టీపీసీసీ చీఫ్ గా షబ్బీర్ అలీ ?

టీపీసీసీ చీఫ్ గా షబ్బీర్ అలీ ?
అనేక నాటకీయ పరిణామాల మధ్య టీపీసీసీ చీఫ్ గా వివాద రహితుడు మైనార్టీ కి చెందిన షబ్బీర్ అలీ ని నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. వై యస్ రాజశేఖర్ రెడ్డి హయం లో షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసి గెలుపొందారు . మంత్రిగా కూడా పని చేశారు . అధిష్టానం తో మంచి పరిచయాలు ఉన్నాయి . గ్రూపులకు అతీతంగా అందరు ఆయన్ని సమర్థించటం ఆయనకు కలిసి వచ్చిన అంశం అని తెలుస్తుంది . ఎన్ యస్ యూ ఐ లోను అనంతరం యూత్ కాంగ్రెస్ లోను ఆయన భాద్యతలు నిర్వవించారు . టీపీసీసీ చీఫ్ పదవి కోసం మల్కాజి గిరి ఎంపీ రేవంత్ రెడ్డి , బోనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు . వారు ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసి అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు . రేవంత్ రెడ్డి నియామకం దాదాపు జరిగిపోయిందని ఇక ప్రకటించటమే తరువాయి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో , కాంగ్రెస్ లోని సీనియర్లు , ఇస్తే కోమటిరెడ్డి ఇవ్వండి లేకపోతె వేరే వారికీ ఇవ్వండి అని పట్టు బట్టినట్లు తెలుస్తుంది . దీంతో రేవంత్ లేదా కోమటి రెడ్డి ఎవరికీ ఇచ్చిన పార్టీకి పెద్ద నష్టం జరిగే సూచనలు ఉండటంతో మరో పేరు చెప్పాలని ఇద్దరినీ కోరగా వారు షబ్బీర్ అలీ పేరు చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల బోగట్టా . అయితే దీనిపై అధిష్టానం సీరియస్ గా ఆలోచన చేస్తుందని సమాచారం . అన్ని అనుకూలిస్తే షబ్బీర్ అలీ పేరును వారం రోజుల లోపు ప్రకటించే ఆవకాశం ఉందని అంటున్నారు . కాంగ్రెస్ లో ఏమైనా జరగవచ్చు రేపు మరోపేరు వచ్చినా రావచ్చు ననే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి .

Leave a Reply

%d bloggers like this: