క్వింటాల్ మిర్చి ధర 36 వేలు

క్వింటాల్ డబ్బీ మిర్చి ధర 36 వేలు
కర్ణాటకలో పేరుగాంచిన డబ్బీ బాడీగా రకం మిర్చి ధర kiwntal 36 వేలు పలికింది . ఇది మిర్చి యార్డ్ లలోనే పేరున్న గుంటూరు యార్డ్ లో జరిగింది . కర్నూల్ జిల్లా రెడ్డి పల్లె కు చెందిన ప్రసాద రెడ్డి అనే రైతు దీన్ని బుధవారం గుంటూరు యార్డుకు తేగా ఈ ధరకు ఖరీదు దారు కొనుగోలు చేశారు . అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంటుందని అందువల్లనే ఆరేటు పలికిందని తెలుస్తున్నది . ప్రసాదరెడ్డి 8 ఎకరాలలో దీన్ని సాగుచేశారు . 60క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది . ఆ రైతు కు 21 లక్షల 60 వేల రూపాయలు వచ్చాయి .

Leave a Reply

%d bloggers like this: