Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం టీఆర్ యస్ వర్గపోరుపై కేటీఆర్ సున్నితమైన హెచ్చరికతో క్లాస్

ఖమ్మం టీఆర్ యస్ వర్గపోరుపై కేటీఆర్ సున్నితమైన హెచ్చరికతో క్లాస్
-విడివిడిగా కలిసిన తుమ్మల ,పొంగులేటి
-ఆరోగ్య కారణాలతో కేటీఆర్ ను కలిసి వెంటనే వెళ్ళిపోయిన తుమ్మల
-సమావేశానికి హాజరుకాని జలగం
-నియోజకవర్గాలలో పర్యటించేటప్పుడు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని పొంగులేటికి సూచన
ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో నెలకొన్న వర్గవిబేధాలు టీఆర్ యస్ కు తలనొప్పిగా మారాయి .జిల్లాలో ముఖ్యనేతల మధ్య నిత్యం ఎదో ఒకరూపంలో జరుగుతున్నా తగాదాలను గమనిస్తున్న అధిష్టానం అప్పుడప్పుడు వారిని హెచ్చరిస్తున్నా తమ పద్ధతులు మార్చుకోకపోవటం పై కెసిఆర్ సీరియస్ గానే ఉన్నట్లు సమాచారము .ఖమ్మం జిల్లా పార్టీ వ్యహారాలను చక్కదిద్దే భాద్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారు. దీనికి తోడుత్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికలు , ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీని సమాయత్తం చేయటంతో పాటు వారి మధ్య నెలకొన్న తగాదాలపై కూడా హెచ్చరిక లాంటి సూచన చేసేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు .రానున్న రోజులు కీలకమైనందున జిల్లాల ఉన్న పార్టీ నాయకత్వాన్ని సరి చేయాలనే ఉద్దేశంతో ద్రుష్టి సారించిన కేటీఆర్ . గురువారం ఖమ్మం జిల్లా నాయకులతో ప్రగతి భవన్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమై సుదీర్ఘగా చర్చించారు. అందరితో కలసి మాట్లాడిన తరువాత విడివిడిగా కొంత మంది నాయకులతో భేటీ అయ్యారు . ఇందులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు లతో వన్ టు వన్ మాట్లాడం ప్రాధాన్యత సంతరించుకొన్నది . కేటీఆర్ సమయమిచ్చి మాట్లాడంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో తమకు ఎదురౌతున్న సమస్యలు గురించి వారు వివరించారు . తుమ్మల తో మీరు పెద్దలు పార్టీకి మార్గదర్శకులుగా ఉండాలి అని అన్నట్లు సమాచారం . అయితే మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోగ్య కారణాలవల్ల ఈసమావేశంలో ఎక్కువసేపు ఉండకుండా కేటీఆర్ తో సమావేశమైయ్యారు . ఈ సందర్భంగా కేటీఆర్ ను తుమ్మల శాలువాతో సన్మానించారు . అక్కడ నుంచి వెళ్లిపోయారు. నాయకుల మధ్య సమన్వయం ఉండాలి లేకపోతే ఇబ్బదులు తప్పవని హెచ్చరికతో కూడిన సూచన ఖమ్మం నాయకులకు చేసినట్లు తెలిసింది. ఒక్కరు తప్పుచేస్తే అందరికి చుట్టుకుంటుంది.మీ సమస్యలు ఏమైనా ఉంటె జిల్లా మంత్రికి చెప్పండి . అక్కడ కాకపోతే నాదగ్గరకు రండి నేను ఉన్నాను కదా ?అని అన్నారు .జిల్లాలో సీనియర్లు ,జూనియర్లు ఉన్నారు . అందరు కలిస్తేనే పార్టీ . నాయకుల మధ్య నెలకొన్న వైషమ్యాలపై సమావేశంలో క్లాస్ తీసుకున్నట్లు తెల్సుటున్నది. ఏ ఎన్నికలు వచ్చిన కలిసికట్టుగా పనిచేసి విజయం సాదించాలి . గతంలో జిల్లా ఫలితాలు సరిగాలేవు .రాష్ట్ర మంతా ఒకరకంగా ఉంటె ఖమ్మం జిల్లా మరోరకంగా ఉంది. ఈసారి ఆలా జరగటానికి వీలులేదు .జిల్లాలో పదికి పది సీట్లు మనం గెలవాలన్నారు. జమిలి ఎన్నికలు అంటున్నారు. అవి ఎప్పుడు వచ్చిన మనం సిద్ధంగా ఉండాలి . పట్ట భద్రుల ఎన్నికల కోసం ఓటర్లను చేర్పించటంలో జిల్లాలో మంచి కృషి జరిగింది. ఎమ్మెల్యే లు అంట బాగా చేశారు. దానితోనే పని అయిపోలేదు పట్ట భద్రులందరు మన అభ్యర్థికి ఓట్లు వేసేలా ఒప్పించాలి . అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ కు ఎన్నికలు జరగబోతున్నాయి .దానిలో విజయం సాదించాలన్నారు . ఇందుకు గాను చిన్న చిన్న విబేధాలు పక్కన పెట్టండి . అన్ని సర్దుకుంటాయి . అందరికి ఆవకాశాలు వస్తాయి. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కారక్రమాలు అమలు చేస్తుంది. అభివృద్ధి కారక్రమాలు వేల కోట్లలో జరుగుతున్నాయి. వానిని ప్రజలకు వివరించండి. పట్ట భద్రుల స్థానానికి పోటీచేస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి ని గెలిపించండి అని కేటీఆర్ సమావేశంలో పేర్కొన్నారు .

