Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాగర్ ఉపఎన్నిక – పట్ట భద్రుల ఎన్నిక కోసం పార్టీల ఎత్తులు

సాగర్ ఉపఎన్నిక – పట్ట భద్రుల ఎన్నిక కోసం పార్టీల ఎత్తులు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి . అన్ని రాజకీయ పార్టీలు సాగర్ ఉపఎన్నిక , పట్టభద్రుల ఎన్నిక కోసం ఎత్తులు వేస్తున్నాయి వ్యూహాలకు పదును పెడుతున్నాయి . దుబ్బాక ఎన్నికల దెబ్బకు కంగు తిన్న అధికార టీ ఆర్ యస్ తన రాజకీయ వ్యూహాల పై కసరత్తు చేస్తున్నది. దుబ్బాకలో సిట్టింగ్ సీటును సానుభూతి పవనాలతో గెలుద్దామనుకున్నా అది సాధ్యం కాకపోటం ,హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో అనుకున్న విధంగా ఫలితాలు రాకపోటం టీ ఆర్ యస్ కు పెద్ద మైనస్ గా మారింది. ఇక టీ ఆర్ యస్ పని అయిపోయిందని , ప్రజలు దాన్ని నమ్మటం లేదనే ప్రచారానికి ఊపు వచ్చింది . టీ ఆర్ యస్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న భ్రమలు తొలిగి పోతున్నాయని అందుకే ఎన్నికల ఫలితాలలో ఎదురు దెబ్బలు తగులు తున్నాయని ప్రజలు భావిస్తున్నారు . ఇదే అభి ప్రాయం టీ ఆర్ యస్ ను అభిమానించే వారిలోను , ఓటర్లలోనూ పార్టీ కార్యకర్తలలోను నెలకొంది. దీన్ని గుర్తించి పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు కెసిఆర్ కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు . రేపు జరగ బోయే ఎన్నికలలో సత్తా చాటటం ద్వారా గత ఎన్నికల ఓటములు తాత్కాలికమేనని చెప్పేందుకు టీ ఆర్ యస్ ప్రయత్నాలు ప్రారంభించింది . ఖమ్మం , వరంగల్ ,మున్సిపల్ కార్పొరేషన్ లకు జరిగే ఎన్నికలను , పట్టభద్రులకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది . ఖమ్మం వరంగల్ , నల్గొండ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికలలో గతంలో గెలిచినా పల్లా రాజేశ్వరరెడ్డి ని తిరిగి తమ అభ్యర్థిగా రంగంలోకి దించ బోతుంది . అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికలలో సునాయాసంగా విజయం సాధించిన పల్లా రాజేశ్వరరెడ్డి ఈ సారి గట్టి పోటీని ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలూ ఉన్నాయి . ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్, చెరుకు సుధాకర్ , రాణి రుద్రమ , కెసిఆర్ ప్రభుత్వం పై ఒంటరి పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న, సిపిఐ , సిపిఎం మద్దతుతో విజయసారధిరెడ్డి తో పాటు మరికొందరు పోటీ పడుతున్నారు . కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటిస్తుందా లేక కోదండరామ్ కు మద్దతు ఇస్తుందా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పటికే కోదండరామ్ కు సిపిఐ (ఎం ఎల్ ) న్యూ డెమోక్రసీ మద్దతు ఇస్తుండగా ,కాంగ్రెస్ మద్దతుకోసం చెరుకు సుధాకర్ కూడా ప్రయత్నం చేస్తున్నారు . బీజేపీ తన అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని ఖరారు చేసింది . ఎన్నికల షెడ్యూల్ కోసం పార్టీలు ఎదురుచుతున్నాయి . హైద్రాబాద్ ,రంగారెడ్డి , మహబూబుబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి బీజేపీ నుంచి రామచందర్ రావు , ఇండిపెండెంట్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ , టీ ఆర్ యస్ నుంచి బొంతు రామ్ మోహన్ తో పాటు మరి కొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి . కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి , వంశీచందర్ రెడ్డి , మహేష్ పేర్లను ఏఐసీసీ కి పంపినట్లు సమాచారం . ఈ ఎన్నికలు టీ ఆర్ యస్ కు అగ్ని పరీక్షగా మారాయి . వీటితో పాటు టీ ఆర్ యస్ ఎమ్మెల్యే మరణంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది . టీ ఆర్ యస్ సిట్టింగ్ సీటు అయినందున దాన్ని నిలబెట్టుకునేందుకు గట్టి అభ్యర్థి వేటలో ఆ పార్టీ ఉంది . అయితే అది అంత తేలికైంది కాదు . ఎందుకంటే అక్కడ నుంచి మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్డి పోటీచేయ బోతున్నారు . ఆయనకు నియోజకవర్గం మీద మంచి పట్టు ఉంది . అందువల్ల పోటీ రసవత్తరంగా ఉండే ఆవకాశం ఉంది . తిరిగి సీటు నిలబెట్టుకోవాలని టీ ఆర్ యస్ అన్ని అస్త్రాలను ప్రయోగించే ఆవకాశం ఉంది . ఇక బీజేపీ కూడా తన అభ్యర్థి ని నిలబెట్టి గట్టి పోటీనిచ్చి టీ ఆర్ యస్ కు తామే ప్రత్యాన్మాయం అని మరో సారి చాటి చెప్పటం ద్వారా 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవాలని ఎత్తులు వేస్తుంది . ఎత్తుల పైఎత్తులు రాజకీయాలలో ఎవరు విజేతలో ఎవరు పరాజితులో చూడాల్సిందే మరి !!!

Related posts

అభివృద్ధి అంటే అబద్దాలు కాదు …అసెంబ్లీ లో సీఎం జగన్ అద్భుత ప్రసంగం …

Drukpadam

జగన్ గ్రాఫ్ పడిపోలేదు …ఆ సర్వే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ది: పేర్ని నాని

Drukpadam

మంత్రులు క్ష‌మాప‌ణ చెబితే అసెంబ్లీకి వెళ‌తాం: నారా లోకేశ్‌

Drukpadam

Leave a Comment