లండన్ విమానాలకు నో పర్మిషన్

లండన్ విమానాలకు నో పర్మిషన్
మహమ్మారి కరోనా వైరస్ మరోమారు ప్రపంచాన్ని వణికిస్తోంది . సెకండ్ వేవ్ , థర్డ్ వేవ్ అంటూ వస్తున్నా వార్తలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి . అమెరికా లో కరోనా వైరస్ భారిన పడినవారి సంఖ్య కోటి 78 లక్షల 19 వేల 583 మందికి చేరగా కోటి దాటి భారత్ రెండవ స్థానంలో నిలిచింది . మూడు నాలుగు స్థానాలలో బ్రేజాల్ , రష్యా ,ఉన్నాయి . అమెరికాలో 3 లక్షల 17 వేల 588 మంది చనిపోయారు . బ్రెజిల్ లో లక్షా 86 వేల 764 మంది మరణించగా ,భారత్ లో లక్షా 45 వేల 477 మంది మరణించారు . కోవిడ్ -19 కొత్త రూపం సంతరించుకున్నాడనే వార్తలు వస్తున్నా నేపథ్యంలో ప్రపంచ వ్యాపితంగా తిరిగి ఆంక్షలు మొదలైయ్యాయి . దీనికి తోడు క్రిస్మస్ , జనవరి ఒకటి ఉత్సవాలు ఉండటంతో యూరోపియన్ దేశాలతో పాటు అమెరికా , కెనడా , రష్యా , లాంటి దేశాలలో సైతం కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేసేందుకు ఆయా దేశాలు సిద్ధపడుతున్నాయి . లండన్ విమానాలు తమ దేశాలలోకి రాకుండా ఇప్పటికే ఐర్లాండ్ , బెల్జియం ప్రకటించగా ఫ్రాన్స్ , జర్మనీ , ఇటలీ , ఆస్ట్రియా , ఇజ్రాయిల్ లాంటి మరికొన్ని దేశాలు అదే దారిలో ఉన్నట్లు సమాచారం . సౌదీ ప్రభుత్వం తమ దేశ సరిహద్దులనే మూసి వేస్తున్నట్లు ప్రకటించింది . బ్రిటన్ లో వ్యాధి కొత్త రూపంలో వస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం టైర్ 4 లాక్ డౌన్ ప్రకటించింది . స్టైయిన్ పేరుతొ వైరస్ విజృభిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు . ఈవ్యాధి తీవ్రంగా విజృభించే ఆవకాశం ఉందని , దీనికి వాక్సిన్ సైతం పనిచేసే ఆవకాశంలేదని నిపుణులు పేర్కొంటున్నట్లు తెలుస్తున్నది . లండన్ తో పటు ఆగ్నేయ ఇంగ్లాండ్ లాక్ డౌన్ అమలులో ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ బేకర్ ప్రకటించారు . కొత్తరకం వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందని బ్రిటన్ వైద్య శాఖ అధికారులు ప్రకటించారు . వ్యాధిని వాక్సిన్ నిరోధిస్తోందని చెప్పటానికి వీలులేదని అంటున్నారు . అందుకని ఎవరికీ వారు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .

Leave a Reply

%d bloggers like this: