బార్యభర్తల విడాకులకు దారితీసిన రాజకీయం?
రాజకీయాలవల్ల బార్యభర్తల మధ్య గొడవలు సహజం. విడాకుల వరకు వెళ్ళటం విచిత్రం. కాని అది జరిగింది.అది ఎక్కడో కాదు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భర్త బీజేపీ పైగా పార్లమెంట్ సభ్యుడు అయిన సౌమిత్రాఖాన్, అతని బార్య సుజాత ఖాన్ కూడ బీజేపీ లోని ఉంది. పార్లమెంట్ ఎన్నికలలో భర్త విజయంలో కీలకపాత్ర .పోషించింది. కాని పార్టీలో తనకు ప్రాధాన్యత లేకపోవటంతో అసంతృప్తిగా ఉంది.చివరకు భర్తకు ప్రత్యర్థిపార్టీ అయిన తృణమూల్ లో బార్యసుజాతఖాన్ చేరింది.ఫలితంగా ఇంట్లో గొడవలు మొదలైయ్యాయి. దీంతో భర్త లీగల్ గానే బార్యకు నోటిసులు ఇచ్చారు.ఈ వార్త ఒక్క బెంగాల్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సౌమిత్రాఖాన్ ,సుజాత ఖాన్ ల విడాకుల వ్యహరం ఏమవుతుందోననే ఆసక్తి నెలకొన్నది .