Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
-ఉపాధ్యక్షురాలుగా కమల హారిసన్
శ్వేతసౌధం లోకి అడుగు పెట్టిన బైడాన్
అగ్రరాజ్యం అమెరికా 46 వ అధ్యక్షుడుగా జో బైడెన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత ఆదేశ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా తన కుటుంబం దగ్గర 127 సంవత్సరాలుగా ఉన్న బైబిల్ ను తనభార్య జిల్ పట్టుకోగా దానిపై చేయి పెట్టి ప్రమాణం చేశారు. ఇదే బైబెల్ ను పట్టుకొని ఆయన రెండు సార్లు దేశ ఉపాధ్యక్షుడుగా ఏడూ సార్లు సెనేటర్ గా ప్రమాణం చేయటం విశేషం .ఇప్పటి వరకు అధ్యక్ష భాద్యతలు స్వీకరించిన అందరిలోకంటే జో బైడెన్ వయసు లో పెద్దవాడు . ఆయన వయసు 78 సంవత్సరాలు . రెండువారల క్రితం హింస కాండ జరిగిన కాపిటల్ భవనం ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కోవిద్ నేపథ్యం లో ప్రమాణ స్వీకారానికి పరిమిత సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే హాజరైయ్యారు .అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ ,జార్జి బుష్ , బరాక్ ఒబామా దంపతులు హాజరైయ్యారు . కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ హాజరు కాకుండానే తన స్వంత రాష్ట్రమైన ఫ్లోరిడా కు ఒక రోజు ముందుగానే వెళ్లిపోయారు .అమెరికా చరిత్ర లేనే నూతన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించకుండా వెళ్లిన మొదటి వాడిగా ట్రంప్ మిగిలి పోయారు . ఆయన హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న పెన్స్ ఆయన వీడ్కోలు కార్యక్రమానికి హాజరు కాకుండా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావటం విశేషం .

 

ఉపాధ్యక్షురాలుగా కమల హారిసన్ ప్రమాణం
బైదెబ్ కంటే 20 నిమిషాల ముందు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలుగా కమల హారిసన్ (56 ) ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఒక మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కాలేదు.ఆఫ్రికా ,అమెరికా , దక్షణ ఆసియా మూలాలు ఉన్న మహిళా కావటం విశేషం .

Related posts

తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు!

Drukpadam

ఎవరు దొర …నేనా నువ్వా పొంగులేటిపై సండ్ర నిప్పులు…!

Ram Narayana

కేసీఆర్‌ కుటుంబమే టార్గెట్‌గా బీజేపీ బ్లాక్‌మెయిల్‌…ఎంపీ వద్దిరాజు

Drukpadam

Leave a Comment