భారత్ లోకి కొత్త వైరస్ స్టైయిన్

భారత్ లోకి కొత్త వైరస్ స్టైయిన్
బ్రిటన్ ను వణికిస్తున్న కొత్త రకం వైరస్ స్టైయిన్ భారత్ లోకి ప్రవేసించిందనే వార్తలు కలవర పెడుతున్నాయి . కరోనా వైరసులోనే ఇదోరకమని వైద్యరంగ నిపుణులు అంటున్నారు . ఇది ఇప్పుడు భారత్ లోకి ఇంగ్లాండ్ నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికుల ద్వారా వచ్చిందని నిర్దారణ అయింది . దీంతో ఇక్కడ అధికారులు అప్రమత్తం అయ్యారు . బ్రిటన్ నుంచి ఢిల్లీ మీదగా చెన్నై కి వచ్చిన ఒక ప్రయాణికుడి కి పరీక్షలు నిర్వయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది . అతనికి పరీక్షలలో పాజిటివ్ అని నిర్దారణ కావటంతో ఆసుపత్రికి తరలించి క్వారంటైన్ లో ఉంచారు . బ్రిటన్ నుంచి భారత్ వచ్చే విమాన సర్వీస్ లను నిలిపి వేశారు .
రిపబ్లిక్ డే కి బోరిస్ జాన్సన్ అనుమానమే
ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్ కు ముఖ్య అతిధిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను భారత ప్రభుత్వం ప్రత్యేక అతిధిగా ఆహ్వానించింది . అయితే అక్కడ ప్రస్తుతం కరోనా విజృంబిస్తున్నట్లు వార్తల నేపథ్యంలో ఆయన రక అనుమానమే అని తెలుస్తుంది . గతంలో ఆయనకు కరోనా వచ్చింది . దీంతో ఆయన దేశం విడిచి వెళ్లరాదని వైద్యులు సలహా ఇచ్చినట్లు సమాచారం .
20 పైగా దేశాల విమానాలు బ్రిటన్ వెళ్లేందుకు నిషేధం
కరోనా మహమ్మారి మరోసారి బ్రిటంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదేశానికి రాకపోకలను 20 పైగా దేశాలు నిషేధించాయి . ఈ నిషేధం జనవరి మొదటి వరం వరకు ఉండవచ్చునని తెల్సుతుంది . ఇప్పటికే యూ కే సహా అనేక దేశాలలో కర్ఫ్యూ విధించారు . కఠినమైన ఆంక్షలు పాటిస్తున్నారు .

Leave a Reply

%d bloggers like this: