Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జమిలి ఎన్నికలు చట్ట సవరణ లేకుండా సాధ్యమా ?

జమిలి ఎన్నికలు చట్ట సవరణ లేకుండా సాధ్యమా ?
జమిలి ఎన్నికలు …… జమిలి ఎన్నికలు ……. ఇప్పుడు అందరినోట వినిపిస్తున్నమాట …..ప్రత్యేకించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు , గత ఆరుసంవత్సరాలుగా తెలంగాణ కాబినెట్ లో నంబర్ టు గా ఉన్న కేటీఆర్ సైతం జమిలి ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని అందుకు సిద్ధంగా ఉండాలని తమ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు . వారు అంటున్నట్లుగా జిమిలి ఎన్నికలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పావులు కదుపుతుంది.అందుకనుగుణంగానే పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలోనూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. ప్రధాన మంత్రి గుజరాత్ లో జరిగిన 88 స్పీకర్ల కాన్ఫెరెన్స్ సందర్భగా చేసిన ప్రసంగంలోనూ జమిలి ఎన్నికల ఆవాశ్వకత గురించి సుదీర్ఘన్గా వివరించారు. అందువల్ల జమిలి ఎన్నికలకు అవకాశాలను తోసి పుచ్చలేము . కానీ దీనికి ముందు అనేక రాజ్యాంగపరమైన చిక్కుముడులను విప్పాల్సిఉంటుందనే విషయం వారికీ తెలియంది కాదు . చంద్రబాబు  ఆయన అధికారంలో లేనందున తన కేడర్ ను కాపాడుకునేందుకు తొందరలోనే జమిలి ఎన్నికలు వస్తున్నాయని ప్రచారం చేసి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు . ఇప్పటికే అనేక మంది తెలుగు దేశం నాయకులూ కార్యకర్తలు ఇతర పార్టీలలో చేరారు. తెలుగు దేశం అధికారం కోల్పోయిన వెంటనే చంద్రబాబుకు కుడిభుజంగా వ్యవహరించిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి ,సీఎం రమేష్ , గరికపాటి మోహనరావు , ….. ఉన్నారు . వీరంతా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా చక్రం తిప్పినవారే కావటం విశేషం . అయితే వీరిని కావాలనే చంద్రబాబే బీజేపీ లోకి పంపించారని అపవాదును మూట గట్టుకున్నారు . ఇందులో నిజం ఉన్న లేక పోయిన వారు మాత్రం అధికారంలోకి వచ్చిన జగన్ మోహనరెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా తమవంతు పాత్ర పోషిస్తున్నారని విమర్శలు ఉన్నాయి . ఉన్న తెలుగుదేశం ను కాపాడుకునేందుకు చంద్రబాబునాయుడు పడరాని పాట్లు పడుతున్నారు. ఏ చిన్న ఆవకాశం దొరికినా దాన్ని అంది పుచ్చుకొని ప్రచారం చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి . అందులో భాగంగానే జమిలి ఎన్నికల డైలాగ్ దొరికిందని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు. జమిలి ఎన్నికలు పెట్టేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అందుకు కావాల్సిన రాజ్యాంగ ప్రక్రియకు శ్రీకారం చుట్టాల్సి ఉంది . దానికి ఏఆటంకాలు లేకుండా పూర్తీ అయితే మరో సంవత్సరమో రెండు సంవత్సరాలో పడుతుంది .అప్పటిదాకా ఆగాల్సిందే .చంద్రబాబు అనుకుంటేనో , కేటీఆర్ అనుకుంటేనో జమిలి ఎన్నికలు రావు . స్వయంగా ప్రధాని అనుకున్నారు . రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు . అయినా మనకు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది . లోకసభ కాలపరిమితి 2024 జూన్ వరుకు ఉంది.లోకసభలోపే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగాల్సివుంది.దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో సగం రాష్ట్రాలకు వెనక ముందుగా ఒక సంవత్సరం లో మరో సగం రాష్ట్రాలకు లోకసభ ఎన్నికలతోపాటు ఎన్నికలు జరిపాలెనే సూచనా కూడా లా కమిషన్ చేసినట్లు తెలుస్తున్నది.అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు లోకసభ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరిగే ఆవకాశాలు ఉన్నాయి . దేశవ్యాపితంగా ఒకే ఓటర్ల లిస్టు ,ఒకే ఎన్నికకు పార్లమెంట్ తో పాటు మెజారిటీ రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంది. మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ నే అధికారంలో ఉన్నందున అందుకు పెద్ద ఇబ్బంది ఉండక పోవచ్చు . జమిలి ఎన్నికల తరువాత ఏదైనా ఒకేరాష్ట్రంలో అనిచ్చితి ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయితే పరిస్థితి ఏమిటి అనేది జరుగుతున్నా చర్చ . దాన్ని కొనసాగించటమా ?లేక రద్దు చేసి కేంద్రమే దాని అధికారాలను చూడటమా? అదెలా సాధ్యం ? ఒక ప్రభుత్వం ఒక సరి ఎన్నికైతే అది ఐదు సంవత్సరాల కలం అధికారంలో కొనసాగేలా చట్టం తీసుకురావడం . అందుకు పార్లమెంట్ చట్టం చేయాలి . అమెరికా లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నాలుగు సంవత్సరాలకు ఒక సరి ఎన్నిక జరుగుతుంది. ఒక వేల ఎన్నికైన అధ్యక్షడు ఏదైనా కారణాల వలన పదవి పోగుట్టుకుంటే ఉపాధ్యక్షడు అధ్యక్షుడిగా పూర్తీ కాలం కొనసాగుతారు . ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సరి ఎన్నిక అనుకున్న తేదీ ప్రకారం కచ్చితంగా జరిగి తీరుతుంది. అది అద్యక్షతరహా పాలనా మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం , లోకసభ లో మెజార్టీ పార్టీ నాయకుడు ప్రధానిగా ఎన్నిక అవుతారు. లేదా మెజార్టీ సభ్యుల ఆమోదం ఉండాలి . అందువల్ల జమిలి పై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సైతం జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ జరగాలని అన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగినా సమయం తీసుకుంటుంది . అవి జరగాలంటే రాజ్యాంగ సవరణలు జరగాల్సిందే !!!

Related posts

శివసేన ఎవరిదీ …. థాకరేదా ….? షిండేదా ….??

Drukpadam

ఈ పీసీసీ చీఫ్ మాకొద్దు: రేవంత్ పై సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ!

Drukpadam

సీఎం ఎవరనేది అధిష్టానానికి కట్టబెట్టిన సీఎల్పీ …ఈనెల 18 మంత్రివర్గ ప్రమాణం …

Drukpadam

Leave a Comment