ఢిల్లీలో చారిత్రాత్మక రైతు ఉద్యమం

ఢిల్లీలో చారిత్రాత్మక రైతు ఉద్యమం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ దేశ రాజధాని ఢిల్లీ లో జరుగుతున్నరైతు ఉద్యమం చరిత్రాత్మకం . రోజురోజుకు ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతుంది . కేంద్రం చేసిన చట్టాలు రద్దు చేసేవరకు తమ ఉద్యమం ఆగదని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించగా ,ప్రభుత్వం తాము చేసిన చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని కావాలంటే వాటిలో సవరణలు మాత్రం చేస్తాం కానీ వాటిని ఎట్టి పరిస్థిలలో రద్దు చేయబోము అంటున్నది . ఇందులో రైతులదీ న్యాయమా ….. కేంద్రం చెపుతున్నది నిజామా …. అనేది ఎలా ఉన్నా రైతులకు ప్రజలనుంచి మద్దతు పెరుగుతున్నది . దేశ ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ మాట్లాడిన రైతులకోసమే చట్టాలు చేశామని పునరుద్ఘాటిసున్నారు .కేంద్ర మంత్రులు సైతం రైతులతో ఎన్ని సార్లు చర్చలు జరిపినా సమస్య పరిస్కారం దిశగా అడుగు ముందుకు పడటం లేదు . గత 25 రోజులుగా మైనస్ డిగ్రీల చలిలో సైతం అత్యంత పట్టు దలతో ఉద్యమాన్ని రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ జయప్రదంగా నడుపోతున్నది ఇప్పటివరకు 24 మంది రైతులు చనిపోయారు . ఒక సిక్కు మత గురువు కేంద్రం చర్యలను నిరసిస్తూ తన పిస్టల్ తో తానే కాల్చుకొని ఆత్మా హత్య చేసుకోవటం కలిచి వేసింది . ఉద్యమానికి రోజురోజుకు పెరుతున్న మద్దతుపై కేంద్రం ఆందోళన చెందుతున్నప్పటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది . ప్రధానంగా పంజాబ్ , హర్యానా , ఉత్తరప్రేదేశ్ రైతులు మొదటి నుంచి ఉద్యమంలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న వీరికి మద్దతు మాత్రం దేశవ్యాపితంగా లభిచటం విశేషం . ఉద్యమాన్ని చీల్చేందుకు ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలను కూడా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి . ఉద్యమంలో నక్సలైట్లు చేరారని , కమ్యూనిస్ట్ లు ఉద్యమం నడుపుతున్నారని , సన్నాయి నొక్కులు నొక్కినా ఉద్యమకారుల పట్టును ఏమాత్రం సడలించలేక పోయింది . 60 వేల మందికి పైగా రైతులు చేస్తున్న పోరాటం అమోఘం అనే మాటలే వినిపిస్తున్నాయి . యహత్ , ప్రపంచం దృష్టిని ఉద్యమం ఆకర్షించింది .అందుకే ప్రపంచం లోని అనేక దేశాలలో భారత్ లో రైతులు చేసుతున్న ఉద్యమానికి సంఘీభావంగా ప్రదర్శనలు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి , ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి, కెనడా ప్రధాని , అమెరికా లోని ప్రజలు సంఘీభావం తెలిపారు . అనేక మంది ప్రముఖులు తమకు కేంద్రం ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు . దీంతో ప్రజలు అండ సంపూర్ణగా లభిస్త్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదనే అభి ప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి . గతంలో అనేక రైతు ఉద్యమాలు జరిగినప్పటికీ ఢిల్లీ తరహా ఉద్యమం ఇంతవరకు జరగలేదనే పలువురు పేర్కొంటున్నారు . ఎముకలు కొరికే చలిలో సుమారు 60 వేలమందికిపైగా రైతులు దీక్షలో పాల్గొంటున్నారంటే వీరికి ఎంతటి పట్టుదల వుందో సమస్య ఎంత జఠిలమైనదో తెలుసుకోవచ్చు …..కానీ రైతుల ప్రమేయం ఏమాత్రం లేకుండా , కనీసం వారితో సంప్రదించకుండా కొత్త వ్యవసాచట్టాలను చేసిన కేంద్రం రైతుల ఢిమాండ్స్ అంగీకరించకుండా తాము చేసిన చట్టాలనే అమలుచేయయాలనే తలంపుతో అడుగులు వేస్తున్నది . చివరకు ఎన్ డీ కూటమిలోని తమ భాగస్వామ్య పక్షాలైన శిరోమణి ఆకాలి దళ్ , లోకతాంత్రిక్ పార్టీలు సైతం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. కేంద్రం చేసిన చట్టాలను వెనక్కు తీసుకునేందుకు సిద్ధంగా లేకపోవడంపై దేశంలోని వివిధరాజకీయ పార్టీలు , రైతు సంఘాలు , డాక్టర్ లు , లాయర్లు , మేధావులు , రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు . పోలీస్ శాఖలో ఒక డి జీ సైతం తన పదవికి రాజీనామా చేసి రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు . చివరకు సుప్రీం కోర్ట్ సైతం రైతులు రోడ్ల పై రాకుండా చర్యలు తీసుకోవాలని పిటీషన్ ను అంగీకరించలేదు . రైతులను రోడ్లపై నుంచి ఖాళీ చేయించాలని రిషబ్ శర్మ అనే వ్యక్తి సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించగా రైతులకు ఉద్యమం చేసుకునేహక్కును కాదనలేమని స్పష్టం చేసింది . అదే సందర్భంలో రైతు సమస్యలను పరిష్కరించేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనీ అందుకు ప్రభుత్వం , రైతులు పేర్లు ఇవ్వాలని చెప్పింది . దీనిపై అటు ప్రభుత్వం లోను , ఇటు రైతు సంఘాల ఐక్యకార్యాచరణ నాయకులతోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి . ప్రధాని మోడీ ఈనెల 25 రైతులతో మాట్లాడతారని అంటున్నారు ఉద్యమ ఫలితం ఏవిధంగా ఉంటుందోనని దేశం మొత్తం ఎదురు చూస్తుంది ……..

Leave a Reply

%d bloggers like this: