టీ ఆర్ యస్ కు నిర్మాణ సమస్యలే శాపాలుగా మారనున్నాయా ?

టీ ఆర్ యస్ కు నిర్మాణ సమస్యలే శాపాలుగా మారనున్నాయా ?
మంత్రులకు శాఖల ఉన్నా అధికారం లేదా ?
జల్లాలలో కమిటీ ఏర్పాటు మాటేమిటి ?
టీ ఆర్ యస్ కు నిర్మాణ సమస్యలే శాపాలుగా మారనున్నాయా ?….. 20 సంవత్సరాల క్రితం ఏర్పడి, ఆరు సంత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ నిర్మాణం విషయంలో ఎందుకు వెనకంజ వేస్తున్నదని ప్రశ్నకు సమాధానం దొరకటం లేదనే అభి ప్రాయాలు ఉన్నాయి . రాష్ట్ర కమిటీ తప్ప జిల్లాలలో కమిటీ ఏర్పాటు ప్రకటనలేకే పరిమితమైందా ? …. జిల్లా కార్యాలయాల నిర్మాణం ఎంతవరకు వచ్చింది . ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు,ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన విభేదాలు వస్తే పరిష్కరించకుండా వారిని వదిలేస్తే పార్టీ పరిస్థితి ఏమిటి ? పేరుకే మంత్రులా? వారికి శాఖల మీదతగిన అధికారాలు ఉండాల్సిన అవసరం లేదా ? …..జిల్లాలో నిర్మాణం నీరు కారిందా ?….. 10 కాలాల పాటు పార్టీ సజీవంగా మనగలగాలంటే కార్యకర్తల బలం అవసరం కదా ? అలా కాకుండా వ్యక్తుల పార్టీగా మార్చటం నష్టమని రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్నా అధినేత కెసిఆర్ గుర్తిచటం లేదా ? గుర్తించి కావాలనే పక్కన పెడుతున్నారా? శాఖాలమీద అధికారం లేని మంత్రులు జిల్లాలలో పెత్తనం చేయటాన్ని ఎమ్మెల్యేల అంగీకరించలేక పోతున్నారనే విషయాన్నీ గుర్తించారా ? దీనిపై పార్టీలోనూ ప్రజలలోను , ముఖ్య నేతలతోనూ ఉన్న సందేహాలకు పరిస్కారం లభిస్తుందా ? ఉద్యమ పార్టీ వ్యక్తుల , కుటుంబ పార్టీగా మారిందనే విమర్శలకు సమాధానం ఏమిటి ? రాష్ట్రంలో అధికారంలో ఉన్నటీ ఆర్ యస్ కు, తెలంగాణ రాష్ట్రము సాధించిన పార్టీగా గుర్తింపు ఉంది . పార్టీ అధ్యక్షడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తదైనా శైలిలో ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు . అవసరం మేరకు పార్టీ సమావేశాలు పెట్టి తమ ఆలోచనలు వారితో పంచుకుంటున్నారే తప్ప , తమ అభిప్రాయాలను వినటం లేదనే వాదనలో నిజం ఉందా? పార్టీ కి సరైన నిర్మాణం లేదనే అభిప్రాయాలూ ఉన్నాయి . నిర్మాణం చేయాలనే ఆలోచనలను ఎంతవరకు ఆచరణలో పెట్టారు . రాష్ట్ర కమిటీ ఉన్నా జిల్లాలలో కమిటీలు లేవు . మండల కమిటీలు ఉన్న అవి నేరుగా నియోజకవర్గ ఎమ్మెల్యేల అధీనంలో మాత్రమే ఉన్నాయి . వారి అనుయాయిలకే పదవులు దక్కుతున్నాయి . ఇక నామినేటెడ్ పదవుల సంగతి సరేసరి ముందు నుంచి పార్టీ ని నమ్ముకున్న వారికి ,ఉద్యమకారులకు పదవులు దక్కటం లేదనే అభిప్రాయాలూ బలంగా ఉన్నాయి . ఏరేపార్టీ నుంచి గెలిచి టీ ఆర్ యస్ లో చేరిన ఎమ్మెల్యేలకు సైతం ప్రాధాన్యత ఇవ్వటం ఆయా నియోజకవర్గాలలో పార్టీ తరుపున పోటీచేసి ఓడిపోయినా వారిని పట్టించుకోక పోవటం ఇబ్బంది కరంగా మారింది. దీంతో పార్టీలో అంతర్గత పోరుతో కార్యకర్తలు సతమతం అవుతున్నారు . జిల్లాలలోపార్టీ లేక ఎవరికీ తమ బాధలు చెప్పుకోవాలో అర్థం కాకా తలలు పట్టుకొంటున్నారు . అధికారం ఉంటె హీరో లేకపోతె జీరో లాగా ఉంది పార్టీలో పరిస్థితి అని వాపోతున్నారు . ఇక రాష్ట్రంలో మంత్రులు ఉన్నా వారిశాఖల మీద వారికే పట్టలేక చెప్పుకొనేందుకు దారిలేక మదన పడుతున్నారు . రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉన్నా అది ఆయా సందర్భాలను బట్టే సమావేశాలు జరుగుతుంటాయని అభిప్రాయాలూ ఉన్నాయి . అయితే టీ ఆర్ యస్ నిబంధనావళి ప్రకారమే తమకు జిల్లా కమిటీలు లేవని చెబుతున్నప్పటికీ ,నిబంధనావళిలో మార్పులు తెచ్చి వాటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు . కానీ ఇంత వరకు కమిటీల ఏర్పాటు జరగలేదు . అవి ఎప్పుడు జరుగుతేయో తెలియదని జిల్లాలలోనాయకులు అంటున్నారు . పార్టీ నిర్మాణం లేకుండా కేడర్ ఎలా తయారవుతుందోఅర్థంకాని పరిస్థితి ఉందని జిల్లాలో ముఖ్య నేతలే అంటున్నారు . జిల్లాలలోఉన్న కార్యకర్తలకు తగిన రాజకీయ చెతన్యం కలిగించి పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకుల అభిప్రాయం . దీనిపై టీ ఆర్ యస్ చేసే ఆలోచలను బట్టే పార్టీ భవిషత్ ఆధారపడి ఉంటుంది . రాష్ట్రము లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి . నిర్మాణం లేకుండా ఎన్ని సాములు చేసిన వృధా ప్రయాస అవుతుంది తస్మాత్ జాగ్రత్త !!!

Leave a Reply

%d bloggers like this: