ముఖ్య మంత్రిగా కే టీ ఆర్ ?

ముఖ్య మంత్రిగా కే టీ ఆర్ ?
త్వరలోనే ముహూర్తమా ?
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అధికార మార్పిడి జరగనున్నదా ? ముఖ్య మంత్రిగా కే టీ ఆర్ అధికార పగ్గలు చేపట్ట నున్నారా ….. అందుకు ముహూర్తం ఖరారు అయిందా ? ఆయనకు ఆ సమర్థత ఉందా ? ….. పెద్దాయన తన బాధ్య తలను కుమారుడి అప్పగించనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి టీ ఆర్ ఎస్ వర్గాలు . డోర్నకల్ ఎం ఎల్ ఏ రెడ్యానాయక్ మాటలు దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి . తన నియోజక వర్గం లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన త్వరలో కే టీ ఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పటంతో ఈవిషయం మరోసారి తెరపైకి వచ్చింది …. రెడ్యానాయక్ మాటలు ఎలా ఉన్న కే టీ ఆర్ ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడు అనే మాటలే వినిపిస్తున్నాయి. గతంలో మంత్రి శ్రీనివాసగౌడ్ కూడా కే టీ ఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన సందర్భం ఉంది . జిల్లాలలో కూడా కే టీ ఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అభిప్రాయాలే ఉన్నాయి . విద్యా వంతుడు ,తెలివి తేటలు , చురుకుదనం ఉన్నవాడు … తెలుగు, హిందీ , ఇంగ్లీష్ , భాషలపై మంచి పట్టు ఉన్నవాడు . రాష్ట్ర రాజకీయాలను , అవపోసాన పట్టిన వాడు …. కలుపుగోలుతనం , రాష్ట్ర అభివృద్ధి పై సమగ్ర అవగాహనా ఉన్న కే టీ ఆర్ ను సీఎం గా చూడాలనేది చాలామంది పార్టీ ఎం ఎల్ ఏ ల ,కార్యకర్తల, నాయకుల బలమైన కోరిక . ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా , రాష్ట్ర కాబినెట్ మంత్రిగా పార్టీ పై పట్టు సాధించారు . మంత్రులు , ఎం ఎల్ ఏ లు , పార్టీ యంత్రాగం అంతా ఆయన కనుసన్నలలోనే నడుస్తుంది . ప్రస్తుతం పేరుకే మంత్రి సీఎం స్థాయిలో రాష్ట్రంలో ఆయన చక్రం తిప్పుతున్నాడు …. ఆయన పర్యటనలకు సైతం సీఎం స్థాయిలోనే బందోబస్తు ఉంటుంది . పార్టీ రాంక్ అండ్ ఫైల్స్ కూడా ఆయన వెంట పరుగులు పెడుతున్నాయి. ప్రాపకం కోసం పాకులాడుతుంటాయి . గతంలో హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా వ్యవహరించేవారు . కానీ ప్రస్తుతం అన్ని తానై కే టీ ఆర్ వ్తవహరిస్తున్నారు . అనేక సార్లు కెసిఆర్ పదవి నుంచి తప్పుకొని తన కుమారుడైన కే టీ ఆర్ కు అధికార పగ్గాలు ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి . కానీ రకరకాల కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది . 2018 ఎన్నికలకు ముందు కెసిఆర్ దేశంలో వివిధ రాష్ట్రాలకు పర్యటనలు , తృతీయ ప్రత్యాన్మయం లాంటి మాటలు రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుందని పెద్ద ప్రచారం జరిగింది . కెసిఆర్ పార్లమెంట్ కు పోటీచేసి కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పనున్నారని ఇక్కడ అధికార పగ్గాలను కే టీ ఆర్ కు అప్పగించనున్నారని ప్రచారం జరిగింది . కానీ అది జరగలేదు . రెండవ సారి అధికారం లోకి వచ్చిన తరవాత , కచ్చితంగా యువనేతనే ముఖ్యమంత్రి అవుతారని భావించారు అనేక మంది . కెసిఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు . ఆయన మంత్రి వర్గంలో సైతం కే టీ ఆర్ గాని హరీష్ రావు గాని లేకపోవటం తో పార్టీ శ్రేణులతో పటు అందరిని ఆశ్చర్య పరిచింది . 2019 పార్లమెంట్ ఎన్నికల తరువాత మంత్రి వర్గ పునః వ్యవస్తీకరణ జరిగింది . అందులో కే టీ ఆర్ పేరు చోటు చేసుకుంది . ఇక నాటి నుంచి కే టీ ఆర్ మంత్రి వర్గంలో కీలకం అయ్యారు . మున్సిపల్ ఎన్నికలు , స్థానిక సంస్థలు , సహకార సంఘాలు , నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇలా అన్నిటిలో ఆయన ముద్ర ఉంది . ఇటీవల జరిగిన హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో అన్ని తానై వ్యవహరించారు . రాష్ట్ర రాజకీయాలలో ట్రెండ్ సెట్టర్ గా ఉన్న కే టీ ఆర్ ముఖ్యమంత్రి అవ్వటం అనేది ఖాయం. ముహూర్తం ఎప్పుడు అనేది చూడాల్సిందే …..

Leave a Reply

%d bloggers like this: