Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాలు రద్దు కాకపోతే -రణమే

వ్యవసాయ చట్టాలు రద్దు కాకపోతే -రణమే
-రైతు చట్టాల విషయంలో మరో మాటకు తావులేదు
-సుప్రీం కమిటీ కి అంగీకరించని రైతు సంఘాలు
-అది కేంద్ర ప్రభుత్వ అనుకూల కమిటీ అంటూ విమర్శ
-దేశ వ్యాపితంగా మద్దతు లేదు అనడం పై మండిపాటు
-ఇప్పటికే అనేక మంది ప్రముఖల అవార్డుల వాపస్
– 60 మందికి పైగా రైతుల మృతి
వ్యవసాయ దారులకు గుదిబండగా , కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్న నూతన వ్యవసా చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఢిల్లీలో ఉద్యమం నడుపుతున్న రైతు సంఘాలు స్పష్టం చేశాయి . సుప్రీం కోర్ట్ జోక్యన్ని స్వాగతిస్తూనే చట్టాల పై తాత్కాలికంగా స్టే విధించడాన్ని తప్పు పట్టాయి . సుప్రీంకోర్ట్ చట్టాలపై స్టే విదిస్తూనే , మధ్యవర్తుల పేరుతొ ఒక కమిటీ నియమించటం ఏకపక్షంగా జరిగిందని ఆకమిటీనీ తాము గుర్తించబోమని తేల్చిచెప్పారు . కమిటీ లో నియమించిన నలుగురు కేంద్రం తెచ్చిన చట్టాలకు అనుకూలంగా మాట్లాడినవారేననే అలంటి వారివల్ల ఎలాంటి న్యాయం జరుగుతుందో తెలుసునని రైతు సంఘ నేతలు పేర్కొన్నారు . రైతు సంఘాల అభ్యంతరాల తో నలుగురిలో ఒకరు కమిటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు . సుప్రీం కోర్ట్ లో కూడా అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ కమిటీ ఏర్పాటు జరిగిందనే విమర్శలు ఉన్నాయి . రైతు సంఘాల తరుపున వాదించే న్యాయవాదులు లేని సమయంలో కమిటీ నిర్ణయం జరిగినట్లు తెలుస్తున్నది . ఇది కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిన కమిటీ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . ఏది ఏమైనా వ్యవసా చట్టాలు పూర్తిగా రద్దుచేసేవరకు ఉద్యమం కొనసాగుతుందని రైతుల ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది . కేంద్రం ఇప్పటికైనా తన మొండి వైఖరి విడనాడాలి . వాస్తవాలను గుర్తించాలి . కుంటి సాకులు చెప్పవద్దు అని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు . వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, రద్దు చేయకపోతే రణం తప్ప మాకు మరో మార్గం లేదుని రైతు సంఘాల నాయకులూ స్పష్టం చేశారు. కేంద్రం మాత్రం ఈచట్టాలు రైతుల మేలుకోసమేనని చెబుతుంది . రైతులు తమకు మేలుకన్నా ఈ చట్టాలవలన కీడే ఎక్కువగా ఉందని బలంగా నమ్ముతున్నారు . ఎవరిని సంప్రదించకుండానే నూతన వ్యవసా చట్టాలను కేంద్ర ప్రభుత్వం తేవడాన్ని తప్పు పడుతున్నారు . ఈ చట్టాలు కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమేనని విమర్శలు ఉన్నాయి. చట్టాలు వద్దనే వారు రైతులు, మరి కావాలనే వారు ఎవరు ? కేంద్ర ప్రభుత్వం . ఎవరికోసం ఈ చట్టాలు చేసిందంటే అంబానీ , ఆదానీ లాంటి కార్పొరేట్ శక్తులకోసమేనని స్పష్టం అవుతుంది . పెద్ద ఎత్తున రైతులు పార్టీలకు , సంఘాలకు అతీతంగా సంఘటితమై గత 53 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో ఉద్యమం చేస్తుంటే , దాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర సర్కార్ చేయని ప్రయత్నం లేదు. చర్చల పేరుతొ కాలయాపన , చట్టాలు రద్దు చేయాలంటే వాటిలో సవరణలు అంటూ మెలిక పెడుతుందని రైతు ప్రతినిధులు పేర్కొంటున్నారు .

 

ఈ ఉద్యమం లో మావోయిస్టులు ఉన్నారని , ఖలిస్థాన్ వాదులు చేరారని , పాకిస్తాన్ అనుకూల మిలిటెంట్లు ఉన్నారని రకరకాల తప్పుడు ప్రచారాలు మందుకు తెచ్చారు . అయినప్పటికీ ఉద్యమకారులు మాత్రం తమపట్టును ఏమాత్రం సడలించటం లేదు . ఉద్యమ కాలంలో 60 మందికి పైగా రైతులు మరణించారు . అనేక మంది తమకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తిరిగి వెనక్కు ఇచ్చివేశారు . అనేక రాష్ట్రాలు ఈ చట్టాలు రద్దు చేయాలనీ కోరుతున్నాయి . రైతులకు మద్దతుగా డిసెంబర్ 8 న జరిగిన భారత్ బందు దేశవ్యాపితంగా జయప్రదం అయింది . అనేక రాష్ట్రాలు ఈ బందు కు మద్దతు నిచ్చాయి . తెలంగాణ , కేరళ , బెంగాల్ లాంటి రాష్ట్రాలు బందు లో పాల్గొన్నాయి . ఆంధ్రప్రదేశ్ , ఒడిశా లాంటి రాష్ట్రాలు రైతుల ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించాయి . కేరళ రాష్ట్ర అసెంబ్లీ లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు . పంజాబ్ ,రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ,మహారాష్ట్ర , హర్యానా , ఉత్తరాఖండ్ , లాంటి ప్రధాన రాష్ట్రాల రైతులు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటుండగా , దేశంలోని ఇతర ప్రాంతాలలో రైతులు సంఘీభావ ఉద్యమాలు ఆందోళనలు నడుపుతున్నారు .కేంద్రం మాత్రం ఈ ఉద్యమం కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే సంబంధించిందని ,మిగతా రాష్ట్రాలు ఉద్యమంలో పాల్గొనటం లేదని సుప్రీం కోర్ట్ కు తెలపటం పై రైతు సంఘాలు మండి పడుతున్నాయి .
అనేక మంది మేధావులు , వివిధ రంగాలలో ఉన్న ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు . అన్నాహజారే లాంటి సామజిక ఉద్యమకారుడు రైతు చట్టాల రద్దుపై ప్రధానికి లేఖలు రాశారు. ఈ నెల చిరవరకు రద్దు చేయకపోతే దీక్షకు దిగుతానని అల్టిమేటం ఇచ్చారు . జనవరి 26 భారీ ట్రాక్టర్ల ప్రదర్శన కు రంగం సిద్ధం చేస్తున్నాయి . ఇప్పటికే దీనిపై ట్రయిల్ రన్ నిర్వయించాయి . ఇంతటి విశాల ప్రజల మద్దతుతో జరుగుతున్నా ఉద్యమాన్ని తక్కువచేసి చూడటం కేంద్రం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి .

Related posts

టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదు…

Drukpadam

కవితపై చర్యలకు హైకోర్టు లో ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్ !

Drukpadam

ఇన్ఫీ, విప్రో బాట‌లో ఐబీఎం!… మూన్ లైటింగ్‌ను స‌హించేది లేద‌ని ఉద్యోగుల‌కు వార్నింగ్‌!

Drukpadam

Leave a Comment