Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చిరంజీవి మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారా ?

చిరంజీవి మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారా ?
సినీ నటుడు చిరంజీవి మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా ? అంటే అవుననే అంటున్నారు కొందరు. ఆయన రాజకీయాలలోకి వస్తారని , విశాఖపట్నం నుంచి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరుపున లోకసభకు పోటీచేస్తారని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది . కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ బలమైన సామజిక వర్గంతో పాటు , పాపులర్ యాక్టర్ గా ఉన్న చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది . ఆయన్ను రాజ్యసభ కు పంపటంతో పాటు కేంద్ర మంత్రి పదవికూడా ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా ఉంది . మరో వాదన కూడా తెరపైకి వస్తుంది . ఆయన జనసేన , బీజేపీలు రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నందున జనసేనలో చేరి విశాఖ నుంచి జనసేన టికెట్ పై పోటీ చేస్తే గెలుపు ఖాయం అనే అభిప్రాయాలూ ఉన్నాయి . కొందరు ఆయన స్వభావానికి రాజకీయాలు సరిపోవు అని అంటున్నారు . ఆయన మాత్రం దీనిపై అవునని కానీ కాదని కానీ చెప్పటం లేదు . ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్ లతో బిజీ గా ఉన్నారు . అందువల్ల ఎవరికీ నచ్చిన విధంగా వారు మాట్లాడుకోవటం జరుగుతుంది . చిరంజీవి అసలు పేరు కొణిదల శివశంకర ప్రసాద్ …… ప్రముఖ సినీనటుడు……. సినీ రంగంలోకి వచ్చిన తరువాత ఆయన పేరు చిరంజీవిగా మారింది . తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు లేరు … . రాజకీయాలపై ఆశక్తితో ఆయన రాజకీయాలలోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాష్ట్ర మంతా పర్యటించారు . 2009 ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాలలో పోటీచేశారు . ప్రజారాజ్యం అధికారంలోకి వస్తుందనే ప్రచారం కూడా జరిగింది . కానీ ఆపార్టీకి కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి . తిరుపతి , పాలకొల్లు రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసిన చిరంజీవి ఒక్క తిరుపతి నుంచి మాత్రమే గెలుపొందారు . పాలకొల్లు తన స్వంత నియోజకవర్గం పైగా తన సామజిక వర్గం కూడా అధికంగానే ఉంది . అయినప్పటికీ అక్కడనుంచి ఓడిపోవటం ఆయనకు కొంత నిరాశను కలిగించింది . ఆఎన్నికలలో వై .యస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది . కొంతకాలం ప్రతిపక్షంలో ఉన్న చిరంజీవి తరవాత తన పార్టీని కాంగ్రస్ లో విలీనం చేసి తాను రాజ్య సభ సీటు పొంది కేంద్ర మంత్రి అయ్యారు . ప్రజారాజ్యం లో యువజన విభాగానికి అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ కు అన్నయ్య నిర్ణయం రుచించలేదని అప్పటినుంచే ఆయనతో విభేదించారని వార్తలు వచ్చాయి . కొంతకాలం సైలంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ తరవాత రాష్ట్రము విడిపోవటం , తెలంగాణ ఆంధ్ర ప్రదేశాలుగా ఏర్పాటు జరిగాయి . 2014 ఎన్నికలనాటి కే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలలో పర్యటించారు . ఆంధ్ర లో తెలుగుదేశము , బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు . జనసేనికులు, బీజేపీ మద్దతుతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది . నాటినుంచి జనసేన తెలుగు దేశం కు స్నేహ పార్టీగానే కొనసాగింది. 2019 ఎన్నికలకు ముందు జనసేన తెలుగుదేశం తో కలిసి లేకపోయిన వారి మధ్య అవగాహనా ఉందనే అభిప్రాయాలూ ఉన్నాయి. తరువాత కాలంలో జనసేన కొంత కలం వామపక్షాలతో కలిసి ఉంది. కలిసి ఎన్నికలలో పోటీకూడా చేశారు . ఎన్నికల అనంతరం తిరిగి బీజేపీతో కలిసి నడిచేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు . ఢిల్లీకి వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలను కలిసి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ప్రయాణం చేయాలనీ నిర్ణయించుకున్నారు . దీంతో రానున్న కాలంలో బీజేపీ జెనసేన కలిసి పోటీచేయనున్నాయి అప్పుడు చిరంజీవి లాంటి స్టార్ వారికీ అదనపు బలంగానే ఉంటారు . అందువల్ల చిరంజీవిని ఎలాగైనా ఒప్పించి పోటీచేయించాలనే బీజేపీకుదా యోచిస్తున్నది . చిరంజీవి తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా ? లేదా అనేది చూడాలి !!!

Related posts

నాగార్జునసాగర్‌లో బీజేపీకి వరుస షాకులు!

Drukpadam

అసదుద్దీన్ వాహనంపై కాల్పులు జరపడంపై యోగి ఆదిత్యనాథ్ స్పందన!

Drukpadam

ఆ కంపెనీ మాదే అయితే చంద్రబాబుకే రాసిస్తా…!

Drukpadam

Leave a Comment