపలతో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది . అనేక దేశాలలో భారత్ లో రైతులు చేసుతున్న ఉద్యమానికి సంఘీభావంగా ప్రదర్శనలు చేశారు . దేశం అంతా ఈ ఉద్యమం వ్యాపించింది . . ఇటీవల కాలంలో ఇంతటి పట్టుదలతో జరిగిన ఉద్యమం లేదంటే అతిశయోక్తి కాదేమో . ఢిల్లీ సరిహద్దులలో ఉన్న రైతులను రోడ్లపైనుంచి ఖాళీచేయించాలని రిషబ్ శర్మ అనే వ్యక్తి సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించటంతో సుప్రీం కోర్ట్ రైతు ఉద్యమం పై స్పందించింది . కేంద్ర ప్రభుత్వం , రైతు ఉద్యమ నేతలు , కలిసి దీని పరిష్కరానికి ఆలోచనలు చేయాలనీ సూచించింది . అవసరం అయితే నలుగురు సభ్యులతో మధ్యవర్తిత్వం కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది . కమిటీ సభ్యుల పేర్లను ఇవ్వవలని తెలిపింది .రైతులు కూడా ఈ పీటీషన్ లో ఇంప్లిడ్ కావచ్చునని సీజే అన్నారు .

Leave a Reply

%d bloggers like this: