Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్వేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది . ఎన్నిక ఎలా ఉన్న అభ్యర్థుల ఎంపికే కాంగ్రెస్ కీ పరీక్షగా మారింది. చాల మంది ఆశావవులు ఉండటంతో ఎవరికిస్తే ఏమి కోపమో అనే మీమాంశ నాయకులలో నెలకొన్నది . కష్ట కాలంలో ఉన్న కాంగ్రెస్ కు ఎన్నికలు ఒక సవాలుగా మారాయి . దుబ్బాక ఉప ఎన్నిక , గ్రేటర్ హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకున్న విధంగా ఫలితాలు రాకపోటంతో పార్టీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు . ప్రతి చిన్న ఎన్నిక వారికీ ఒక పరీక్షగా మారటంతో రాష్ట్రంలో మారుతున్నా రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మరల్చుకునేందుకు , ప్రయత్నాలు ప్రారంభించింది . నాగార్జునసాగర్ ఉపఎన్నిక , ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎన్నిక వాయిదా పడినసంగతి తెలిసిందే . కొత్త టీపీసీసీ చీఫ్ ను నియమించే వరకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షడు ఉత్తమకుమార్ రెడ్డి నే కొనసాగాలని ఏఐసీసీ ఆదేశించింది . దీంతో ఆయన అద్వర్యం లో ఎన్నికలకోసం ఇటీవల గాంధీ భవన్ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు . ఈ సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు . కీలకనేత రేవంత్ రెడ్డి ఈసమావేశానికి హాజరు కాకపోవటం అనుమానాలకు తావిచ్చింది . ఆయన కావాలని రాలేదా, లేక ఇతర పనులలో బిజీగా ఉండి రాలేకపోయారా అనే సందేహాలు కలుగుతున్నాయి . పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఫోటీకి సిద్దమైన ఆశావహుల జాబితాను తయారుచేసి ఏఐసీసీ కి పంపించారు . హైద్రాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూన శ్రీశైలం గౌడ్ పేరును తాను ప్రతిపాదిస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి పీసీసీ కి లేఖ రాశారు . ఖమ్మం వరంగల్ , నల్గొండ , పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బెల్లయ్య నాయక్ , రాములు నాయక్ , మానవతా రాయ్ , పేర్లను కాంగ్రెస్ పరిశీలిస్తుండగా , టీ జె ఎఫ్ అధ్యక్షడు కోదండరాం , తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ లు తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి లేఖలు రాశారు . స్వయంగా పీసీసీ అధ్యక్షుడిని కలిసి కోరారు . దీనితో కాంగ్రెస్ తమ పార్టీ నేతలకు ఇవ్వాలా లేక వ్యూహత్మకంగా కోదండరాం లేదా సుధాకర్ కు మద్దతు ఇవ్వటం ద్వారా అధికార టీ ఆర్ యస్ ను ఇబ్బంది పెట్టాలా అనే మీమాంసలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. మహబూబ్ నగర్ , హైదరాబాద్ , రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డి , లేదా వంశీ చందర్ రెడ్డి మరో నేత పేరు ను పరిశీలిస్తున్నారు . సాగర్ ఉపఎన్నికకు ఇప్పటికే సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పేరు ఖరారు అయినా నేపథ్యంలో దానిపైన కూడా ద్రుష్టి సారించే విషయమై చర్చించారు . అన్ని విషయాలపై అధిష్టానంతో చర్చించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు . రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆవకాశాలు తీసుకోవాల్సిన చర్యలు గురించి అధిష్టానం పెద్దలకు ఆయన వివరించే ఆవకాశం ఉంది . ఆయన పర్యటనపై కాంగ్రెస్ నాయకులలో ఆశక్తి నెకొన్నది .

Related posts

రెండు పార్టీలు నాకు రాజ్యసభ ఆఫర్లు ఇచ్చాయి… అయినా తిరస్కరించా: సోను సూద్!

Drukpadam

నిధులు మళ్లించటంలో టీడీపీ ,వైసీపీ దొందు దొందే …బీజేపీ ఎంపీ జీవీఎల్!

Drukpadam

ఏపీలో హీట్ పెంచుతున్న రాజధాని వ్యవహారం ఎత్తులు పై ఎత్తులు…

Drukpadam

Leave a Comment