సర్పంచు పదవి 2 కోట్లు

సర్పంచు పదవి 2 కోట్లు
సర్పంచు పదవి 2 కోట్లు …. ఇది వినటానికి విడ్డురంగా ఉన్నా నిజం …. మహారాష్ట్రలోని ఒక గ్రామం లో జరిగింది. అక్కడ జరుగుతున్నా స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక గ్రామ సర్పంచు పదవి కోసం జరిగిన వేలంలో ఏకంగా 2 కోట్ల 5 లక్షల రూపాయలు పెట్టి పదవిని పొందాడు ఒక వ్యక్తి . నాసిక్ జిల్లాలోని దేవ్లాలి అనే తాలూకాలో ఉమ్రానే అనే గ్రామంలో జరిగిన సర్పంచు పదవి వేలంపాటలో విశ్వాసరావు దేవారే అనే వ్యక్తి ఏకంగా 2 కోట్ల 5 లక్షలకు పెట్టి సర్పంచ్ పదవి కొనుగోలు చేశారు . అసలు ఆగ్రామంలో వేలం పెట్టాలని తొలుత భావించలేదు . కానీ దేవాలయ నిర్మాణం దాని నిర్వహణ కోసం సర్పంచ్ పదవిని వేలం పెట్టాలని అనుకున్నారు . అయితే దానికి కూడా వారు కోటి 11 లక్షలు సరిపోతాయని అంచనా వేశారు . పాటను కూడా వారికీ కావాల్సిన నిధుల నుంచే మొదలు పెట్టారు . కానీ పదవి పై ఆశక్తి ఉన్న పలువురు పాటలో పాల్గొన్నారు . స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ పదవిని వేలం పాటలో పడుకోవటం ఆనవావితిగా వస్తున్నప్పటికీ కేవలం వేలం పాటలో వచ్చిన నిధులు గ్రామంలో అభివృద్ధి పనులకోసం వినియోగిస్తారు . ఆలా చాల గ్రామాలలో 25 వేల నుంచి 50 వేలవరకు సర్పంచు పదవికోసం వేలం పాటలో పడుకొని పదవి పొందుతారు .ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు పెట్టి పదవి కొనుగోలు చేయటం రికార్డ్ గా భావిస్తున్నారు . ఇది ఒక్క మహారాష్ట్రం లోనే కాకుండా దేశ వ్యాపితంగా చర్చనీయాంశం అయింది . సర్పంచ్ పదవులను వేలం పాతాళ ద్వారా ఎంపిక చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నిక కావాల్సిన పదవులను అప్రజా స్వామికంగా పొందటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని పలువురు పేర్కొంటున్నారు .

One thought on “సర్పంచు పదవి 2 కోట్లు

  1. ప్రజాస్వామ్య వ్యవస్థను అందిన మేరకు అంగట్లో సరుకుగా మార్చేస్తున్నారు

Leave a Reply

%d bloggers like this: