నిలకడ లేని పవన్ రాజకీయాలు

నిలకడ లేని పవన్ రాజకీయాలు
-పక్కదారి పడుతున్న విమర్శలు
పేరుకు పవర్ స్టార్ ….. రాజకీయాలలో పవర్ లేని నాయకుడు ….. జనసేన అధినేత ….. ప్రశ్నించటం తమ పార్టీ విధానమని ప్రకటించిన పవర్ స్టార్ …. తెలుగుదేశం అధికారంలో ఉన్నంతకాలం ఏమాత్రం ప్రశ్నించకుండా ,ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్నారు . చంద్రబాబుకు పవన్ కు మంచి సంభందాలు ఉన్నాయని ఆయన ఆదేశాల మేరకే వైకాపా ప్రభుత్వం పై దాడులు చేస్తున్నాడనే విమర్శలను ఎదుర్కొన్నారు . ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీచేసి చేగువేరా నాకు ఆదర్శం అన్నారు . బీ యస్ పీ అధినేత్రి మాయాతిని కలిసి దళితుల ఉద్ధరణే తన ధ్యేయం అని ఆపార్టీ కలిసి పనిచేస్తానన్నాడు . ఎన్నికల తరువాత ఆమె ఊసెత్తటం మానేశారు . తెలుగు దేశం బీజేపీ లు కలిసున్నంత కాలం ఆపార్టీ ని పల్లెత్తు మాట అనని పవన్ తెలుగు దేశం బీజేపీ బంధం తెగిపోయిన తర్వాత , బీజేపీ మోడీపై విమర్శలు గుప్పిచారు . రాజధాని అమరావతి కి ప్రధాని మోడీ ఏమిచ్చారు చెంబేడు నీళ్లు , తట్టెడు మట్టి తప్ప అని కేంద్రం పై విరుచుకు పడ్డారు . ప్రత్యక హోదా విస్తానని చెప్పి ఏమిచ్చారు పుచ్చిపోయిన లడ్డులు తప్ప అని సెటైర్లు వేశారు . దక్షణాది పై ఉత్తరాది పెత్తనం ఏమిటని ప్రశ్నించారు . కొంత కాలం తరువాత తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓటమి చెందిన పవన్ కొంత కాలం వరుకు సైలెంట్ గా ఉన్నారు . ఎన్నికల తరవాత రాష్ట్రంలో తెలుగు దేశం ఓడిపోయి వై కాపా అధికారంలోకి వచ్చింది . దీంతో ఆయన పునరాలోచనలో పడ్డారు గతంలో విమర్శించినా బీజేపీ ని ఆశ్రయించారు . బీజేపీతో కలిసి తన ప్రయాణం కొనసాగుతుందని ప్రకటించారు . తరువాత రాష్ట్ర ప్రభుత్వం పై దాడిని మొదలు పెట్టారు . ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే . కానీ కేవలం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలకు దిగటం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . అంతే కాకుండా ఆయన ఆయా నియోజకవర్గాల పర్యటనలలో మంత్రులపై విమర్శల చేస్తున్నారు . అందులో కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు . వ్యక్తిగత విమర్శలు శృతి మించుతున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి . ప్రజల సమస్యలను వదిలి వ్యక్తిగత విమర్శల చేయటం విడ్డురంగా ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . మంత్రులపై విమర్శలు చేస్తూ చాల లింగాలలో బోడిలింగం, నాని పేర్లు చాల ఉన్నాయి . బోడిలింగం ఏదోచెపుతున్నాడు . జగన్ రెడ్డి తో చెప్పండి వకీల్ సాబ్ చెబుతున్నాడని అంటూ విమర్శలకు దిగటం పై వైకాపా మండి పడుతుంది . కొడాలి నాని పేర్ని నాని అదేస్థాయిలో పవన్ పై మాటల తూటాలు పేల్చారు . ఆయన ఎవరికీ భయపడనని అంటున్నారు . ఆయనకు భయపడే వారు ఎవరు ? అంటు తనదైన శైలిలో విరుచుక పడ్డారు . జగన్ రెడ్డి అంటు సంబోదించటం తాను వకీల్ సాబ్ గా అభివర్ణించుకోవటం పై పేర్ని నాని సెటైర్లు వేశారు . తన ఇంటికి వస్తానని అన్నాడట ఆ యాక్టర్ రమ్మనండి చూద్దాం . అని ఘాటైన సమాధానం ఇచ్చారు . సమస్యలమీద సమరం చేయటంలో ఎలాంటి తప్పులేదు . కానీ కేవలం గుడ్డి వ్యతిరేకతతో రాజకీయాలు చేయటం ఎవరికైనా తగని పని . అది జగన్ అయినా , చంద్రబాబు నాయిడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఒక్కటే . స్వచ్ఛ రాజకీయాల మాని , కుళ్ళు రాజకీయాలు చేయటం రాజకీయ నాయకులూ మానుకోకపోతే ఏపార్టీ కైనా ఇబ్బందులు తప్పవు .

Leave a Reply

%d bloggers like this: