Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణాలో కొలిక్కి రాని పీ ఆర్ సి -ఉద్యోగుల ఎదురుచూపులు

తెలంగాణాలో కొలిక్కి రాని పీ ఆర్ సి -ఉద్యోగుల ఎదురుచూపులు
అధికార టీ ఆర్ యస్ 2018 ఎన్నికల ప్రణాళికలో ఉద్యోగుల వయోపరిమితి పెంచుతామని , పీ ఆర్ సి ఇస్తామని హామీనిచ్చారు . కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలకు పెంచుతామని హామీని ఇవ్వడంతో తాము అంతకన్నా ఒక సంవత్సరం ఎక్కువగానే 61 సంవత్సరాలకు అధికారంలోకి రాగానే పెంచుతామని టీ ఆర్ యస్ హామీనిచ్చింది . . ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్నికలు అవిపోయాయి . తిరిగి టీ ఆర్ యస్ అధికారంలోకి వచ్చింది. రెండేళ్ల కాలం గడిచిపోయింది , కానీ పీ ఆర్ సి లేదు , వయోపరిమితి పెంచలేదు .వాటికోసం ఉద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. టీ ఆర్ యస్ ఎన్నికల ప్రణాళిక నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులంతా పశ్చత్తాప పడుతున్నారు . టీ ఆర్ యస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది . రెండుసంవత్సరాల నుండి , వేలాదిమంది ఉద్యోగులు పదవి విరమణ పొందారు . ఇప్పుడు ఉద్యోగుల వయోపరిమితి పెంచుతామని ప్రభుత్వం చెబుతుంది .అంటే ఈ రెండు సంవత్సరాలుగా పదవి విరమణ పొందినవారు లాస్ అవుతున్నారు . ప్రభుత్వ చర్యలను నిరసిస్తున్నారు . దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నని ఎదురు చూస్తున్నారు . ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను ఊరిస్తున్నది . ఇదిగో పీ ఆర్ సి అదిగో పీ ఆర్ సి అంటూ ఊదర గొట్టుడు మాటలు తప్ప ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యోగులకు పీ ఆర్ సి అందని ద్రాక్ష లాగానే మిగిలింది . రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ పీ ఆర్ సి ని ప్రకటించ బోతున్నామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు . తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను సైతం కోల్పోయందుకు సైతం సిద్ధపడ్డారు . తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని సంబరపడ్డ ఉద్యోగులకు అది ఎంతో కాలం నిలవలేదు . కడుపునిండా పెట్టుకుందాం అన్న కెసిఆర్ కడుపు ఎండబెడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి . పైగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదు . ఇదేమంటే కరోనా వచ్చింది ఆర్ధిక వ్యవస్త బాగాలేదని సాకులు చెబుతున్నారు . ధనిక రాష్ట్రము అని గొప్పలు చెప్పిన సీఎం డబ్బులు లేవని పేద పలుకులు పలుకుతున్నారు . చివరకు పీ ఆర్ సి నివేదికను డిసెంబర్ చివరన కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి అందచేసింది . ఆయన పరిశీలించి వెంటనే పీ ఆర్ సి ప్రకటిస్తారని ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు . ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వాల్సిన డి . ఏ కూడా కాలయాపన చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. వయోపరిమితి విషయంలో ప్రభుత్వం ద్వంద నీతిని ప్రదర్శించటంపై ఉద్యోగులే అసహనం వ్యక్తం చేస్తున్నారు . ఉద్యోగ సంఘ నాయకులకు వారి బంధువులకు దొడ్డిదారిన జిఓలు ఇస్తు మిగతా ఉద్యోగుల విషయంలో అన్యాయం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వయోపరిమితిని పెంచుతామని చెప్పి కేసీఆర్ కాలయాపన చేయడం పై ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి . ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు న్యాయం చేయటంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్స్ బలంగా ముందుకు వస్తున్నాయి . ప్రభుత్వం ఉద్యోగుల , నిరుద్యోగుల సమస్యలను ఎప్పుడు పరిస్కరిస్తుందో చూడాలి మరి।।।

Related posts

ఉచిత పథకాలపై ప్రధానివద్ద కేంద్రప్రభుత్వ అధికారుల గగ్గోలు!

Drukpadam

కెనడాలో దారుణం… గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో భారతీయ విద్యార్థి మృతి

Ram Narayana

జర్నలిస్ట్ రఘును బేషరతుగా విడుదల చేయాలి…

Drukpadam

Leave a Comment