రేవంత్ దూకుడు కాంగ్రెస్ ను గట్టు ఎక్కించగలదా ?

రేవంత్ దూకుడు కాంగ్రెస్ ను గట్టు ఎక్కించగలదా ?
రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అవునంటే కాబోయో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ .కానీ అనేక అడ్డంకులు …..రేవంత్ కు పదవి ఇస్తే తాము పార్టీ వీడతామని సీనియర్ల అల్టిమేటం …. ఓటుకు నోట్ల కేసు ….. కొండగల్లో ఎందుకు ఓడిపోయాడని ఎదురుదాడి ….. అయినప్పటికి దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి మౌనం ……కాంగ్రెస్ అధిష్టానం గట్టి హామీ ఇచ్చిందనే ప్రచారం .
రేవంత్ దూకుడు కాంగ్రెస్ ను గట్టు ఎక్కించగలదా ? ఆయన మాటల తూటాలు పేల్చగల దిట్ట , రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ పై ఒంటి కాలుపై లేచే తత్వం .దైర్యంగా ముందుకు అడుగుగులు వేసే ధోరణి ఆయన్ను టీపీసీసీ అధ్యక్షుడిని చేస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు . తెలంగాణ రాష్ట్రము ఇచ్చి అంపశయ్య మీద ఉన్న పార్టీకి రేవంత్ శస్త్ర చికిత్స చేయగలడా ? అధిష్టానం రేవంత్ పై గట్టి నమ్మకంతో, విశ్వాసంతో ,గంపెడు ఆశతో రేవంత్ కు తెలంగాణ పార్టీ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న . ఆంధ్రా నాయకత్వం తెలంగాణ ఇచ్చేందుకు ససేమీరా అన్నా , అక్కడ తమ పార్టీ ఉనికి కోల్పోతుందని తెలిసినా , ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రము ఇచ్చేందుకు ఇంటా బయట చాలా ఇబ్బందులు పడ్డారు . పార్లమెంట్ తలుపులు మూసి మరీ తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపచేశారు . అయినప్పటికి తెలంగాణ ప్రజలు కాంగ్రెసును ఆదరించలేదు . బొటాబొటిగా ప్రతిపక్ష హోదాఇచ్చారు . తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కెసిఆర్, కారణాలు ఏమైనా ఆపని చేయలేదు . 2014 ఎన్నికల తరువాత గెలిచినా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీ ఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు . ఇక 2018 రెండవ సారి తెలంగాణ శాసన సభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు . అందులో నుంచి 12 మందిని అధికార టీ ఆర్ యస్ తమ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ కు ప్రతి పక్ష హోదాకూడా లేకుండా చేసింది . అంతే కాకుండా కనీసం ప్రధాన పక్షంగా కూడా ఉండకుండా ఎంఐఎం కన్నా ఒక ఎమ్మెల్యే తక్కువగా ఉండేవిధంగా ప్లాన్ చేసి కాంగ్రెస్ మీద కసి తీర్చుకుంది . రాష్ట్రము లో కాంగ్రెస్ కు జవజీవాలు కలిగించి అధికారంలో తేగలిగాన నేతకు వెతుకుతున్న పార్టీ కి తెలుగు దేశం నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కనిపించదు . ఆయనలో దూకుడు కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందని అధిష్టానం యోచన . ప్రస్తుతం రాష్ట్రంలో కెసిఆర్ ను దీటుగా ఎదుర్కోగల నేతకు ప్రజలు ఎదురు చూస్తున్నారు . పార్టీ పక్కన పెడితే ఎవరు ఆ మొనగాడు అని వెతుకుతున్న సందర్భంలో రేవంత్ అయితేనే కెసిఆర్ కు దీటుగా సమాధానం ఇవ్వగలడనే అభిప్రాయం మెజార్టీ కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తం అయింది . అందువల్లనే ఎన్ని వత్తిడిలు ఉన్న పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోతామని హెచ్చరించిన లెక్కచేయకుండా వారిని ఒప్పించి టీపీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమైంది . చివరకు వి . హనుంతరావు లాంటి సీనియర్ నేత రేవంత్ కు ఇస్తే పార్టీని వీడతానని . రేవంత్ మీద సిబిఐ కి పిర్యాదు చేస్తానని హెచ్చరించారు . టీపీసీసీ ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అమ్ముడు పోయాడని కూడా ఆరోపించారు . రేవంత్ రెడ్డి పైనే కాకుండా ,మాణిక్యం ఠాకూర్ మీద కూడా తీవ్ర ఆరోపణలు చేసిన వి .హనుమంతరావు పైన కాంగ్రెస్ అధిష్టానం చెర్యలకు ఉపక్రమిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి చెర్యలు తీసుకుంటుందో చూడాలి .
అందరిని సంతృప్తి పరిచేలా చర్యలు
కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లనందరిని సంతృప్తి పరిచేలా చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం . ఇప్పటికే సి ఎల్ పీ నేత బట్టి విక్రమార్క ను ఢిల్లీకి పిలిపించారు . కాంగ్రెస్ శాసన సభ పక్ష నేతను మార్చుతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో బట్టి ఢిల్లీ పర్యటన ప్రాధాన్య త సంతరించుకున్నది . అయితే బట్టి ని శాసన సభ పక్ష నేతగా కొనసాగించడంతో పాటు మరో భాద్యనను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది . టీపీసీసీ చీఫ్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా కోమటి రెడ్డి వెంకటరెడ్డి ని cwc లోకి తీసుకోవటం తో పాటు , దుద్దిళ్ల శ్రీధరబాబు , షబ్బీర్ అలీ , జగ్గారెడ్డి , లాంటి నేతలకు ప్రాధాన్యత ఇచేలా చర్యల తీసుకునే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది చూద్దాం కాంగ్రెస్ లో ఏమి జరుగుతుందో !!!

Leave a Reply

%d bloggers like this: