Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీ -ఎమ్మెల్యే మద్య మాటల యుద్ధం

మాజీ ఎంపీ -ఎమ్మెల్యే మద్య మాటల యుద్ధం
-అనుమతి లేకుండా పర్యటనలపై ఎమ్మెల్యే అసహనం
-మాజీ ఎంపీని పర్యటనలకు వెళ్లవద్దని అన్నట్లు ప్రచారం
-నేను ప్రజాప్రతినిధిని కాను ఎవరి అనుమతి అవసరం లేదన్న పొంగులేటి
-తనవర్గం ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం
-తన వాళ్ళ జోలికొస్తే చక్రవడ్డీ బారువడ్డీలతో బదులు తీర్చుకుంటా అని ఘాటు హెచ్చరిక
పొంగులేటి కోపం వచ్చింది ….. ఎవరిపైన అంటే …. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పైన … ఎందుకు … తన పర్యటనలపై ఆయన అసహనం ప్రదర్శించటం పై మాజీ ఎంపీ ఫైర్ అయ్యారు .దీంతో ఖమ్మం జిల్లా టీ ఆర్ యస్ లో కొనసాగుతున్న వర్గపోరు మరో సారి రచ్చ కెక్కింది . ఇప్పటికే జిల్లా టీ ఆర్ యస్ లో మంత్రి , మాజీ మంత్రి మధ్య పోరు కొనసాగుతుండగా , ప్రస్తుతం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని కెసిఆర్ కట్టడి చేయకపోతే పార్టీకి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి .అసలే గుంభనంగా ఉన్న ఖమ్మం టీ ఆర్ యస్ నాయకుల పోరు ఇటీవల కాలంలో బహిరంగ యుద్ధంగా మారుతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం ఎరుగట్ల అనే గ్రామం పర్యటించారు . ఆసందర్బగా కార్యకర్తలతో మాట్లాడుతూ ఇంతకుముందు అందరం తలో పార్టీలో ఉండే వాళ్ళం కానీ నేడు ఆపరిస్థితి లేదు . అందరం ఒకే పార్టీ , ఒకరు పని కావాలంటే మరొకరు వద్దని అంటున్నారు . దీనివల్ల ఇబ్బదులు ఎదురు అవుతున్నాయి. అధికారులు అయోమయంకు గురి అవుతున్నారు. పార్టీ నాయకుల పర్యటనలు ఇష్టానుసారం ఉంటున్నాయి.నియోజకవర్గంలో పర్యటించాలంటే ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలి , ఎమ్మెల్యే మండలంలో పర్యటించాలంటే మండల పార్టీ అధ్యక్షడి అనుమతి తీసుకోవాలి . గ్రామంలో పర్యటించాలంటే గ్రామా అధ్యక్షడు కి చెప్పాలి . కానీ అలాంటిది జరగడంలేదని మాజీ ఎంపీ పొంగులేటి గ్రామాలలో చెప్పా పెట్టకుండా తీరగటం పై అన్నట్లుగా వార్తలు వచ్చాయి . దీనిపై కార్యకర్తలలో గందరగోళం నెలకొన్నది. ఇద్దరు కీలక నేతల మద్య ప్రచ్ఛన్న యుద్దానికి దారితీసింది . మాజీ ఎంపీ పొంగులేటిని ఉద్దేశించే ఎమ్మెల్యే మాట్లాడారని చర్చ ప్రారంభమై రచ్చగా మారింది .

 

మాజీ ఎంపీ వేంసూరు మండలం కుంచపర్తిలో పర్యటించారు . ఈ సందర్భగా పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే అన్న మాటలను ప్రాస్తహించటంతో ఆయన ఘాటుగా స్పందించారు . తాను ప్రజాప్రతినిధిని కానని అందువల్ల తన పర్యటనలకు ఎవరి పర్మిషన్లు అవసరంలేదన్నారు . కావాలని తనవర్గం వారిని టార్గెట్ చేసి కొందరు మాట్లాడటం పై ఫైర్ అయ్యారు . అధికారం పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ఘాటుగా స్పందించారు . పదవులుకాదు ప్రజాభిమానమే పెద్ద పదవి ,బలం. పదవి అనేది రావాలనుకున్నప్పుడు ఎవరు అడ్డుపడ్డా ఆగదు. పదవి పోయేప్పుడు కాంక్రీట్ గోడలు కట్టిన లాభం ఉండదని అన్నారు . టీ ఆర్ యస్ లోనే ఉన్నాం రేపు కూడా ఉంటాం పార్టీలో ఎవరు ఏమిటో చెప్పాల్సిన పనిలేదని , ఏగూటి పక్షులు ఆగూటికి చేరక తప్పదన్నారు . తనవర్గం వారిని ఇబ్బదులు పెట్టునవారు చక్రవడ్డీతో సహా ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు . మాజీ ఎంపీ మాటలు ఖమ్మం జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి . గత ఎన్నికల్లో ఆయనకు టీ ఆర్ యస్ టికెట్ ఇవ్వలేదు . 2014 ఎన్నికలలో ఆయన వై యస్ ఆర్ కాంగ్రెస్ తరుపున పోటీచేసి విజయం సాధించారు . తరవాత ఆయన వైకాపా ను వీడి అధికార టీ ఆర్ యస్ లో చేరారు . 2019 ఎన్నికలలో ఖమ్మం ఎంపీ టికెట్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తనకే వస్తుందని విశ్వసించారు. కానీ అది జరగలేదు . అప్పట్లోనే ఆయనను రెండు జాతీయ పార్టీలు ఆహ్వానించాయి .తమ పార్టీ టికెట్ పై పోటీ చేయాలనీ కోరాయి . కానీ అందుకు ఆయన అంగీకరించలేదు . టికెట్ ఇవ్వకపోయినా కెసిఆర్ నిర్ణయం మేరకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థి నామ నాగేశ్వరావు కు మద్దతు ఇచ్చారు . రాజ్య సభ టికెట్ ఇస్తామని చెప్పారు అది ఇవ్వలేదు . టీ ఆర్ యస్ లో అనేక అవమానాలు జరుగుతున్నా పార్టీ లోనే ఉంటున్నారు . పార్టీ మారె విషయమై ఆయన వద్ద ప్రస్తావించగా తాను కేటీఆర్ ను నమ్ముకున్నానని చెబుతుంటారు . టీ ఆర్ యస్ లో ఆయన అసంతృప్తితో ఉన్నారని జనబలం ఉన్న నాయకుడు అయినందున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తున్నది . ఆయన పార్టీ మారనున్నారనే ప్రచారం నేపథ్యం లో ఇటీవల ఖమ్మం లో పర్యటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ఆయన ఇంటికి వెళ్లారు . ఖమ్మం లో కార్యక్రమాలు అయిపోయిన తరువాత హెలికాఫ్టర్ లో కేటీఆర్ తో పాటు హైదరాబాద్ వెళ్ళటం రాజకీయ వర్గాలలో చేర్చనీయాంశం గా మారింది . పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీ ఆర్ యస్ ను వీడతారా ? అందుకే ఆయన ఘాటుగా స్పందించారా? అనే సందేహాలు కలుగుతున్నాయి . నిత్యం ప్రజలలో ఉంటూ తనకు ఏపదవి లేకపోయినా జిల్లాలో తిరుగుతున్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు ఉన్న శ్రీనివాసరెడ్డి ని టీ ఆర్ యస్ నాయకత్వం అంత తేలికగా వదులు కుంటుందా ? అదే జరిగితే తెరాస భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు .

Related posts

బద్దలైన పైప్‌లైన్.. రోడ్డు ఎలా ముక్కలైందో చూడండి!

Drukpadam

సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ చేత ప్రమాణం…

Drukpadam

చంద్ర‌బాబు టూర్‌లో మాజీ మంత్రి ప‌ర్సు కొట్టేసిన దొంగ‌లు!

Drukpadam

Leave a Comment