 

కేటీఆర్ సమక్షంలో జరిగిన జిల్లా ముఖ్యనేతల సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఎంపీ నామ నాగేశ్వర్ రావు ,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యేలు సండ్ర వేంకట వీరయ్య ,కందాల ఉపేందర్ రెడ్డి ,రాములు నాయక్ , హరిప్రియ ,వనమా వేంకటేశ్వరరావు ,రేగా కాంతారావు ,ఎమ్మెల్సీ లు బాలసాని లక్ష్మి నారాయణ ,పల్లా రాజేశ్వరరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు , పాయం వెంకటేశ్వర్లు , మధిర,భద్రాచలం, ఇల్లందు నియోజకవర్గాల ఇంచార్జిలు లింగాల కమల్ రాజ్ , తెల్లం వెంకటరావు ,కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అయిపోయిన తరవాత పొంగులేటి తో కేటీఆర్ వన్ టు వన్ భేటీఅయ్యారు . ఈ సందర్భగా పొంగులేటి ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలను గురించి వివరించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కేటీఆర్ మీరు నియోజక వర్గాలలో పర్యటించేప్పుడు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వండని అన్నట్లు తెలిసింది. దీని వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగినట్లు సమాచారం . దీనిపై పొంగులేటి కూడా సానుకూలంగానే కేటీఆర్ సూచన తీసుకున్నట్లు తెలుస్తున్నది.సమాచారం ఇవ్వటానికి ఇబ్బంది ఏమి లేదని ఇకనుండి ఆలా జరగ కుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం . మొత్తం మీద కేటీఆర్ తో జరిగిన సమావేశం అనంతరం నాయకులూ కొంత రిలాక్స్ ఫీల్ అయ్యారు.
సమావేశానికి జలగం గైరాజర్
కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు హాజరుకాలేదు. అయినా ఊర్లో లేనందున సమావేశానికి రాలేక పోయారని తెలిసింది . అయితే ఆయన ఎక్కడకు వెళ్లారు. ఎందుకు రాలేక పోయారని వివరాలు తెలియాల్సిఉంది.

Related posts

సీఎం జగన్ సింహం లాంటి వాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధర్మాన కృష్ణదాస్!

Drukpadam

పీకే రాహుల్ పై ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.యూ టర్న్ కు కారణం ఏమిటి ?

Drukpadam

అధికారం కోసమే బీజేపీ రాముడి మంత్రం…

Drukpadam

Leave a Comment