ఖమ్మం కార్పొరేషన్ పై టీ ఆర్ యస్ గురి

ఖమ్మం కార్పొరేషన్ పై టీ ఆర్ యస్ గురి
– అభివృద్ధి మంత్రం -పకడ్బందీ వ్యూహం
-ప్రాంతాల వారీగా సీనియర్లకు భాద్యతలు
– గెలుపు గుర్రాలకే టికెట్ల
-ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి పువ్వాడ అజయ్
త్వరలో జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నిలపై టీ ఆర్ యస్ గురి పెట్టింది . అధికార టీఆర్ యస్ కు రాష్ట్రంలో ప్రతికూలత ఉందని అందువల్ల ఈసారి ఖమ్మం కార్పొరేషన్ గెలవటం అంత తేలిక కాదని పరిశీలకుల అభిప్రాయం .కానీ టీ ఆర్ యస్ కు పోటీ ఇచ్చే స్థాయిలో ప్రస్తుతం ఏ పార్టీ ఉన్నట్లు కనిపించటంలేదనే అభిప్రాయాలూ ఉన్నాయి . వామపక్షాలు , కాంగ్రెస్ కూడ బలంగా ఉన్న ఖమ్మం లో బీజేపీ పాగా వెయ్యాలని చూస్తుంది. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు . మున్సిపాలిటీ ఏర్పడిననాటినుంచి జరిగిన ఏఎన్నికలోను బీజేపీ ఒక్కవార్డు కూడా గెలలేదు . ఈ సారి ఏకంగా కార్పొరేషనే గెలుస్తామని చెప్పటం కొంత అతిశేయోక్తి గానే ఉంటుందనే అభిప్రాయాలూ ఉన్నాయి . జిల్లా టీ ఆర్ యస్ లో అసమ్మతి నివురు గప్పిన నిప్పుల ఉంది అది ఖమ్మం నగర కార్పోరేషన్ ఎన్నికలపై పడుతుందా? లేదా నాటి వరకు సర్ధుకుంటుందా అనేది చాడాల్సి ఉంది . మంత్రి అజయ్ మాత్రం ఖమ్మం గెలిచి కెసిఆర్ కు బహుమతి ఇవ్వాలనే కసి, పట్టుదలతో పావులు కదుపుతున్నాడు . ఇందుకు అనుగుణంగా కార్యాచరణకు నడుం బిగించారు . అభివృద్ధి మంత్రం పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు . ఎన్నికను మంత్రి పువ్వాడ అజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . జిల్లా కేంద్రమైన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తునందున కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగర వేయించాల్సిన భాద్యత ఆయన పై ఉంది . అందువల్ల గతంలో కంటే ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించాలనే లక్ష్యం తో ఉన్నారు . రాష్ట్రంలో ఇటీవల జరిగిన జరిగిన ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలిన టీ ఆర్ యస్ కు ఖమ్మం గెలుపు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం పంపాలనే యోచనలో ఉన్న కెసిఆర్ మంత్రి అజయ్ సమర్థత, పట్టుదల పై నమ్మకం పెట్టుకున్నారు . అజయ్ ఆధ్వరంలో ఖమ్మం లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి . గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం రూపురేఖలు మారిపోయాయి . కొత్త ఖమ్మం ఆవిష్కరణ జరుగుతుంది . ఖమ్మం లో జరిగిన అభివృద్ధి పై పెద్ద ఆశలు పెట్టుకున్న మంత్రి ప్రజలు తప్పకుండ తమను ఆదరిస్తారనే విశ్వాసంతో ఉన్నారు . ప్రత్యేకించి ఇటీవలనే 100 కోట్ల నిధులతో జరిగిన అభివృద్ధి పనుల పై ప్రచారం చేయాలనీ వాటి ఆధారంగా తీర్పును కోరాలని భావిస్తున్నారు . అయన అభివృద్ధి ఎలా ఉన్న కార్పొరేటర్ల పనితీరు ఆధారంగా టిక్కెట్లు ఇచ్చే ఆవకాశం ఉంది . అందువల్ల ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లలో చాలామందికి టిక్కెట్లు రాకపోవచ్చుననే అభిప్రాయాలూ ఉన్నాయి . గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన ఎన్నికలలో సిట్టింగులకు టికెట్ లు ఇచ్చినందున టీ ఆర్ యస్ కు నష్టం జరిగిందని అందువల్ల ఈసారి టిక్కెట్లు కేటాయింపులో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో ఉన్నారు . అభ్యర్థుల పని తీరు ,ప్రజల్లో వారిపట్ల ఉన్న ఆదరణకు అనుగుణంగా టికేట్లను కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం . ఈసారి అనేక మంది సిట్టింగ్ లకు టిక్కెట్లు అనుమానంగానే ఉంది . ఇప్పటికే కొంతమందికి ఈసారికి మీరు ఆగాల్సి వస్తుందని పర్వోక్ష సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది . అభ్యర్థులను ఎంపిక చేయటం వారికీ తగిన సలహాలు , సూచనలు ఇచ్చేందుకు పార్టీలోని సీనియర్లకు భాద్యతలు అప్పగించారు . ఎన్నికల షడ్యూల్ రాకముందే డివిజన్ల వారీగా సమావేశాలు , హల్ మీటింగ్ లు నిర్వవిస్తున్నారు . షడ్యూల్ ప్రకటించే నాటికీ రెండు మూడు విడతల ప్రచారం కూడా చేయాలనే ప్రణాళికలు రూపొందించుకున్నారు . ఖమ్మం నగర అభివృద్ధి పై ప్రత్యేక ప్రణాళిక విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు . మిగతా పక్షాలు అధికార టీ ఆర్ యస్ అంగ , ఆర్ధిక బలం ముందు ఏవిధంగా నిలబడతాయో చూడాల్సిందే మరి !!!

 

 

Leave a Reply

%d bloggers like this: