మమతా – మోడీ బిగ్ ఫైట్

బెంగాల్ బ్యాటిల్
మమతా – మోడీ బిగ్ ఫైట్
సువెందు అధికారి చేరికతో తమ పని సులువైంది బీజేపీ సంబరం

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికలు మమత-మోడీ మధ్య బిగ్ ఫైట్ గా మారనున్నాయి…….. గతంలో మార్క్సిస్టుల కంచు కోట , ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ గడ్డగా ఉన్నబెంగాల్ ను ఎలాగైనా కమల దళంలో చేర్చాలని కమలనాధులు గట్టి పట్టుదలతో ఉన్నారు . అందుకనుగుణంగా బెంగాల్ లో తమ కార్యాచరణను ముమ్మరం చేశారు . ఎన్నికలు ఎంతో దూరంలో లేనందున బెంగాల్ రాజకీయ రసవత్తరంగా మారింది . ఆరోపణలు , ప్రత్యారోపణలు ,దాడులు ,ప్రతిదాడులు , ఇక్కడ నిత్యకృత్యమైయ్యాయి . రాజకీయ హత్యలు సర్వసాధారణంగా మారాయి . ఎన్నికల నాటికీ ఇంకా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు . గత సంవత్సర కాలంగా తృణమూల్ కాంగ్రెస్ , బీజేపీ మధ్య యుద్ధం బెంగాల్ రాజకీయాలను కాక వికలం చేస్తుంది . తృణమూల్ కాంగ్రెస్ ను దెబ్బ తీయాలని బీజేపీ అనేక ఎత్తులు వేస్తున్నది . ఆ పార్టీ నుంచి ఎం పీ లను తమ పార్టీలో చేర్చు కున్నది . ఎమ్మెల్యేలను , మాజీలను పెద్ద ఎత్తున బీజేపీ లో చేర్చుకోవటం ద్వారా తమ బలం పెరిగిందని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారం అని ధీమాగా చెబుతున్నది . కేంద్ర బీజేపీ నాయకత్వం అంతా బెంగాల్ చుట్టూ చక్కర్లు కొడుతున్నది . చివరకు ప్రధాని మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జె పీ నడ్డా లు బెంగాల్ పర్యటనలతో బిజీ గా ఉన్నారు . మూడురోజుల క్రితం బెంగాల్ పర్యటన చేసిన అమిత్ షా ప్రతివారం బెంగాల్ వస్తానని ప్రకటించారు . ఆయన పర్యటన సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో సహా ఒక ఎంపీ బీజేపీలో చేరారు . ప్రధానంగా తృణమూల్ ముఖ్యనేత సుడెందు అధికారి చేరిక తమకు మరింత బలాన్ని ఇచ్చిందనే సంబరం బీజేపీలో కనపడుతుంది . అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా మమతా బెనర్జీ అంతే స్థాయిలో బీజేపీ పై తదైనా స్టైల్లో పోరాటం చేస్తున్నది . బీజేపీ లో కీలకంగా ఉన్న నాయకులకు గాలం వేస్తున్నది. బీజేపీ ఎంపి బార్య సుజాత ఖాన్ తృణమూల్ లో చేరడం ఆశక్తిగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ కు ఎన్నికల హ్యూహకర్త గా ప్రశాంత కిషోర్ వ్యహరిస్తున్నారు . 200 కు పైగా సీట్లు గెలుచుకొని తిరుగులేని ఆధిక్యంతో అధికారం చేపట్టబోతున్నట్లు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా డంకా బజాయించి చెపుతుండగా , అంత శీను బెంగాల్ లో వారికీ లేదు, రెండు అంకెలకు మించి సీట్లు వస్తే తాను ఇక ఎన్నికల రంగంనుంచి తప్పుకుంటానని ప్రశాంత కిశోర్ ప్రకటించారు .
మమతపై ముప్పేట దాడి
గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఎంసీ పై సహజంగానే ప్రజలలో కొంత వ్యతిరేకత ఉంది . దాన్ని సొమ్ము చేసుకోవటం ద్వారా లబ్ధ్ది పొందాలని బీజేపీ పధక రచనలు చేస్తున్నది . గతంలో అధికారంలో ఉన్న సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ , కాంగ్రెస్ లు ఒక్కటిగా పోటీచేస్తూ బీజేపీ, టీఎంసీ లకు ప్రత్యామ్న్యాయం తామే నంటూ ప్రచారం చేస్తున్నాయి . ఇది ఇలా ఉండగా గతంలో టీఎంసీ కి మద్దతుగా ఉన్న ముస్లింలు ఈ సారి ఎంఐఎం టికెట్ పై పోటీచేయించేందుకు అసదుద్దీన్ఒయైసి ప్రయత్నాలు ప్రారంబించారు . ముస్లింల ఓట్లు చీలిపోవటం వలన అది బీజేపీకి లభిస్తుందనే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి . బీహార్ ఎన్నికల్లో కూడా అదే జరిగిందని అందువల్ల బీజేపీకి మేలు చేసేందుకే ఎంఐఎం కావాలనే పోటీచేస్తున్నదనే అభిప్రాయాలూ ఉన్నాయి . ఇంతమందిని ఎదిరించి మమతా తిరిగి బెంగాల్ ను దక్కించుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే !!!

 

Leave a Reply

%d bloggers like this: