కెసిఆర్ యూటర్న్ పై ఇంట బయట విమర్శలు

కెసిఆర్ యూటర్న్ పై ఇంట బయట విమర్శలు
కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ….. అంత కంటే ముందు ఉద్యమకారుడు …. తెలంగాణ సాధనకోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుడు …. నీళ్లు , నిధులు , నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు . తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చలేకవెనక్కు తగ్గటం లేదా వాటినుంచి తప్పుకుంటూ నేడు యూటర్న్ నాయకుడుగా కీర్తించ బడుతున్నాడు . ఇప్పటి వరకు ఆయనకు పరిపక్వత కలిగిన రాజకీయనాయకుడిగా ఉన్న కేసీఆర్ వైఖరి పై బయట వారికేగాక సొంత పార్టీ నేతలకు సైతం సందేహాలు కలుగుతున్నాయి . కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని ఢిల్లీలో రైతులు చేపట్టిని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు . రైతు ఐక్య కార్యాచరణ ఇచ్చిన భారత్ బందులో తెలంగాణ ప్రభుత్వమే పాల్గొన్నది . మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీ లు , ఇతర ప్రజా ప్రతినిధులు ప్రత్యేక్షంగానే బందులో పాల్గొన్నారు . దేశం లోనే బంద్ కు మద్దతు ప్రకటించిన ముఖ్యమంత్రిగా శబాష్ అనిపించుకున్నారు. కానీ ఇది ఏంతోసేపునిలవలేదు . ఢిల్లీ లోఉద్యమం చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారికీ మద్దతు ప్రకటిస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి . కానీ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన సీఎం మద్దతు కాదుకాదా? రైతుల ఉద్యమం జరుగుతున్నా ప్రాంతం వైపు కనీసం తొంగి కూడ చూడలేదు . సొంత పార్టీ ఎంపీలను సైతం తనవెంట వద్దన్న కేసీఆర్ ప్రధానితో సహ కేంద్రమంత్రులను కలసి రైతు చట్టాలపై పల్లెత్త మాట మాట్లాడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుకు నియంత్రణ పెట్టారు . ధాన్యం కొనుగోలు తామే చేస్తామన్నారు . పంటల నియంత్రణ వేత్తశారు . ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చునని దానినుంచి తప్పుకున్నారు . ఎల్ ఆర్ యస్ ప్రశపెట్టి అదిలేకుండా రిజిస్టేషన్లు చేసేది లేదన్నారు . తీరా కోర్ట్ జోక్యం , రాష్ట్రము లో రాజకీయ పరిస్థిలు సరిగా లేకపోవటం తో దానినుంచి వెనక్కు తప్పుకున్నారు . పాతపద్ధతులతోనే రిజిస్ట్రషన్ లు చేస్తామన్నారు . రెండు సంవత్సరాలుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న పీ ఆర్ సి ,వయో పరిమితి పెంపు లాంటి వాటిపై ప్రకటన చేశారు . అయితే దాని అమలు కాల పరిమితి మరో రెండు లేదా మూడు నెలలుగా నిర్ణయించారు . దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి . దీంతో అయన మీద తెలంగాణ ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆడియాశలైయ్యాయనే అభిప్రాయాలూ ఉన్నాయి . అందుకే దుబ్బాక, అసెంబ్లీ , గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీ ఆర్ యస్ కు ఎదురు దెబ్బలు తగిలాయి . ఫలితంగా గత ఆరు సంవత్సరాల క్రితం ఆయన్ను కోరుకొన్నవారే నీపాలన బాగాలేదు వద్దు పొమ్మంటున్నారు . ఏమిటి కారణం ? , ఎందుకు ఈతేడా ? అంటే ఆయన ఏ నినాదం తో అధికారంలోకి వచ్చారో దాన్ని మరిచి పోయారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు . మన రాష్ట్రము మన పాలనా అనేది కెసిఆర్ దృష్టిలో అంతా ట్రాష్ అనే భావన ప్రజలలో కలుగు తున్నది . నీళ్లు అంటే ఒక్క కాళేశ్వరం తప్ప ఎక్కడ ప్రాజెక్టులు లేవు . నియామకాలు లేక నిరుద్యోగులు కెసిఆర్ పై ఆగ్రహం తో ఉన్నారు . ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కెసిఆర్ పై రగిలి పోతున్నారు . అందుకే ఆయన ఉస్మానియా వైపు కన్నెత్తి చూడటం లేదు . తెలంగాణ సాధనలో ఉస్మానియా విశ్వవిద్యాలం ఉద్యమ కేంద్రంగా ఉంది .అనేక మంది విద్యార్థులు ఉద్యమం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు . శ్రీకాంత చారి లాంటి ఉద్యమకారులు ఆత్మా బలిదానాలు చేసుకొన్నారు . ఉస్మానియా లేక పొతే తెలంగాణ వచ్చేది కాదనే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి . ఉద్యోగులు , కార్మికులు , కర్షకులు, కూలీలు , యువత ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ లోని సమస్త ప్రజానీకం రాష్ట్ర సాధనలో తమవంతు పాత్ర పోషించింది . తెలంగాణ వచ్చిన తరవాత నియామకాలు లేవు . నిధులు విషయానికి వస్తే తెలంగాణ ఏర్పడే నాటికీ మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రము అప్పుల తెలంగాణ మారింది. అధికారం కొంతమందికే సొంతమైంది. తెలంగాణ కోసం కొట్లాడిన వారు . దెబ్బలు తిని , కేసుల్లో ఇరుక్కున్నవారు, దానికోసం ఆర్థికంగా చితికి వాళ్ళును అసలు పట్టించుకోవటం లేదనే ఆగ్రహం ఉద్యమకారుల్లో ఉంది . వారు కెసిఆర్ కు కనిపించటంలేదనే బలమైన అభిప్రాయాలూ ఉన్నాయి . తెలంగాణ వద్దన్న వాళ్ళు ఆయనకు ముద్దుయ్యారు . ఉద్యమాన్ని అడ్డుకున్న వారిని అందలమెక్కించారనే ఆరోపణలు ఉన్నాయి . తమ ఇంట్లో ఉన్నవారందరికి కొలువులు ఇప్పించు కొని నిరుద్యోగుల కొలువులు మరిచారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు . దీనితో టీ ఆర్ యస్ పాలనా పై ఉన్న భ్రమలు తొలిగాయనే భావన ప్రజలలో ఉంది. మాటపై నిలబడక పోవటం , ఎన్నికల వాగ్దానాలను విస్మరించటం , ఏ ఎన్నిక వచ్చిన ఆ సందర్భగా ఆయా వర్గాల ప్రజలను మాయచేయటం రీవాజ్ గా మారిందనే అభిప్రాయాలూ బలంగా ఉన్నాయి . కెసిఆర్ తాను పోగుట్టుకొన్న నమ్మకాన్ని తిరిగి పొందుతారో లేదో చూడాల్సిందే !!!

Leave a Reply

%d bloggers like this: