జనవరి 26న నాగళ్లు,ఎడ్లబండ్లతో ఢిల్లీ లో భారీ ర్యాలీ

జనవరి 26న నాగళ్లు,ఎడ్లబండ్లతో ఢిల్లీ లో భారీ ర్యాలీ
ఉదృతం అవుతున్న రైతు పోరు
చట్టాలు రద్దే తమ ప్రధాన ఎజెండా
ఢిల్లీ దేశరాజధాని …… ఎముకలు కొరికే చలి ……. రైతుల ఉద్యమం తో వేడెక్కింది ….. పంజాబ్ ,హర్యానా , రాజస్థాన్ , రైతులకు తోడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ , రైతులు కూడా భాగస్వాములు అవుతున్నారు . దేశ వ్యాపితంగా దీనికులం మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి . డిసెంబర్ 8 న భారత్ బంద్ జరిగింది . తెలంగాణ ,కేరళ, పశ్చిమ బెంగాల్ , ఆంధ్రప్రదేశ్ ,పంజాబ్,రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ , మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు బందు కు ప్రత్యక్ష , పరోక్ష మద్దతు ఇచ్చాయి . అన్న హజారే రైతుల కోసం మరోసారి దీక్షలకు సిద్ధమని ప్రకటించారు . కాంగ్రెస్ , సమాజ్ వాదీ, ఎన్ సి పి , టీఎంసీ , సిపిఐ సిపిఎం , ఆర్ జె డి ,వివిధ పార్టీల అనుబంధ రైతు సంఘాలు ,ఈ ఉద్యమానికి అండగా నిలిచాయి . ఇది మరింత ఉదృతం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి . జనవరి 26న నాగళ్లు,ఎడ్లబండ్లతో ఢిల్లీ లో భారీ ర్యాలీ నిర్వించాలని రైతు కార్యాచరణ కమిటీ ప్రకటించింది ….. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లు , నాగళ్లతో రైతులు తరలి వస్తున్నారు . ఆ రోజు గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతాయి . అందువల్ల రైతు ల ఢిల్లీ కవాతు కు అనుమతి ఇవ్వక పోవొచ్చు …….అయినప్పటికీ రైతులు పట్టుదలతో దీన్ని కొనసాగించేందుకు సిద్దపడుతున్నారు . రైతు ఉద్యమం ఒకరోజు రెండురోజులు కాదు …… ఏకంగా నెలరోజులుగా ఢిల్లీ సరిహద్దులలో కేంద్రీకృతం అయిఉంది ….. దేశానికి అన్నము పెట్టె రైతులు గుడారాలు వేసుకొని పిల్లాపాపలతో ఉద్యమం కొనసాగిస్తున్నారు ….. రాష్ట్రపతి , ప్రధాని ,కేంద్ర క్యాబినెట్ మంత్రులు నివాసాలకు కూతవేటు దూరంలో ఇది కొనసాగుతుంది ….. కేంద్ర మంత్రులు రైతులతో పలుదపాలు చర్చలు జరిపినప్పటికీ నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామని మాత్రం అనటం లేదు . సవరణలు చేస్తాం అంటూ చేచాలను సాగదీస్తున్నారు . పరిస్కారం చేయాలనే ఆలోచన ఉన్నట్లు కేంద్రం వ్యవరించటం లేదనే రైతుల ఆరోపణ . చిత్తశుద్ధితో దీన్ని పరిస్కరిస్తుందనే విశ్వాసం కనిపించటం లేదు …… ఢిల్లీ రహదార్లను ను దిగ్బంధించి కేంద్రం చేసిన రైతు చట్టాలను రద్దు చేయాలనే ఏకైక డిమాండ్ మారుమోగుతోంది ….. ఐక్యత , పోరాటం, చట్టాల రద్దు దిశగా సాగుతున్న ఈ ఉద్యమం చారిత్రాత్మకంగా నిలిచి పోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు . రైతుల బాగు కోసం తెచ్చిన నూతన వ్యవసా చట్టాలను రైతులే వద్దని ఉద్యమిస్తుంటే ప్రధాని మోడీ మాత్రం రైతుల మేలుకోసమే ఈ చట్టాలను తెచ్చామంటున్నారు . నూతన చట్టాలు వద్దే వద్దు అని రైతులు అంటుంటే , అవేముద్దని ప్రధాని మోడీ సెలవ్ ఇస్తున్నారు . ఇదేక్క న్యాయం అని ప్రశ్నిస్తే పోలీసులతో వాటర్ క్యానన్లు ,లాటీలు తూటాలతో , ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారని ఉద్యమకారులు వాపోతున్నారు . తమ ఉద్యమం రాజకీయ పరమైంది కాదు . దీని రాజకీయం చేయాలనీ ప్రభుత్వం చూస్తున్నదని రైతు సంఘాల నాయకులూ పేర్కొంటున్నారు .గతంలో ఇలాంటి ఉదయం జరగలేదని , రైతుల పట్టుదలకు చట్టాలపై వారికున్న వ్యతిరేకతకు ఇది అద్దం పడుతుందనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి . ఇప్పటికైనా ప్రభుత్వం బెట్టుకు పోకుండా పెట్టు దిగి రైతుల కోరికలను మన్నించి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తుందని ఆశతో రైతులు ఉన్నారు .!!!

Leave a Reply

%d bloggers like this: