ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందా ?

ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందా ?
పార్టీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందా ….. పార్టీ ని యువ నాయకత్వానికి అప్పగిస్తుందా ? అందుకు తగిన చర్యలు తీసుకుంటుందా ? ప్రస్తుతం ఉన్న టీమ్తో నెట్టుకురావటం కష్టం అని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తుందా ? రాజస్థాన్ , మధ్యప్రదేశ్, లలో చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకున్నామని పార్టీ ఆత్మవిమర్శ చేసుకుందా? పార్టీలోని సీనియర్లు సోనియా గాంధీకి లేఖరాయటం పార్టీలో ఉన్న అసంతృప్తిని బయట పెట్టిందా ? పార్లమెంట్ లోనే కాదు ,ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేక పోటానికి భాద్యులు ఎవరు ? అంతకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో ఉన్నరాష్ట్రాలలో కూడా మంచి పెర్ఫార్మన్స్ ఎందుకు చూపించలేక పోయింది ? ఇప్పుడు గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఏరే వారికీ నాయకత్వాన్ని అప్పగిస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా ? లాంటి ప్రశ్నలు కాంగ్రెస్ నాయకత్వాన్ని , కేడర్ను వేధిస్తున్నాయి ……. దేశాన్ని సుదీర్ఘకాలం అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ పని అయిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి . ఇది ప్రత్యర్ధులు చేసే వాదనలైనా ఇందులో నిజం లేకపోలేదు . అయితే ఇక కోలుకోవటం సాధ్యం అయ్యేపనేనా అంటే తప్పకుండ ఆవకాశం ఉందనేది పరిశీలకుల అభిప్రాయం . గతంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ……. ఆవు పాయె , దూడపాయె అని వంగ్యాగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి . చాలాచోట్ల ఇందిరా కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకక పొతే అనామకులు పోటీకి పెట్టిన ,భారీ మోజార్టీలతో ఘన విజయాలు సాధించారు . ప్రస్తుతం మూడు నాలుగు రాష్ట్రాలలో మినహా అధికారం లేదు …. పార్లమంట్ లో కనీసం ప్రతిపక్ష హోదాకూడా దక్కంచుకోలేక పోయింది …… దీని మనుగడ ఏమిటి …….. అని కాంగ్రెస్ పై రకరకాల అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…… సోనియాకు ఆరోగ్యం సరిగాలేదు , రాహుల్ గాంధీకి అనుభవం లేదు పార్టీ ఇంకెక్కడా అనే ప్రచారం జనబాహుళ్యంలోకి వెళ్ళింది . దీనికి సమాధానం దొరకటం కష్టమే ….. కాంగ్రెస్ పని అయిపోయిందని అందువల్ల అందులో ఉంటె లాభం లేదని భావించే నాయకులూ ఒక్కరొక్కరుగా అధికారం వైపు పరుగులు తీస్తున్నారు . 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని పాలించింది . అనేక మంది నేతలు కాంగ్రెస్ నడిపించారు . పండిట్ జహర్లాల్ నెహ్రు, జే బి కృపాలాని ,భోగరాజు పట్టాభి సీతారామయ్య , పోరుశోత్తందాస్ టాండన్ , యూ ఎన్ దేబార్ , ఇందిరా గాంధీ , నీలం సంజీవరెడ్డి , కే .కామరాజ్ , ఎస్ .నిజలింగప్ప , జాగజ్జి వన్ రామ్ , శంకర్ దయాల్ శర్మ , దేవకాంత బారువా , కాసు బ్రహ్మనందరెడ్డి , ఇందిరా గాంధీ ,రాజీవ్ గాంధీ , పి.వి నరసింహారావు , సీతారాం కేసరి , సోనియాగాంధీ , రాహుల్ గాంధీ , మొత్తం 18 మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేయగా అందులో గాంధీ కుటుంబం నుంచి 4 గురు మాత్రమే పనిచేశారు . మిగతా 14 మంది గాంధీ యేతర కుటుంబం నుంచి వచ్చినవారు కావటం గమనార్హం . 1885 లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ దగ్గరనుంచి ఇప్పటి వరకు 88 మంది ఆపార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు . కానీ కాంగ్రెస్ పార్టీనే ప్రచారాన్ని తిప్పికొట్టలేక పోతుంది . బీజేపీ అధికారం లోకి వచ్చిన తరవాత దాడి మరింతగా పెరిగింది . గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం నిత్యం జరుగుతూనే ఉన్నది . ఇందులో వాస్తవమెంత …… నిజంగానే గాంధీ కుటుంబం దేశానికి నష్టం చేసిందా ? ……… చేస్తే ఇద్దరు నాయకులను ఎందుకు పోగొట్టుకున్నది . అంటే దానిపై ఎవరి అభిప్రాయాలూ వారికీ ఉన్నాయి . ఇది ఒక సాకు మాత్రమే ననే అభిప్రాయాలూ లేకపోలేదు . ప్రస్తుతం దేశం లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది అందంలో ఎలాంటి సందేహం అక్కరలేదు . అంతకు ముందు పార్టీని నడిపించివాళ్ళు పెద్దగా ప్రభావం చూపలేక పోయారని విమర్శలు లేక పోలేదు . 2014 , 2019 లలో ఓటమికి రాహుల్ గాంధీ కారణమని ,ఆయనకు రాజకీయ ఆహగాహన లేదనే అభిప్రాయాలూ ఉన్నాయి . ఆయన కాకుండా మరొక వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని , పార్టీలోని కొందరు తమ వాదనలు ముందుకు తెస్తున్నారు . 2019 జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు . ఆయన రాజీనామా సి డబ్ల్యూ సి ఆమోదించలేదు . అయినప్పటికీ తాను ఆపదవిలో ఉండటం కుదరదని కుండా బద్దలు కొట్టారు . అందుకు అయన చెపుతున్నట్లు గా జరుగుతున్నా ప్రచారమే నిజమైతే ఆయన కచ్చితంగానే ఉన్నాడని అనుకోవాల్సిందే . అనేక మంది కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ,ముఖ్యమంత్రులతోసహా పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులకు , బంధువులకు పార్టీపైవత్తిడి తెచ్చి మరీ టిక్కెట్లు ఇప్పించుకొని, పార్టీ తరుపున పోటీచేనా వారిని కనీసం పట్టించు కోలేదనే విమర్శలు ఉన్నాయి . అంతే కాకుండా తమ కుటుంబ సభ్యలను , బంధువులను గెలిపించుకోలేక పోయారని ఆరోపణలు వచ్చాయి . సీడబ్ల్యూ సి సమావేశంలో విషయాలపై రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీలు నాయకులను నిలదీసినట్లు వార్తలు వచ్చాయి . రాహుల్ రాజీనామా అనంతరం చాలాకాలం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది . అనేక మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ నే అధ్యక్షుడిగా కొనసాగాలని వత్తిడి తెచ్చారు అయినప్పటికీ ఆయన అంగీకరించలేదు . కొంతకాలం తరువాత సమావేశమైన సి డబ్ల్యూ సి సోనియా గాంధీనే తిరిగి తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగాలని తీర్మానించింది . కోవిద్ కారణంగా అనుకున్న కాలానికి ఏఐసిసిసమావేశం జరగలేదు . బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది . దింతో మరోసారి కాంగ్రెస్ సీనియర్లకు కోపం వచ్చింది . బాహిరంగ విమర్శలకు దిగటంతో, పార్టీ ని ప్రక్షాళన చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది . అంతకు ముందే కొంతమంది సోనియాకు ఒక లెటర్ కూడా రాశారు . దీనిపై పార్టీలో పెద్ద దుమారమే చెలరేగింది . గులాంనబీ ఆజాద్ , కపిల్ సిబాల్ , లాంటి కాంగ్రెస్ సీనియర్లు తిరుగుబాటు చేశారు . రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘర్ , రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది . దీన్ని రాహుల్ ఖాతాలో వేయలేదు . ఓటమి మాత్రమే ఆయన ఖాతాలో వేయడం పై ఆయన అనుయాయులు భగ్గుమంటున్నారు . దీంతో కాంగ్రెస్ లో గందరగోళం నెలకొన్నది . దీనిని సరిచేసే పనిలో సోనియా గాంధీ ఉన్నారు . పార్టీ ని ప్రక్షాళన చేయటం ద్వారానే ఇది సాధ్యం అనే అభిప్రాయానికి వచ్చారు . ఇప్పుడు ఆమె ముందున్న కర్తవ్యం ఏఐ సి సి కి ఎన్నికలు జరపటం . అందుకు సిద్ధపడుతున్నారు . కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతుందో……. ఆపార్టీకి మంచి రోజులు వస్తాయా ? లేదా అనేది వేచి చూడాల్సిందే !!!

Leave a Reply

%d bloggers like this: